హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Prashant Kishor: బీజేపీని ఓడించేది అదొక్కటే: పీకే తాజా వ్యాఖ్యలు -కాబట్టే KCR స్వరంలో మార్పు?

Prashant Kishor: బీజేపీని ఓడించేది అదొక్కటే: పీకే తాజా వ్యాఖ్యలు -కాబట్టే KCR స్వరంలో మార్పు?

ప్రశాంత్ కిషోర్

ప్రశాంత్ కిషోర్

టీఆర్ఎస్ వ్యూహకర్తగా పనిచేస్తోన్న ప్రశాంత్ కిషోర్.. కేసీఆర్ ను కదాదని మమతా బెనర్జీ టీఎంసీని జాతీయ పార్టీగా నిలబెట్టేయత్నాలు చేస్తున్నారనే వార్తలపై స్వయంగా సామాధానాలిస్తూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు..

కాంగ్రెస్ పార్టీలో చేరిక ప్రయత్నం అర్దాంతరంగా, అసంపూర్ణంగా ముగిసిన తర్వాత ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తదుపరి వ్యూహాలకు పదును పెడుతున్నారు. పీకే చివరికి కాంగ్రెస్ గూటికే చేరుతారని, ఆమేరకు మెరుగైన ఆఫర్ ను అధిష్టానం త్వరలోనే ప్రతిపాదించనుందనే వార్తల నడుమ.. కాంగ్రెస్ కు అనుకూలంగా ఆయన వరుస వ్యాఖ్యానాలు చేస్తున్నారు. తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లాంటి నేతలు జాతీయ స్థాయిలో కాంగ్రెసేతర, బీజేపీయేతర ఫ్రంట్ కోసం ప్రయత్నాలు చేసి విఫలమైన దరిమిలా అసలు దేశంలో మూడో ఫ్రంట్ కు ఆస్కారమే లేదని ప్రశాంత్ కిషోర్ కుండబద్దలు కొట్టారు. టీఆర్ఎస్ వ్యూహకర్తగా పనిచేస్తోన్న పీకే.. కేసీఆర్ ను కదాదని మమతా బెనర్జీ టీఎంసీని జాతీయ పార్టీగా నిలబెట్టేయత్నాలు చేస్తున్నారనే వార్తలపై స్వయంగా సామాధానాలిస్తూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు..

దేశంలో మూడో ఫ్రంటో, నాలుగో ఫ్రంటో ఎన్నికల్లో విజయం సాధించలేదని, బీజేపీని ఓడించగలిగేది రెండో ఫ్రంట్‌ మాత్రమేనని, అంతకు మించి మరో మార్గం లేదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మమతా బెనర్జీ పార్టీ టీఎంసీ థర్డ్ ఫ్రంట్‌గా అవతరించేందుకు సాయం చేస్తున్నారా? అన్న మీడియా ప్రశ్నకు సమాధానంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

Petrol Diesel బంపర్ ఛాన్స్: తక్కువ సమయంలో భారీ లాభాలు పొందే Business Idea ఇది..


2024 ఎన్నికల్లో ప్రధాని మోదీకి పోటీగా ఎవరు నిలుస్తారు అనేదాని కంటే, బీజేపీని ఎవరు ఓడించగలరు? అని ప్రశ్నించుకుంటే గనుక ఆ పని సెకండ్ ఫ్రంట్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని, దేశంలో థర్డ్ ఫ్రంట్ ఎన్నికల్లో విజయం సాధిస్తుందని తాను అనుకోవడం లేదని ప్రశాంత్ కిషోర్ అన్నారు. బీజేపీని తొలి ఫ్రంట్ అనుకుంటే.. దానిని ఓడించేందుకు రెండో ఫ్రంట్ మాత్రమే ఉండాలని, బీజేపీని ఓడించాలని అనుకునే ఏ పార్టీ అయినా రెండో ఫ్రంట్‌గా మాత్రమే ఉండాలని, థర్డ్ ఫ్రంట్ కు ఆస్కారమే లేదని పీకే పేర్కొన్నారు.

