హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Ghulam Nabi Azad : కాంగ్రెస్‌కు అతి భారీ షాక్! -గులాం నబీ ఆజాద్ సొంత పార్టీ? -హైకమాండ్ పై తీవ్ర విమర్శలు

Ghulam Nabi Azad : కాంగ్రెస్‌కు అతి భారీ షాక్! -గులాం నబీ ఆజాద్ సొంత పార్టీ? -హైకమాండ్ పై తీవ్ర విమర్శలు

గులాం నబీ ఆజాద్ (ఫైల్ ఫోటో)

గులాం నబీ ఆజాద్ (ఫైల్ ఫోటో)

జమ్మూకాశ్మీర్ లో విస్తృతంగా పర్యటిస్తోన్న గులాం నబీ ఆజాద్.. వరుసగా సభలు, సమావేశాలు నిర్వహిస్తుండటం, ఆయన అనుచరులు, సన్నిహితులైన ఓ 20 మంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన దరిమిలా సొంత పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుత హైకమాండ్ పై తీవ్ర విమర్శలు చేస్తూనే కొత్త పార్టీ ప్రకటనపై ఆజాద్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇంకా చదవండి ...

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం గులాం నబీ ఆజాద్ తన రాజకీయ భవిష్యత్తుపై అనూహ్య వ్యాఖ్యలు చేశారు. గడిచిన కొద్ది నెలలుగా పార్టీ హైకమాండ్ దృష్టిలో రెబల్ నేతగా కొనసాగుతోన్న ఆయన కాంగ్రెస్ ను వీడి కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నది. ఇటీవల జమ్మూకాశ్మీర్ లో విస్తృతంగా పర్యటిస్తోన్న ఆజాద్.. వరుసగా సభలు, సమావేశాలు నిర్వహిస్తుండటం, ఆయన అనుచరులు, సన్నిహితులైన ఓ 20 మంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన దరిమిలా ఆజాద్ కొద్ద పార్టీ ప్రచారానికి ఎనలేని ప్రాధాన్యం లభించింది. వరుసగా రెండోసారి లోక్ సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత సోనియా గాంధీ, రాహుల్ గాంధీల నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, ఏఐసీసీ సమావేశాల్లోనే ఆజాద్ గొంతు విప్పడం, ఆయనకు మరో 22 మంది సీనియర్లు మద్దతు పలకడం, ఆ వెంటనే రాహుల్ గాంధీ పార్టీ చీఫ్ పదవి నుంచి తప్పుకొని, గాంధీయేతర కుటుంబీకులకు పార్టీ పగ్గాలు అప్పగిస్తామనడం లాంటి పరిణామాలు తెలిసిందే. జమ్మూకాశ్మీర్ లో విస్తృత పర్యటనల నేపథ్యంలో ఆజాద్ కొత్త పార్టీ పెట్టబోతున్నారనే ప్రచారంపై స్వయంగా ఆయనే క్లారిటీ ఇచ్చారు. అదే సమయంలో హైకమాండ్ పైనా నిప్పులు చెరిగారు నబీ..

జమ్మూ కాశ్మీర్ లో తన నాయకత్వంలో కొత్తగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలనే ఉద్దేశం తనకు లేదని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ చెప్పారు. అయితే భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది రాజకీయాల్లో చెప్పలేమంటూ బాంబు పేల్చారు. జమ్మూకాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు, దానికి అసెంబ్లీలో కూడిన జమ్మూకాశ్మీర్, లదాక్ కేంద్ర ప్రాలిత ప్రాంతాలుగా విభజించిన నేపథ్యంలో చాలా కాలంగా నిలిచిపోయిన రాజకీయ కార్యకలాపాలను పునరుద్ధరించడం కోసమే తాను సమావేశాలు, సభలను నిర్వహిస్తున్నానని ఆజాద్ తెలిపారు. అయితే పార్టీ పెట్టాలనే ఆలోచన ఎప్పటికీ లేదా? ప్రస్తుతానికేనా? అనే ప్రశ్నకు.. రాజకీయాల్లో తర్వాత ఏం జరుగుతుందనేది చెప్పలేమని బదులిచ్చారు. జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆయనీ కామెంట్లు చేశారు. అదే సమయంలో హైకమాండ్ పైనా విమర్శలు గుప్పించారు..

Shadnagar : చెత్త ఏరుకునే వ్యక్తితో వివాహిత అక్రమ సంబంధం.. భర్త బయటికెళ్లగానే ప్రతిరోజూ.. చివరికి ఏమైందంటే..‘ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్‌ పార్టీలో విమర్శకు స్థానం ఉండేది. కానీ ప్రస్తుత కాంగ్రెస్‌లో విమర్శకు అసలు చోటు ఉండటం లేదు. అగ్ర నాయకత్వాన్ని సవాలు చేయడానికి ఎవరూ సాహసించడంలేదు. పరిస్థితులు తప్పు దారి పట్టినప్పుడు, కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఇందిరా, రాజీవ్ గాంధీలు మితిమీరిన స్వేచ్ఛ ఇచ్చేవారు. విమర్శ చేయడాన్ని ఆ ఇద్దరూ ఏనాడూ తప్పుగా చూడలేదు. కానీ ప్రస్తుత నాయకత్వం మాత్రం విమర్శను తప్పుగానే చూస్తున్నది.

etela rajenderకు చెక్ పెడుతున్నారా? -తీన్మార్ మల్లన్న సంచలన ప్రకటనలో అర్థం ఇదేనా?యువజన కాంగ్రెస్‌లో ఇద్దరు ప్రధాన కార్యదర్శులను నియమించాలని ఇందిరా గాంధీ నాకు చెప్పారు. కానీ అందుకు నేను తిరస్కరించడంతో ఆమె సరేనన్నారు. రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో ఇందిర నన్ను పిలిపించి ఇలా పరిచయం చేశారు.. ‘గులాం నబీ నా మాటను చాలా సార్లు కాదనగలరు. అలా అసమ్మతి స్వరంతో మాట్లాడటమంటే పార్టీకి అవిధేయంగా లేదా అగౌరవంతో ఉన్నట్లు కాదు. కచ్చితంగా పార్టీ మేలు కోసమే’అని ఇదిర అనేవారు. ఇప్పుడు మాత్రం ఆ విధంగా చెప్పిన మాట వినడానికి ఎవరూ సిద్దంగా లేరు. అలా వద్దు, ఇది కాదు అని మాట్లాడితే పార్టీలోనే అపరిచితులమైపోతున్నాం..’అంటూ ఆజాద్ ఆవేదన చెందారు. మొత్తానికి కొత్త పార్టీ లేదంటూనే.. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చని నబీ హింట్ ఇస్తున్న తీరు చర్చనీయాంశమైంది.

Published by:Madhu Kota
First published:

Tags: Congress, Ghulam Nabi Azad, Jammu kashmir

ఉత్తమ కథలు