హోమ్ /వార్తలు /national /

కోడెల కొడుకు, కుమార్తెపై... లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు

కోడెల కొడుకు, కుమార్తెపై... లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు

కొడెలకు ఓ రౌడీ కొడుకు, పనికిమాలిన కూతురు ఉన్నారన్నారు లక్ష్మీ పార్వతి.

కొడెలకు ఓ రౌడీ కొడుకు, పనికిమాలిన కూతురు ఉన్నారన్నారు లక్ష్మీ పార్వతి.

కొడెలకు ఓ రౌడీ కొడుకు, పనికిమాలిన కూతురు ఉన్నారన్నారు లక్ష్మీ పార్వతి.

    ఇటీవల ఆత్మహత్య చేసుకున్న మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఎన్టీఆర్ సతీమణి, వైసీపీ నేత లక్ష్మీపార్వతి. మీడియాతో మాట్లాడుతూ కోడెలతో పాటు ఆయన కుటుంబంపై ఆమె కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కోడెల స్పీకర్ పదవికే మచ్చ తెచ్చారన్నారు. ఆయనకు ఉన్న కొడుకు, కూతురు లాంటి వ్యక్తులు మరెవరికి ఉండకూడదన్నారు. కోడెల ఏం తప్పు చేయలేదా ? ఆయన కుటుంబం కూడా ఏ తప్పు చేయలేదా అని ప్రశ్నించారు. కొడెలకు ఓ రౌడీ కొడుకు, పనికిమాలిన కూతురు ఉన్నారన్నారు. అలాంటి సంతానం మరెవరికి ఉండకూడదన్నారు. పుత్రప్రేమను అధికంగా చూపించేవాడు ఎలా నష్టపోతాడన్న దానికి మహాభారతంలో దృతరాష్ట్రుడు ఉదాహరణగా మిగిలాడన్నారు. ఆ తర్వాత కోడెల శివప్రసాద్ మనకు మంచి ఉదాహరణ అన్నారు. ఆయన స్వతహాగా మంచివాడైనా కొడుకు కూతురు వల్లే తీవ్రంగా నష్టపోయారన్నారు లక్ష్మీ పార్వతి .

    మరోవైపు ఇదే విషయంలో మాజీ సీఎం చంద్రబాబుపై కూడా ఆమె విమర్శలు గుప్పించారు. కోడెల చావును కూడా చంద్రబాబు రాజికీయం చేశారన్నారు. కోడెలకు కనీసం చంద్రబాబు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదన్నారు.  చనిపోయిన తర్వాత మాత్రం  కోడెల శవాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేశారన్నారు. నీచమైన కుట్రలు చంద్రబాబు ఆపరా అంటూ ఆమె ప్రశ్నించారు. ఎన్టీఆర్ దగ్గర నుంచి చంద్రబాబు ఒకే రకమైన రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.

    First published:

    Tags: Andhra Pradesh, AP News, AP Politics, Kodela, Kodela death, Kodela Siva Prasada Rao, Kodela sivaram, Lakshmi Parvathi, Ysrcp

    ఉత్తమ కథలు