హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Nitish Kumar : 2024లో విపక్షాల ప్రధాని అభ్యర్థిగా నితీష్?తేల్చి చెప్పేసిన బీహార్ సీఎం

Nitish Kumar : 2024లో విపక్షాల ప్రధాని అభ్యర్థిగా నితీష్?తేల్చి చెప్పేసిన బీహార్ సీఎం

బీహార్ సీఎం నితీశ్ కుమార్ (ఫైల్ ఫొటో)

బీహార్ సీఎం నితీశ్ కుమార్ (ఫైల్ ఫొటో)

Nitish Kumar on being seen as PM face : బీహార్ లో బీజేపీకి బైబై చెప్పి రెండు రోజుల క్రితం ఆర్‌జేడీ సార‌ధ్యంలోని మహాకూటమితో కలిసి నితీష్ కుమార్ కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఉప ముఖ్యమంత్రిగా ఆర్జేడీ అగ్రనేత తేజస్వీ యాదవ్ భాధ్యతలు చేపట్టారు. అయితే ఈ వారం ప్రారంభంలో ఎన్డీయే కూటమికి నితీష్ కుమార్ గుడ్ బై చెప్పిననాటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త ప్రచారం ఊపందుకుంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Nitish Kumar on being seen as PM face : బీహార్(Bihar) లో బీజేపీకి బైబై చెప్పి రెండు రోజుల క్రితం ఆర్‌జేడీ(RJD) సార‌ధ్యంలోని మహాకూటమితో కలిసి నితీష్ కుమార్(Nitish Kumar) కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఉప ముఖ్యమంత్రిగా ఆర్జేడీ అగ్రనేత తేజస్వీ యాదవ్(Tejaswi Yadav) భాధ్యతలు చేపట్టారు. అయితే ఈ వారం ప్రారంభంలో ఎన్డీయే కూటమికి నితీష్ కుమార్ గుడ్ బై చెప్పిననాటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త ప్రచారం ఊపందుకుంది. వచ్చే ఎన్నికల్లో మోదీకి ప్రత్యర్థిగా విపక్షాల కూటమి తరపున నీతీశ్​ పోటీ చేస్తారని జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దీనిపై తాజాగా నితీష్ కుమార్ స్పందించారు. తాను ప్ర‌ధాని ప‌ద‌విపై క‌న్నేశాన‌ని వ‌స్తున్న వార్త‌ల‌ను వ‌దంతులుగా తోసిపుచ్చారు.

శుక్రవారం నితీష్ మీడియాతో మాట్లాడుతూ.." అందరికీ నమస్కరించి చెబుతున్నాను. ప్రధాని పదవికి పోటీపడే ఆలోచనలు నాకు లేదు. దయచేసి ఈ విషయాన్ని వదిలేయండి. అయితే దేశంలోని విపక్ష పార్టీలన్నింటినీ ఏకం చేయడానికి మాత్రం ప్రయత్నిస్తా. విప‌క్షాల‌న్నీ క‌లిసిక‌ట్టుగా పని చేయాలని కోరుకుంటున్నా అని అన్నారు. 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌లే ల‌క్ష్యంగా విప‌క్షాలు ఏక‌తాటిపైకి రావాల‌ని ఈ దిశ‌గా త‌న‌కు పెద్ద‌సంఖ్య‌లో ఫోన్ కాల్స్ వ‌స్తున్నాయ‌ని బిహార్ సీఎం నితీష్ కుమార్ స్ప‌ష్టం చేశారు. ఈ దిశ‌గా తాను ముందుకెళుతున్నాన‌ని, అయితే ముందుగా బీహార్‌ లో చక్క‌దిద్దాల్సివ‌ని ఎన్నో ఉన్నాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు.

Intresting : 20 రూపాయల కోసం 22 ఏళ్ల పాటు రైల్వేపై పోరాటం..చివరికి దక్కింది రూ.73!

విపక్షాలు ఐక్యంగా ముందుకెళితే మెరుగైన ఫ‌లితాలు వ‌స్తాయ‌ని అన్నారు. తాను ఎన్‌డీఏకు వెన్నుపోటు పొడిచాన‌నే ఆరోప‌ణ‌ల‌ను నితీష్ కుమార్ తోసిపుచ్చారు. బీహార్ డిప్యూటీ సీఎం తేజ‌స్వి యాద‌వ్‌కు జ‌డ్ ప్ల‌స్ సెక్యూరిటీ అందించ‌డం ప‌ట్ల బీజేపీ ఆరోప‌ణ‌ల‌ను నితీష్ ఖండించారు. డిప్యూటీ సీఎంకు భ‌ద్ర‌త ఇవ్వ‌డంలో త‌ప్పేముంద‌ని,ఈ విషయంలో బీజేపీ విమ‌ర్శ‌లు అర్ధ‌ర‌హిత‌మ‌ని అన్నారు.త్వరలో బిహార్ రాష్ట్ర క్యాబినెట్​ను విస్తరిస్తామని నీతీష్‌ తెలిపారు. మహాకూటమిలోని పార్టీలతో కలిసి చర్చిస్తున్నామని, 15వ తేదీ తర్వాత విస్తరణ జరుగుతుందని చెప్పారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తేజస్వీ ఇచ్చిన పది లక్షల ఉద్యోగాల హామీపై చర్చిస్తున్నామని, అందుకు తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. 2015-16లో చెప్పినవన్నీ చేశాం కాబట్టి ఇప్పుడు కూడా ఈ హామీని నెరవేరుస్తాం అని నీతీశ్​ అన్నారు.

First published:

Tags: Bihar, Nitish Kumar, Tejaswi Yadav

ఉత్తమ కథలు