హోమ్ /వార్తలు /national /

TSRTC Strike : మరో ఆర్టీసీ డ్రైవర్ గుండెపోటుతో మృతి..

TSRTC Strike : మరో ఆర్టీసీ డ్రైవర్ గుండెపోటుతో మృతి..

TSRTC Strike : కృష్ణయ్య మృతితో మొత్తం ఇప్పటివరకు మృతి చెందిన ఆర్టీసీ కార్మికుల సంఖ్య 17కి చేరింది. ఆర్టీసీ కార్మిక సంఘాలు ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆరోపిస్తున్నాయి.

    తెలంగాణలో మరో ఆర్టీసీ కార్మికుడు ప్రాణాలు వదిలాడు. మహబూబ్‌నగర్ డిపోకి చెందిన జి.కృష్ణయ్య గౌడ్ అనే ఆర్టీసీ డ్రైవర్ గురువారం ఉదయం 9.30గంటలకు గుండెపోటుతో మృతి చెందాడు. 20ఏళ్లుగా కృష్ణయ్య గౌడ్ ఆర్టీసీలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన స్వస్థలం బండమీదిపల్లి. మృతికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది. సరూర్ నగర్‌లో నిర్వహించిన సకల జనుల భేరీ సభ సందర్భంగా కరీంనగర్‌కి చెందిన నంగునూరి బాబు అనే డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. బాబు మృతి చెంది 24గంటలు గడవకముందే మరో డ్రైవర్ మృతి చెందడం గమనార్హం. కృష్ణయ్య మృతితో మొత్తం ఇప్పటివరకు మృతి చెందిన ఆర్టీసీ కార్మికుల సంఖ్య 17కి చేరింది. ఆర్టీసీ కార్మిక సంఘాలు ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆరోపిస్తున్నాయి.

    First published:

    Tags: CM KCR, Rtc, Telangana, TSRTC Strike

    ఉత్తమ కథలు