జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు షాక్ తగిలింది. చిత్తూరు జిల్లా మదనపల్లెలో మార్కెట్ యార్డును సందర్శించేందుకు పవన్ కళ్యాణ్‌కు మార్కెట్ యార్డు అధికారులు అనుమతి నిరాకరించారు. రాయలసీమ పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ ఈనెల 5న మదనపల్లెలోని మార్కెట్ యార్డుకు వెళ్లి టమాట రైతులను కలవాలని భావించారు. అయితే, సీజన్ ప్రారంభం కావడంతో పవన్ రాక వల్ల టమోటా రైతులకు ఇబ్బంది అవుతుందని మార్కెట్ యార్డు అధికారులు చెప్పారు. మార్కెడ్ యార్డు అధికారుల తీరుపై పవన్ విమర్శలు గుప్పించారు. ‘మీ అనుమతి ఎవరికి కావాలి, మార్కెట్ యార్డుకు రానీయకుంటే రోడ్డుపైనే కూర్చుంటా. మీకున్న 150 సీట్లు నాకు రెండు వేళ్లతో సమానం. మీరు ఎంత ఆపితే అంత మందుకెళ్తా, మేం సింహాలం.. మేకలం కాదు.’ అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. దీంతో రేపు ఏం జరుగుతుందా అని ఉత్కంఠ నెలకొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chittoor, Janasena party, Pawan kalyan