హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

#YogiToNews18 | ఆక్సిజన్ కొరత వల్ల కాదు... గోరఖ్‌పూర్ మరణాలపై యోగి ఆదిత్యనాథ్

#YogiToNews18 | ఆక్సిజన్ కొరత వల్ల కాదు... గోరఖ్‌పూర్ మరణాలపై యోగి ఆదిత్యనాథ్

నెట్‌వర్క్ 18 గ్రూప్ ఎడిటర్ ఇన్ చీఫ్ రాహుల్ జోషికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

నెట్‌వర్క్ 18 గ్రూప్ ఎడిటర్ ఇన్ చీఫ్ రాహుల్ జోషికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

2017 ఆగస్ట్‌లో గోరఖ్‌పూర్‌లోని బీఆర్డీ ఆస్పత్రిలో వారం రోజుల వ్యవధిలో 72 మంది చిన్నారులు చనిపోయారు. అయితే, ఆక్సిజన్ లేకపోవడం వల్లే వారంతా చనిపోయారనే ప్రచారం జరిగింది.

ఆక్సిజన్ కొరత కారణంగా గోరఖ్‌పూర్‌లో చిన్నారులు చనిపోలేదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. కపాలానికి సంబంధించిన సమస్యల వల్లే ఆ చిన్నారులు చనిపోయారని చెప్పారు. న్యూస్‌18 నెట్ వర్క్ గ్రూప్ ఎడిటర్ ఇన్ చీఫ్ రాహుల్ జోషికి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ ఆస్పత్రిలో చిన్నారుల మరణాలపై స్పందించారు. ‘ఆక్సిజన్ కొరత వల్ల పిల్లలు చనిపోయారని ప్రచారం చేశారు. ఎలాంటి సహేతుకమైన ఆధారాలు లేకుండా మూడు రోజుల పాటు మీడియా అదే ప్రచారం చేసింది. కానీ, ఆక్సిజన్ లేకపోవడం వల్ల వారు చనిపోలేదు. కపాల సంబంధిత వ్యాధితో వారు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి వార్తలు ప్రసారం చేయడం అంటే ప్రజలకు అన్యాయం చేయడమే.’ అని యోగి ఆదిత్యనాథ్ అన్నారు.

ఉత్తరప్రదేశ్‌లో బ్రెయిన్ ఫీవర్ గురించి మాట్లాడిన యోగి ఆదిత్యనాథ్... గోరఖ్‌పూర్‌లో మెదడువాపు వ్యాధి గురించి ప్రపంచానికి తెలియజేసింది తానేనన్నారు. ఓ ఎంపీగా, యోగి ఆదిత్యనాథ్‌గా తన పోరాటాల ద్వారానే పార్లమెంట్ వరకు విషయాన్ని తీసుకెళ్లానన్నారు. అక్కడ 20 - 40 ఏళ్ల నుంచి ఆ సమస్య ఉందన్నారు. అయితే, తాను ముఖ్యమంత్రి కాకముందు 2016లో చనిపోయిన వారి కంటే 2017లో మృతిచెందిన వారి సంఖ్య తక్కువేనని చెప్పారు.

2017 ఆగస్ట్‌లో గోరఖ్‌పూర్‌లోని బీఆర్డీ ఆస్పత్రిలో వారం రోజుల వ్యవధిలో 72 మంది చిన్నారులు చనిపోయారు. అయితే, ఆక్సిజన్ లేకపోవడం వల్లే వారంతా చనిపోయారనే ప్రచారం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం రికార్డుల ప్రకారం 2017లో 5400 మెదడువాపు కేసులు నమోదయ్యాయి. అందులో 748 మంది చనిపోయారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యాధి నివారణకు చర్యలు తీసుకున్నట్టు యోగి ఆదిత్యనాథ్ చెప్పారు.

First published:

Tags: News18, Uttar pradesh, Yogi adityanath

ఉత్తమ కథలు