హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Nitish Kumar : నో థర్డ్ ఫ్రంట్.. బీజేపీని ఓడించేది కాంగ్రెస్ తో కూడిన ఫ్రంట్ మాత్రమేనన్న నితీష్

Nitish Kumar : నో థర్డ్ ఫ్రంట్.. బీజేపీని ఓడించేది కాంగ్రెస్ తో కూడిన ఫ్రంట్ మాత్రమేనన్న నితీష్

బీహార్ సీఎం నితీశ్ కుమార్ (ఫైల్ ఫొటో)

బీహార్ సీఎం నితీశ్ కుమార్ (ఫైల్ ఫొటో)

No Third Front Only One Front : భారత మాజీ ఉప ప్రధాని దేవీలాల్ 109వ జయంతి సందర్భంగా హర్యానా(Haryana)లోని ఫతేబాద్‌లో ఆదివారం ఐఎన్ఎల్‌డీ(Indian National Lok Dal)పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న బీహార్ సీఎం నితీష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

No Third Front Only One Front : భారత మాజీ ఉప ప్రధాని దేవీలాల్ 109వ జయంతి సందర్భంగా హర్యానా(Haryana)లోని ఫతేబాద్‌లో ఆదివారం ఐఎన్ఎల్‌డీ(Indian National Lok Dal)పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న బీహార్ సీఎం నితీష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాల ఐక్యతా వేదకగా వివిధ విపక్ష పార్టీల నేతలు పాల్గొన్న ఈ సభలో..ప్రస్తుతానికి అన్ని ప్రతిపక్ష పార్టీలకు ప్రధాన ఫ్రంట్ అవసరమని.. థర్డ్ ఫ్రంట్ కాదని నితీష్ అన్నారు. ప్రస్తుతం తృతీయ కూటమి ప్రసక్తే లేదని నితీష్ తేల్చి చెప్పారు. 2024లో బీజేపీని ఓడించేందుకు జాతీయ స్థాయిలో కాంగ్రెస్,లెఫ్ట్ పార్టీలతో సహా బీజేపీయేతర పార్టీలన్నీ ప్రధాన ఫ్రంట్ గా ఏర్పడాలని అన్నారు. కాంగ్రెస్​తో కలిసి ఒకటే కూటమిగా ఏర్పడితే 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించవచ్చన్నారు. రాజకీయంగా లబ్ది పొందేందుకే బీజేపీ హిందూ-ముస్లింల మధ్య వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని... అసలు ఈ రెండు వర్గాలు మధ్య విభేదాలు లేవని అని నితీష్ అన్నారు. 1947లో దేశ విభజన అనంతరం ఎక్కువ సంఖ్యలో ముస్లింలు భారత్​లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు అని నితీష్ అన్నారు. అయితే గత కొద్ది రోజులుగా నితీష్ కుమార్..2024లో విపక్షాల ప్రధాని అభ్యర్థి అన్నట్లు జరుగుతున్న ప్రచారంపై ఈ సందర్భంగా నితీష్ క్లారిటీ ఇచ్చారు. తాను ప్రతిపక్షాల ప్రధానమంత్రి అభ్యర్థిని కాదని నితీష్ తెలిపారు. 2025 బిహార్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ గెలవదని నితీష్ జోస్యం చెప్పారు. బీహార్‌లో ఏడు పార్టీలు కలిసి ఉన్నాయని,బీజేపీ ఒంటరిగా ఉందని అన్నారు.

మరోవైపు,ఇదే సభలో పాల్గొన్న ఆర్జేడీ నేత, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్...ఎన్‌డీఏ ఉనికి కోల్పోయే పరిస్థితి ఉందని, ఆ కూటమి భాగస్వాములుగా ఉన్న శివసేన , అకాలీదళ్, జేడీయూలు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎన్డీయేతో తెగతెంపులు చేసుకున్నాయని అన్నారు. తప్పుడు వాగ్దనాలు చేయడం, అబద్ధాలు చెప్పడంలో బీజేపీకి ఎవరూ సాటి లేరని విమర్శించారు. . బీహార్ ప్రభుత్వం యువకులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు కసరత్తు ప్రారంభించగా.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్యోగాల కల్పనలో విఫలమైందన్నారు. కాగా, ఈ సభలో ఎన్సీపీ నాయకుడు శరద్ పవార్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, అకాలీదళ్ చీఫ్ సుఖ్‌బీర్ బాదల్,శివసేన నేత అర్వింద్ సావంత్ తదితరులు పాల్గొన్నారు. అయితే కాంగ్రెస్ తరపున ఎవరూ ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు.

ఆడు మగాడ్రా బుజ్జీ : చీతాతోనే సెల్ఫీ తీసుకున్నాడు..వైరల్ వీడియో

భావసారూప్యం కలిగిన పార్టీలన్నీ కొత్త కూటమిగా ఏర్పడాల్సిన సమయం వచ్చిందని అకాలీదళ్ చీఫ్ సుఖ్‌బీర్ బాదల్ అన్నారు. శివసేన, జేడీయూ, తమ పార్టీ కలిసి ఏర్పాటు చేసిన కూటమే నిజమైన ఎన్డీయే అని ఆయన తెలిపారు. బీజేపీ బలహీన శక్తిగా, చిన్న పార్టీగా ఉన్నప్పుడు తాము ఈ కూటమి ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. శరద్ పవార్ సైతం విపక్ష పార్టీలన్నీ ఐక్యత సాధించాలని కోరారు. 2024లో బీజేపీ ప్రభుత్వాన్ని మార్చాలంటే విపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలన్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమ సమయంలో రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకుంటామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినా, ఇంతవరకు అమలు చేయలేదని పవార్ మండిపడ్డారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Bjp, Congress, Nitish Kumar

ఉత్తమ కథలు