హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక వ్యాఖ్యలు.. మనసులో మాట చెప్పకనే చెప్పిన జెడీయూ నేత..

బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక వ్యాఖ్యలు.. మనసులో మాట చెప్పకనే చెప్పిన జెడీయూ నేత..

2022-23లో రాష్ట్ర జిడిపికి వ్యతిరేకంగా అప్పు 38.7 శాతానికి చేరుతుందని అంచనా వేసిన బీహార్‌లో అత్యంత దారుణమైన పరిస్థితి ఉంది. గతేడాది నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుండగా, 2020-21లో 36.7గా ఉంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కంటే బకాయి అప్పులు వేగంగా పెరుగుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 9.7 శాతం వృద్ధితో రూ.7.45 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా. అక్కడే బడ్జెట్ ఈ సంవత్సరంలో బకాయి ఉన్న రుణాలు 2.88 లక్షల కోట్లుగా అంచనా వేయబడింది, ఇది 2018-19 కంటే 70 శాతం ఎక్కువ.

Nitish Kumar: బీహార్ సీఎం నితీష్ కుమార్ బుధవారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

Nitish Kumar Comments:  ప్రస్తుతం దేశంలో రాష్ట్రపతి ఎన్నికలపై చర్చ కొనసాగుతుంది. దీనిపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో.. తమ దేశ ప్రథమ పౌరుడిని ఎన్నుకోవడంలో రాజకీయాలు ప్రారంభించాయి. ఇప్పటికే దీనిపై దేశంలో హీట్ కొనసాగుతుంది. ఇక తాజాగా, బీహార్ సీఎం నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.

బీహార్ సీఎం, జనతాదళ్ యునైటేడ్ నేత నితీష్ కుమార్ బుధవారం బీహర్ అసెంబ్లీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. అవకాశం వస్తే  రాజ్యసభ కు వెళ్లాలనుకుంటున్నట్లు వ్యాఖ్యలు చేశారు. ఆయన బీజేపీని ఎప్పుడు విమర్శించే ఆయన ప్రస్తుతం ఈ చేసిన కామెంట్లతో రాజకీయ చర్చకు తెరలేపారు. జర్నలిస్ట్ లతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. నితీష్ కుమార్ 16 ఏళ్ల పాటు సీఎంగా సేవలందించారు. ఆయన గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

కానీ .. ఈ రోజు ఆయన అవకాశం వస్తే.. రాజ్యసభకు వెళ్లాలని ఉందని తన మనసులో మాట చెప్పకనే చెప్పారు. ఆయన బార్హ్ నియోజక వర్గం నుంచి ఐదుసార్లు గెలిచారు. ప్రస్తుతం నలంద నుంచి పోటిచేస్తారా అని జర్నలిస్ట్ లు ఆయనను ప్రశ్నించారు. దీంతో ఆయన బార్హ్ నుంచే పోటిచేస్తున్నట్లు తెలిపారు. మీరు రాజ్యసభకు వెళ్ళాలనుకుంటున్నారా.. అన్న ప్రశ్నకు.. వెళ్లడానికి నాకు అభ్యంతరం లేదు. కానీ ప్రస్తుతం నాకు ముఖ్యమంత్రి బాధ్యతలు ఉన్నాయి. నేను 16 ఏళ్లుగా ప్రజలకు సేవచేస్తున్నానని తెలిపారు.

ప్రస్తుతం నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయా దుమారాన్ని రేకెత్తించాయి. బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ లోని ఒక వర్గం నాయకులు.. ఇప్పటికే నితీష్ కు, బీజేపీ అధినాయకత్వం నుంచి ఏదైన.. ఆఫర్ చేశారా అంటూ కొత్త చర్చకు దారితీసింది. నితీష్ కుమార్ 2020 ఎన్నికలలో వరుసగా రెండవసారి సీఎం గా గెలిచారు. అయితే,కొద్ది రోజులుగా బీజేపీతో విభేదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి.

Published by:Paresh Inamdar
First published:

Tags: Bihar, Nitish Kumar

ఉత్తమ కథలు