హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

సీబీఐ చీఫ్ నియామకం వాయిదా.. షార్ట్ లిస్ట్‌ను మరింత కుదించమన్న ఖర్గే!

సీబీఐ చీఫ్ నియామకం వాయిదా.. షార్ట్ లిస్ట్‌ను మరింత కుదించమన్న ఖర్గే!

నరేంద్ర మోదీ, మల్లికార్జున్ ఖర్గే (File)

నరేంద్ర మోదీ, మల్లికార్జున్ ఖర్గే (File)

ఈ సందర్భంగా గతంలో వినీత్ నరైన్ కేసు విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును సైతం ఖర్గే గుర్తుచేసినట్టు తెలుస్తోంది.సంబంధిత శాఖకు సంబంధించిన అనుభవంతో పాటు, సమర్థత, సీనియారిటీ ప్రాతిపదికనే సీబీఐ చీఫ్ పదవిని భర్తీ చేయాలని సుప్రీం ఇచ్చిన మార్గదర్శకాలను ఆయన కమిటీ సభ్యులకు గుర్తుచేసినట్టు సమాచారం.

ఇంకా చదవండి ...

సీబీఐ డైరెక్టర్ నియామకం వాయిదా పడింది. డైరెక్టర్‌ నియామకంపై నిర్ణయం తీసుకునేందుకు గురువారం సాయంత్రం సమావేశమైన ప్రధాని మోదీ నేత్రుత్వంలోని హైపవర్ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే సమావేశాన్ని ముగించింది. కమిటీలో సభ్యుడైన కాంగ్రెస్ లోక్‌సభ పక్ష నేత మల్లిఖార్జున ఖర్గే అభ్యంతరం మేరకు సీబీఐ డైరెక్టర్ నియామకం వాయిదా పడినట్టు చెబుతున్నారు.

సీబీఐ డైరెక్టర్ పదవి కోసం షార్ట్ లిస్ట్ చేసిన ఐపీఎస్ అభ్యర్థులకు సంబంధించి మరిన్ని వివరాలు కావాలని, అలాగే వాటిని పరిశీలించడానికి ఇంకాస్త సమయం కావాలని ఖర్గే కమిటీతో చెప్పినట్టు తెలుస్తోంది. అంతేకాదు, షార్ట్ లిస్ట్‌ను మరింత కుదించి కేవలం ఐదారుగురు సీనియర్ అధికారులతో ఫైనల్ షార్ట్ లిస్ట్ తయారుచేయాల్సిందిగా ఖర్గే సూచించినట్టు సమాచారం.

ఈ సందర్భంగా గతంలో వినీత్ నరైన్ కేసు విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును సైతం ఖర్గే గుర్తుచేసినట్టు తెలుస్తోంది.సంబంధిత శాఖకు సంబంధించిన అనుభవంతో పాటు, సమర్థత, సీనియారిటీ ప్రాతిపదికనే సీబీఐ చీఫ్ పదవిని భర్తీ చేయాలని సుప్రీం ఇచ్చిన మార్గదర్శకాలను ఆయన కమిటీ సభ్యులకు గుర్తుచేసినట్టు సమాచారం.

సీబీఐ డైరెక్టర్ పదవి కోసం షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల గురించి కమిటీ హైపవర్ కమిటీ చర్చించింది. అయితే తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదు. దీనిపై మరోసారి సమావేశమై కమిటీ చర్చిస్తుంది.
ప్రభుత్వ ఉన్నతాధికారి

ఇది కూడా చదవండి : నేడే సీబీఐ డైరెక్టర్ నియామకం.. రేసులో ముందున్న ఆ ఐదుగురు!

First published:

Tags: CBI, Mallikarjun Kharge, Narendra modi

ఉత్తమ కథలు