హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

నిర్భయ కేసులో కొత్త మలుపు... విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ బాబ్డే

నిర్భయ కేసులో కొత్త మలుపు... విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ బాబ్డే

నిర్భయ తరపున చీఫ్ జస్టిస్ బాబ్డే కోడలు వాదనలు వినిపించారు.

నిర్భయ తరపున చీఫ్ జస్టిస్ బాబ్డే కోడలు వాదనలు వినిపించారు.

నిర్భయ తరపున చీఫ్ జస్టిస్ బాబ్డే కోడలు వాదనలు వినిపించారు.

    నిర్భయ కేసులో మరో కొత్త మలుపు చోటు చేసుకుంది. నిర్భ కేసు విషయంలో నిందితుడు అక్షయ్ సింగ్ తనకు క్షమాభిక్ష పెట్టాలని పిటిషన్ వేసుకున్నాడు. అయితే ఈ పిటిషన్ విషయంలో విచారణ చేపట్టిన  ధర్మాసనం నుంచి జస్టిస్ బాబ్డే తప్పుకున్నారు. నిర్భయ తరపున చీఫ్ జస్టిస్ బాబ్డే కోడలు వాదనలు వినిపించారు. అయితే కోడలు వాదించే కేసులో తీర్పు ఇవ్వలేనన్న జస్టిస్ బాబ్డే స్పష్టం చేశారు. అందుకే ఈ ధర్మాసనం నుంచి తప్పుకున్నట్లు జస్టిస్ బాబ్డే తెలిపారు. మరోవైపు అక్షయ్ సింగ్ రివ్యూ పిటిషన్‌పై విచారణ కూడా వాయిదా వేశారు. విచారణను రేపటికి వాయిదా వేశారు.

    2012లో నిర్భయపై కదులుతున్న బస్సులో ఆరుగురు గ్యాంగ్ రేప్ ‌కు పాల్పడ్డారు. ఆతర్వాత బాధితురాల్ని నడిరోడ్డుపై పడేశారు. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 13రోజుల పాటు పోరాడిన నిర్భయ చివరకు ప్రాణాలు విడిచింది. ఆమె బాయ్ ఫ్రెండ్ కూడా తీవ్ర గాయాలపాలై ప్రాణాలతో బయటపడ్డాడు.  ఈ కేసులో మొత్తం ఆరుగుర్ని దోషులుగా గుర్తించగా... వారిలో ఒకడు... తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మరొక వ్యక్తి మైనర్ కావడంతో... జువెనైల్ చట్టాల ప్రకారం మూడేళ్ల జైలు శిక్ష తర్వాత రిలీజ్ అయ్యాడు. మిగతా నలుగురూ తీహార్ జైల్లో ఉన్నారు. వాళ్లు క్షమాబిక్ష పిటిషన్ పెట్టుకోవడంతో... శిక్ష అమలు కాలేదు. తాజాగా... రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్... క్షమాబిక్ష పిటిషన్‌ను తిరస్కరించడంతో... ఇప్పుడు కేంద్రానికి శిక్ష అమలు చేసేందుకు అవకాశం వచ్చింది.

    First published:

    Tags: Delhi, Nirbhaya, Supreme Court

    ఉత్తమ కథలు