15 సంవత్సరాల తర్వాత పార్లమెంట్ ముందుకు అవిశ్వాసం చర్చకు వచ్చింది. పన్నెండున్నరేళ్లు సీఎంగా, నాలుగేళ్లు ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ తొలిసారి అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోబోతున్నారు. మరో ఏడాదిలో ఎన్నికలు ఉండగా, ఈ సందర్భంలో ఎదుర్కొంటున్న అవిశ్వాస తీర్మానాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్, బీజేపీ భావిస్తున్నాయి. ఏపీ అంశాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఇతర సమస్యలను కూడా కాంగ్రెస్ ప్రస్తావించనుంది. దీంతోపాటు అవిశ్వాసం సందర్భంగా ఏ పార్టీ ఎటువైపు నిలుస్తుందనే క్లారిటీ రెండు పార్టీలకు రానుంది. అవిశ్వాసానికి అనుకూలంగా ఉండేవారు ఎవరు? వ్యతిరేకంగా ఉండే వారు ఎవరు? తటస్థంగా ఉండే పార్టీలేవి అనే అంశంపై స్పష్టత వస్తుంది. దీన్ని బట్టి.. రాబోయే రోజుల్లో ఎన్నికల వ్యూహాలు, పొత్తులకు ఆస్కారం ఉంటుంది.
టీడీపీ అవిశ్వాసంపై సభా నాయకుడిగా ప్రధాని మోడీ సమాధానం ఇస్తారు. అధికార పార్టీ, సంఖ్యాబలం పరంగా బీజేపీకి ఎక్కువమంది సభ్యులు మాట్లాడే అవకాశం ఉంటుంది. దీంతో మిగిలిన బీజేపీ ఎంపీలు ఇతర అంశాలపై వివరణ ఇస్తారని... ప్రధాని మోడీ మాత్రం కాంగ్రెస్ను టార్గెట్ చేస్తారని సమాచారం. గత బడ్జెట్ సమావేశాల సందర్భంగా కూడా మోడీ సభలో మాట్లాడుతూ ఈ వివాదానికి అసలు కారణం హస్తం పార్టీనేనని మండిపడ్డారు. బీజేపీ హయాంలో మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేస్తే ఎలాంటి సమస్య రాలేదని, కాంగ్రెస్ చేసిన తప్పిదాల వల్ల.. సమస్యలు వస్తున్నాయని ఆరోపించారు. మరోసారి కూడా మోడీ అవే ఆయుధాలను బయటకు తీయనున్నారు. 2019 ఎన్నికలకు పార్లమెంట్ సాక్షిగా కిక్ స్టార్ట్ చేయొచ్చు. కాంగ్రెస్ను ఎంత ఎక్కువ డ్యామేజ్ చేయగలమనే అంశం మీద బీజేపీ ప్రధానంగా దృష్టిపెట్టనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Bjp-tdp, Congress, Monsoon session Parliament, Narendra modi, Pm modi, Rahul Gandhi