హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Nitish-Prashant Kishor Meet: పీకేతో నితీశ్ రహస్య విందు.. BJP కట్టడికి భారీ స్కెచ్?

Nitish-Prashant Kishor Meet: పీకేతో నితీశ్ రహస్య విందు.. BJP కట్టడికి భారీ స్కెచ్?

నితీశ్, ప్రశాంత్ కిశోర్

నితీశ్, ప్రశాంత్ కిశోర్

బీహార్ సీఎం నితీశ్ కుమార్ సంచలన రీతిలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తో ఢిల్లీలో రహస్య విందు సమావేశంలో పాల్గొన్న తర్వాత దేశ రాజకీయాల్లో ఒక్కసారిగా ఇది హాట్ టాపిక్ అయింది..

జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఏకమవుతోన్న విపక్షాల కూటమిలోకి బీహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ కూడా చేరిపోనున్నారా? హిజాబ్ వివాదంలో బీజేపీని వ్యతిరేకించిన నితీశ్.. రాబోయే రోజుల్లో కమలంపై కత్తులు నూరడానికి రెడీ అవుతున్నారా? మమత, కేసీఆర్, ఉద్ధవ్ లాంటి ముఖ్యమంత్రులతో కలవడం ద్వారా ప్రధాని రేసులోకి నితీశ్ కూడా రానున్నారా? అంటే ప్రస్తుతానికి అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. బీహార్ సీఎం నితీశ్ కుమార్ సంచలన రీతిలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తో ఢిల్లీలో రహస్య విందు సమావేశంలో పాల్గొన్న తర్వాత ఇలాంటి ఊహాగాలు అంతులేకుండా సాగుతున్నాయి. బీజేపీకి వార్నింగ్ ఇచ్చేందుకే నితీశ్ పీకేతో కలిశారన్న బీహార్ సీఎంవో వర్గాల వ్యాఖ్యలు కూడా ఊహాగానాలకు మరింత బలం చేకూర్చినట్లయింది..

ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న బీహార్ సీఎం నితీశ్ కుమార్ ను ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ శుక్రవారం రాత్రి కలుసుకున్నారు. రెండేళ్ల కిందట జేడీయూ నుంచి పీకే బహిష్కరణకు గురైన తర్వాత వీళ్లిద్దరూ కలవడం ఇదే తొలిసారి. రహస్య విందు భేటీ వ్యవహారం లీకైన క్రమంలో, శనివారం నితీశ్ మీడియాతో మాట్లాడుతూ పాత అనుబంధాల కారణంగానే పీకేను కలిశానని చెప్పారు. ‘మాది ఇవాళ కొత్తగా ఏర్పడిన బంధం కాదు కదా..’అని నితీశ్ వ్యాఖ్యానించారు. అటు,

Chiranjeevi | Mohan Babu : ఒకే వేదికపైకి చిరంజీవి, మోహన్ బాబు -Tollywood సంచలన సమావేశం


ప్రశాంత్ కిషోర్ సైతం నితీశ్ తో విందు భేటీపై మాట్లాడుతూ.. ‘నితీశ్ జీ కరోనా బారిన పడినప్పుడు ఫోన్ చేసి పరామర్శించారు. ఆ సమయంలోనే నన్ను కలవాలనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఇవాళ వీలు కావడంతో మర్యాదపూర్వకంగా కలిశాను’అని పీకే వ్యాఖ్యానించారు. కాగా, కొద్ది రోజులుగా బీహార్ కేంద్రంగానే కాకుండా జాతీయ స్థాయిలో చోటుచేసుకుంటోన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో నితీశ్-పీకే కలయికకు ప్రాధాన్యం ఏర్పడింది.

