బీజేపీలో వెటరన్ లీడర్ల ప్రస్థానం ముగిసినట్లే కనిపిస్తోంది. బీజేపీ వ్యవస్థాపక సభ్యులైన ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి నేతలకు ఈ ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. యూపీలో మరో 29 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. ఆ జాబితాలో ఎం ఎం జోషి పేరులేదు. గత ఎన్నికల్లో ఆయన ప్రాతినిధ్యం వహించిన కాన్పూర్‌లో కొత్త అభ్యర్థికి అవకాశమిచ్చారు. కాన్పూర్ లోక్‌సభ స్థానం నుంచి సత్యదేవ్ పచౌరిని బరిలోకి దింపింది బీజేపీ.
అటు ఎల్‌కే అద్వానీ సైతం ఈ ఎన్నికల్లో పోటీచేయడం లేదు. వయసు పైబడిన నేపథ్యంలోనే ఆయనకు టికెట్ ఇవ్వలేదని తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో అద్వానీ ప్రాతినిధ్యం వహించిన గాంధీనగర్ (గుజరాత్) లోక్‌సభ స్థానం నుంచి ఈసారి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పోటీచేస్తున్నారు. అద్వానీకి టికెట్ ఇవ్వకున్నా..ఆయన కూతురికైనా ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ బీజేపీ హైకమాండ్ మాత్రం అద్వానీ కుటుంబ సభ్యుల్లో ఎవరికీ టికెట్ ఇవ్వలేదు.
ఇక మేనకా గాంధీ, వరుణ్ గాంధీ లోక్‌సభ నియోజకవర్గాలను పరస్పరం మార్చారు. 2014 ఎన్నికల్లో మేనకాగాంధీ పిలిభిత్ నుంచి పోటీచేయగా..ఈసారి సుల్తాన్‌పూర్ నుంచి బరిలో దిగుతున్నారు. వరుణ్ గాంధీ గత ఎన్నికల్లో సుల్తాన్‌పూర్ నుంచి ప్రాతినిధ్యం వహించగా...ఈసారి పిలిభిత్ నుంచి పోటీచేస్తున్నారు.
బీజేపీ ప్రకటించిన జాబితాలో జయప్రదకు చోటుదక్కింది. ఇవాళే బీజేపీలో చేరిన జయప్రద.. రాంపూర్ నుంచి బరిలోకి దిగుతున్నారు. బలమైన సమాజ్‌వాదీ పార్టీ నేత అజాంఖాన్‌పై ఆమె పోటీచేయనున్నారు. జయప్రదపై సినీనటుడు సంజయ్ కపూర్‌ని పోటీకి దింపింది కాంగ్రెస్.
బీజేపీ తాజాగా ప్రకంటించిన జాబితా
జయప్రద -రాంపూర్
మేనకా గాంధీ- సుల్తాన్ పూర్
వరుణ్ గాంధీ-పిలిభిత్
రీటా బహుగుణ-అలహాబాద్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amit Shah, Bjp, Gujarat Lok Sabha Elections 2019, LK Advani, Lok Sabha Election 2019, Uttar pradesh, Uttar Pradesh Lok Sabha Elections 2019