హోమ్ /వార్తలు /national /

బాలాకోట్ వైమానిక దాడులపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

బాలాకోట్ వైమానిక దాడులపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

విపక్షాలు మాత్రం బాలాకోట్ ఎయిర్‌స్ట్రైక్స్‌పై అనుమానాలు వ్యక్తంచేస్తున్నాయి. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ నేతలు మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తాజాగా చంద్రబాబునాయుడు సైతం అదే రకమైన వ్యాఖ్యలు చేయడం హాట్‌టాపిక్‌గా మారింది.

  ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత కేంద్రంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు సీఎం చంద్రబాబు. ఎన్నికల సంఘం పనితీరు, ఈవీఎంల యంత్రాలపై ఢిల్లీ వేదికగా ఉద్యమం చేస్తున్నారు. విపక్ష నేతలతో కలిసి మోదీ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. మోదీ కనుసన్నల్లోనే ఈసీ పనిచేస్తోందని మండిపడుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వంపై మరో సంచలన ఆరోపణలు చేశారు చంద్రబాబు. మాండ్యాలో కర్నాటక సీఎం కుమారస్వామి కొడుకు నిఖిల్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన చంద్రబాబు...బాలాకోట్ వైమానిక దాడులపై అనుమానలు వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌లో ఉగ్రవాదులెవరూ చనిపోలేదని..కేంద్రమే డర్టీ పాలిటిక్స్ చేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశశారు.

  ఇటీవల పాకిస్తాన్‌లో వైమానిక దాడులు జరిగాయి. 350 మంది ఉగ్రవాదులు చనిపోయారని చెప్పారు. కానీ అక్కడ ఎవరూ చనిపోలేదు. దాన్ని మేం ప్రశ్నిస్తే దేశ ద్రోహులని అంటున్నారు. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మోదీని పొగిడారు. మరి ఎవరు దేశ ద్రోహి. పాకిస్తాన్ ప్రధాని, ఇండియా ప్రధాని ఒక్కటే. ఇద్దరూ కలిసి డర్టీ పాలిటిక్స్ చేస్తున్నారు. మేమే అసలైన దేశభక్తులం. అది మా నిబద్ధత.
  చంద్రబాబు నాయుడు, ఏపీ సీఎం
  కాగా, ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా ఫిబ్రవరి 26న పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో భారత వాయుసేన వైమానిక దాడులు చేసింది. బాంబులతో జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. అక్కడ ఎంత మంది చనిపోయారన్న దానిపై స్పష్టత లేకున్నా 250 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయారని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ఐతే విపక్షాలు మాత్రం బాలాకోట్ ఎయిర్‌స్ట్రైక్స్‌పై అనుమానాలు వ్యక్తంచేస్తున్నాయి. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ నేతలు మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తాజాగా చంద్రబాబునాయుడు సైతం అదే రకమైన వ్యాఖ్యలు చేయడం హాట్‌టాపిక్‌గా మారింది.

  First published:

  Tags: Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, AP News, Chandrababu Naidu, Karnataka Lok Sabha Elections 2019, Lok Sabha Election 2019, Pulwama Terror Attack, Surgical Strike 2, TDP

  ఉత్తమ కథలు