హోమ్ /వార్తలు /national /

ఆరో రోజు 643.. మొత్తం 1497 నామినేషన్లు

ఆరో రోజు 643.. మొత్తం 1497 నామినేషన్లు

కోరుట్ల టీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తున్న విద్యాసాగర్‌రావు, చిత్రంలో ఎంపీ కవిత

కోరుట్ల టీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తున్న విద్యాసాగర్‌రావు, చిత్రంలో ఎంపీ కవిత

గడువు దగ్గరపడుతుండటంతో అభ్యర్థులు వరుసబెట్టి నామినేషన్లు వేస్తున్నారు. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులతో, స్వతంత్రులు ఉత్సాహంగా ముందుకు వస్తుండడంతో.. నామినేషన్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

  రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల ఘట్టం కొనసాగుతోంది. భారీ ర్యాలీలతో తరలివస్తున్న అభ్యర్థుల హడావిడితో నియోజకవర్గాలన్నీ కోలాహలంగా మారిపోయాయి. అభ్యర్థులందరూ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి క్యూ కడుతున్నారు. పలు నియోజకవర్గాల్లో ఈరోజు 643 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తంగా ఇప్పటివరకూ 119 నియోజకవర్గాల్లో 1497 నామినేషన్లు దాఖలైనట్టు అధికారులు చెప్పారు.

  ఆరోరోజు వివిధ నియోజకవర్గాల్లో పలు పార్టీల అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 57 మంది, బీజేపీ నుంచి 56, సీపీఐ(ఎం) తరపున 12, సీపీఐ నుంచి 1, ఎన్సీపీ నుంచి 12, బీఎస్పీ నుంచి 40, టీఆర్ఎస్ నుంచి 44, తెలుగుదేశం పార్టీ నుంచి 16, వైసీపీ నుంచి 1, ఎంఐఎం తరపున 2 నామినేషన్లు దాఖలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఒక్కరోజునే 402 అభ్యర్థులు స్వతంత్రులుగా నామినేషన్ వేశారు.

  మొత్తంగా ఇప్పటి వరకు.. అన్ని నియోజకవర్గాలకు కలిపి 1497 నామినేషన్లు దాఖలైయ్యాయి.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Bjp, Bsp, CPI, NCP, Telangana, Telangana Election 2018, Telangana News, Trs, TS Congress, TTDP, Ysrcp

  ఉత్తమ కథలు