PM Kisan: రైతులకు డబుల్ బొనాంజా? భార్యాభర్తలిద్దరూ పీఎం కిసాన్ డబ్బులు తీసుకోవచ్చా? నిబంధనలివే..


అలాంటప్పుడు మరి కాంగ్రెస్‌ను రెండో ఫ్రంట్‌గా భావిస్తారా? అన్న ప్రశ్నకు ప్రశాంత్ కిషోర్ తెలివిగా సమాధానం చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్ దేశంలోని రెండో అతిపెద్ద పార్టీ మాత్రమేనని, భవిష్యత్తులో బీజేపీని ఎదుర్కోగల సత్తా ఆ పార్టీకి లేదని చెప్పలేమని, కాంగ్రెస్ పార్టీ బలంగా వేళ్లూనుకుపోయిన పార్టీ అని, ఆ పార్టీకి అవకాశాలు లేవని చెప్పడం తప్పే అవుతుందన్నారు. అయితే, కాంగ్రెస్ లో కొన్ని మార్పులు చోటుచేసుకుంటేనే అది సాధ్యమవుతుందన్నారు.

KCR అనూహ్య వ్యూహం? మోదీ సీటుకు స్పాట్ పెట్టారా? -బీజేపీలో ఏకైక మంచి మనిషి ఆయనే!!


‘2014 తర్వాత తన వైఫల్యాలపై కాంగ్రెస్ తొలిసారి చాలా సీరియస్ గా ఇప్పుడు అంతర్గత మథనం మొదలుపెట్టింది. నేను ప్రెజెంటేషన్ ఇచ్చిన అన్ని అంశాలపై హైకమాండ్ ఏకీభవించింది. ఆ వ్యూహాలను అమలు చేసేందుకు ఏర్పాటైన ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్ (ఈఏజీ)లో నన్ను సభ్యుడిగా ఉండాలని వాళ్లు కోరారు. కానీ కాంగ్రెస్ రాజ్యంగం ప్రకారం సీడబ్ల్యూసీ, పార్లమెంటరీ పార్టీలకే అధికారాలు ఎక్కువ ఉంటాయి. ఈఏజీ ఏర్పాటు, ఆ కమిటీకి లభించే ప్రాధాన్యంపై నాకు అనుమానాలున్నాయి. కాబట్టే ఆ కమిటీలో సభ్యుడిగా చేరలేనని స్పష్టం చేశాను’అని ప్రశాంత్ కిషోర్ వివరించారు.

Hindi row: హిందీ రానివాళ్లంతా విదేశీయులే.. భారత్ విడిచి వెళ్లండి: బీజేపీ అనుబంధ యూపీ మంత్రి వార్నింగ్


ప్రశాంత్ కిషోర్ తాజా వ్యాఖ్యలు ఆయన వ్యూహకర్తగా పనిచేస్తోన్న టీఆర్ఎస్ ప్రస్తుత వైఖరికి దగ్గరగా ఉండటం గమనార్హం. బీజేపీని బంగాళాఖాతంలో కలుపుతానని, జాతీయ స్థాయిలో బీజేపీయేతర, కాంగ్రెసేతర కూటమిని ఏర్పాటు చేస్తానని శపథాలు చేసిన టీసీఎం కేసీఆర్ సడన్ గా వైఖరి మార్చుకొని ఫ్రంట్లు, టెంట్లు ఉండబోవని, పార్టీల ప్రస్తావన లేని జాతీయ ప్రత్యామ్నాయ అజెండా రూపకల్పనే తమ ధ్యేయమని ఇటీవల టీఆర్ఎస్ ప్లీనరీలో స్పష్టం చేశారు. కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా ఉండే సెకండ్ ఫ్రంట్ ద్వారా మాత్రమే బీజేపీని ఓడించగలమన్న పీకే సూత్రీకరణ నేపథ్యంలోనే కేసీఆర్ స్వరం మార్చుకున్నట్లు తెలుస్తోంది.

First published:

Tags: Bjp, Congress, Kcr, Prashant kishor

ఉత్తమ కథలు