హోమ్ /వార్తలు /national /

కేటీఆర్ ‘సికింద్రాబాద్’ సెంటిమెంట్...టీఆర్ఎస్‌కు కలిసొస్తుందా ?

కేటీఆర్ ‘సికింద్రాబాద్’ సెంటిమెంట్...టీఆర్ఎస్‌కు కలిసొస్తుందా ?

సికింద్రాబాద్‌లో గెలిచిన పార్టీదే ఢిల్లీలో హవా అని సికింద్రాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి సాయికిరణ్ యాదవ్ తరపున నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ వ్యాఖ్యానించారు.

    రాజకీయాల్లోనూ కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. కొన్ని స్థానాల్లో ఏ పార్టీ గెలిస్తే... ఆ పార్టీ దేశంలో, రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ అనేక స్థానాలకు ఉంది. అయితే తెలంగాణ మాజీమంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పిన లెక్క ప్రకారం... సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గానికి కూడా ఆ సెంటిమెంట్ వర్తిస్తుంది. సికింద్రాబాద్‌లో గెలిచిన పార్టీదే ఢిల్లీలో హవా అని సికింద్రాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి సాయికిరణ్ యాదవ్ తరపున నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ వ్యాఖ్యానించారు. రెండు దశాబ్దాలుగా సికింద్రాబాద్ లోక్ సభ స్థానాన్ని కాంగ్రెస్ లేదా బీజేపీ దక్కించుకుంటూ వస్తున్నాయి.

    1991, 1998, 1999, 2014లో ఇక్కడి నుంచి బండారు దత్తాత్రేయ గెలుపొందారు. ఈ సమయంలో కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఇక 2004, 2009లో సికింద్రాబాద్‌లో కాంగ్రెస్ విజయం సాధించింది. అప్పుడు కేంద్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ లెక్కన ఇక్కడ టీఆర్ఎస్ గెలిస్తే... సెంటిమెంట్ పరంగా కేంద్రంలో తమ పార్టీ హవా కొనసాగుతుందన్నది కేటీఆర్ అంచనాగా కనిపిస్తోంది. జాతీయ పార్టీలుగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్‌లకు ఈ సెంటిమెంట్ కలిసొచ్చినప్పటికీ... ప్రాంతీయ పార్టీ అయిన టీఆర్ఎస్‌కు ఈ సెంటిమెంట్ వర్తిస్తుందా అన్నది సస్పెన్సే.

    First published:

    Tags: Bjp, Congress, KTR, Lok Sabha Election 2019, Secunderabad S29p08, Telangana, Telangana Lok Sabha Elections 2019, Trs

    ఉత్తమ కథలు