Jagga Reddy : జగ్గారెడ్డి రాజీనామాతో కాంగ్రెస్‌కు నష్టమెంత? CM KCR చేర్చుకోవడం కష్టమేనా? ఇదే రీజన్

ప్రస్తుతం బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో కలిసి పనిచేస్తోన్న ప్రశాంత్ కిశోర్.. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీని జాతీయ స్థాయిలో విస్తరించేందుకు వ్యూహాలు అమలు చేస్తున్నారు. అదే సమయంలో 2024 సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమిని సిద్దం చేసే ప్రణాళికలోనూ పీకే ఉన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు సైతం పీకే సేవలు అందించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తమిళనాడు సీఎం స్టాలిన్, ఏపీ సీఎం జగన్ లతో పీకేకు సత్సంబంధాలున్నాయి. బీజేపీ వ్యతిరేక కూటమిలోకి ఒకప్పటి ఎన్డీఏ మిత్రుడు శిరోమణి అకాలీదళ్ చేరిపోయే అవకాశం లేకపోలేదు. ఎన్సీపీ చీఫ్ శరద్ యాదవ్ మాత్రం ప్రస్తుతానికి కాంగ్రెస్ తో దోస్తీకే కట్టుబడి ఉన్నారు. ఇక బీహార్ లో బీజేపీపైనే ఆధారపడి ప్రభుత్వాన్ని నడుపుతోన్న నితీశ్ కుమార్.. కమల దళానికి ప్రస్తుతం మిగుండుపడని వ్యవహారాలను ఎందుకు తలపెడుతున్నారనేదీ కీలకంగా మారింది..

BJP MLA Raja Singh: టీబీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు EC షాక్.. కేసుకు ఆదేశం, ప్రచారంపైనా నిషేధం


బీహార్ లో నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా నితీశ్ కు పీకే అవసరం ఏర్పడిందని, ఈ భేటీ ద్వారా బీజేపీకి గట్టి సందేశం ఇవ్వాలని బిహర్ సీఎం భావించినట్లు సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. రెండేళ్ల కిందటి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినా ఎన్డీఏ కూటమి సీఎం అభ్యర్థిగా నితీశ్ నే ఎంచుకుంది. అయితే ఇటీవల కాలంలో నితీశ్ తో బీజేపీకి మనస్పర్థలు పెరిగిపోయాయి. పలు సందర్భంగాల్లో నితీశ్ బీజేపీ వ్యతిరేక స్టాండ్ తీసుకున్నారు. తాజా హిజాబ్ ఉదంతంలోనూ ఆయన బీజేపీకి చురకలు వేశారు.

Jagga Reddy : టీకాంగ్రెస్‌లో జగ్గారెడ్డి బాంబు.. Revanth Reddy అనూహ్య స్పందన


తనకు ప్రశాంత్ కిశోర్ కొడుకులాంటి వాడని నితీశ్ కుమార్ గతంలో మీడియా ముందే చెప్పేవారు. కానీ బీజేపీ కోసం ఆ కొడుకును దూరం చేసుకోవాల్సి వచ్చింది. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వ్యతిరేక నిరసనల సమయానికి జేడీయూ ఉపాధ్యక్షుడిగా ఉన్న ప్రశాంత్ కిషోర్.. పార్టీ లైన్ ధిక్కరించి మరీ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడారు. దీంతో నితీశ్ అనివార్యంగా పీకేను తొలగించాల్సి వచ్చింది. అయితే చివరికి సీఏఏ అమలుపై కేంద్రం దాదాపు వెనక్కితగ్గడం, తాజాగా రైతుల ఉద్యమానికి కూడా కేంద్రం తలొగ్గడం, దేశవ్యాప్తంగా బీజేపీ, మోదీ వ్యతిరేక పవనాలు వీస్తుండటంతో నితీశ్ సైతం గేరు మార్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీహార్ లోనూ రాజకీయ సంచలనాలు ఉండొచ్చనే చర్చ జరుగుతోంది. మరి నితీశ్ ను పీకే ప్రధాని రేసులో నిలబెడతారా? లేదా? అనేది చూడాలి.

Published by:Madhu Kota
First published:

Tags: Bihar, JDU, Nitish Kumar, Prashant kishor

ఉత్తమ కథలు