Home /News /national /

POLITICS NEWS18 IPSOS EXIT POLL BIG SHOCK TO CONGRESS JDS ALLIANCE BJP WILL WIN MAJORITY SEATS IN KARNATAKA SK

News18-IPSOS ExitPoll: కర్నాటకలో కాంగ్రెస్-జేడీఎస్‌కు షాక్..కమలానికే మెజార్టీ సీట్లు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కాంగ్రెస్ పార్టీ 20 స్థానాల్లో పోటీ చేయగా... జేడీఎస్ 8 స్థానాల్లో బరిలోకి దిగింది. జేడీఎస్ నుంచి మాజీ ప్రధాని దేవేగౌడ, ఆయన మనవళ్లు ప్రజ్వల్, నిఖిల్ గౌడ బరిలో నిలిచారు.

    కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ మార్క్‌కు కొద్దిదూరంలో ఆగిపోయి అధికారం కోల్పోయింది బీజేపీ. ఐతే లోక్‌సభ ఎన్నికల నాటికి కమలం బాగా పుంజుకుంటున్నట్లు తెలిసింది. News18-IPSOS నిర్వహించిన సర్వేలో బీజేపీకి మెజార్టీ స్థానాలు దక్కాయి. కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి షాకిస్తూ అత్యధిక లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకున్నట్లు సర్వేలో తేలింది. మొత్తం 28 లోక్‌సభ స్థానాలున్న కర్నాటకలో బీజేపీకి 21-23 సీట్లు వచ్చే అవకాశముందని News18-IPSOS ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. ఇక కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి 5-7 లోక్‌సభ స్థానాలు దక్కకున్నట్లు వెల్లడించింది. వీటిలో కాంగ్రెస్‌కు 3-5, జేడీఎస్‌కు 1-3 స్థానాలు వస్తాయని తెలిపింది.















    కర్నాటక28
    బీజేపీ21-23
    కాంగ్రెస్+జేడీఎస్5-7

    కర్ణాటకలో మొత్తం 28 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ రెండు, మూడో దశలో ఎన్నికలు నిర్వహించింది కేంద్ర ఎన్నికల కమిషన్. రెండో దశలో 14 స్థానాలు, మూడో దశలో 14 స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. కర్ణాటకలో కాంగ్రెస్, జేడీయూ కలిసి ఎన్నికల్లో పోటీ చేశాయి. కాంగ్రెస్ పార్టీ 20 స్థానాల్లో పోటీ చేయగా... జేడీఎస్ 8 స్థానాల్లో బరిలోకి దిగింది. జేడీఎస్ నుంచి మాజీ ప్రధాని దేవేగౌడ, ఆయన మనవళ్లు ప్రజ్వల్, నిఖిల్ గౌడ బరిలో నిలిచారు.

    ఇక దక్షిణాదిలో బీజేపీ బలంగా ఉన్న ఒకే ఒక్క రాష్ట్రమైన కర్ణాటకలో ఆ పార్టీ మరోసారి ఒంటరిగా బరిలోకి దిగింది. 27 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపిన బీజేపీ, మాండ్యలో మాత్రం ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన సినీనటి సుమలతకు మద్దతు ఇచ్చింది.  మాండ్య లోక్ సభ స్థానంలో సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ, ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగిన సినీనటి సుమలత మధ్య హోరాహోరీ పోరు సాగింది. 2014 ఎన్నికల్లో బీజేపీకి 17 లోక్ సభ స్థానాలు దక్కాయి. కాంగ్రెస్ పార్టీ 9, జేడీఎస్ 2 స్థానాల్లో విజయం సాధించింది.

     
    First published:

    Tags: Bjp, Congress, Exit polls 2019, Jds, Karnataka Lok Sabha Elections 2019, Lok Sabha Election 2019

    తదుపరి వార్తలు