సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. టీఆర్ఎస్ వర్గాలకు బాగా తెలిసిన పేరు. గత ప్రభుత్వంలో ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్‌గా పనిచేశారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వనపర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనా ఆయన ఏకంగా మంత్రి అయ్యారు. అత్యంత కీలకమైన ఆర్థికశాఖ బాధ్యతలను కేసీఆర్ నిరంజన్‌రెడ్డికి అప్పగించనున్నారు. అధికారికంగా ప్రకటింకచమే తరువాయి. అయితే, ఆయన మంత్రి కావడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఆయన ఫాలో అయిన సెంటిమెంట్ కూడా ఒకటి కావడం విశేషం. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు నమ్మకాలంటే ఎంత నమ్మకమో అందరికీ తెలిసిందే. ముహూర్తం లేకుండా ఏ పని కూడా మొదలు పెట్టరు. వారం, వర్జ్యం అన్నీ చూసుకున్న తర్వాతే ఆయన అడుగులు వేస్తారు. కేబినెట్ విస్తరణ కూడా మాఘమాసం పౌర్ణమి రోజు ఏర్పాటు చేశారు. నిరంజన్ రెడ్డికి కూడా సెంటిమెంట్స్ ఎక్కువే. అందుకు నిదర్శనం ఈ ఫొటో.
పసుపు కండువా వేసుకుని నామినేషన్ వేస్తున్న నిరంజన్ రెడ్డి
టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తూ, పసుపు కండువా వేసుకోవడం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. అయితే, టీఆర్ఎస్ గులాబీ కండువా వేసుకుని నామినేషన్ వేసే కంటే పసుపు కండువాతో నామినేషన్ వేస్తే ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు మంత్రి కూడా అవుతారని ఓ పండితుడు నిరంజన్ రెడ్డికి సూచించారట. ఆ జ్యోతిష్యుడు చెప్పింది చెప్పినట్టు చేశారు నిరంజన్ రెడ్డి. పసుపు కండువా వేసుకుని నామినేషన్ వేయడం ఏంటని ఎవరైనా ఎద్దేవా చేసినా.. ఆయన డోంట్ కేర్ అనుకున్నారు. ఇప్పుడు మంత్రి అయ్యారు. నిరంజన్ రెడ్డి నమ్మిన సెంటిమెంట్ వర్కవుట్ అయిందని ఆయన సన్నిహితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Telangana, Telangana Election 2018, Trs