Home /News /national /

POLITICS NCP CHIEF SHARAD PAWAR DISSOLVES ALL DEPARTMENTS AND CELLS OF PARTY WEEKS AFTER MVA COLLAPSE PVN

Sharad Pawar : రాజకీయ చాణక్యుడే..శరద్ పవార్ సంచలన నిర్ణయం

శరద్ పవార్ (పాత ఫొటో)

శరద్ పవార్ (పాత ఫొటో)

NCP Chief Sharad Pawar : మహారాష్ట్ర రాజకీయాల్లో(Maharshtra Politics) కొద్ది రోజులుగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవల శివసేన పార్టీలో అసమ్మతి స్వరాలు మొదలవడం,శివసేన నాయకుడు ఏక్ నాథ్ షిండే నేతృత్వంలొ ఆ పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో సీఎం పదవికి ఉద్దవ్ ఠాక్రే రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

ఇంకా చదవండి ...
  NCP Chief Sharad Pawar : మహారాష్ట్ర రాజకీయాల్లో(Maharshtra Politics) కొద్ది రోజులుగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవల శివసేన పార్టీలో అసమ్మతి స్వరాలు మొదలవడం,శివసేన నాయకుడు ఏక్ నాథ్ షిండే నేతృత్వంలొ ఆ పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో సీఎం పదవికి ఉద్దవ్ ఠాక్రే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బీజేపీ మద్దతులో ఏక్ నాథ్ షిండే సీఎం పగ్గాలు చేపట్టడం,ఇష్టం లేకపోయినా బీజేపీ ఆదేశాల మేరకు మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్..షిండే కేటినెట్ లో డిప్యూటీ సీఎంగా విధులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. షిండే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినా ఆ రాష్ట్రంలో ఇంకా రాజకీయ వేడి తగ్గలేదు. మహారాష్ట్రలో అధికార మార్పిడితో రాజకీయాలు వేడెక్కిన వేళ నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(NCP)అధినేత శరద్‌ పవార్‌(Sharad Pawar) సంచలన నిర్ణయం తీసుకున్నారు.

  శరద్ పవార్ ఆమోదంతో NCPలోని అన్ని విభాగాలు, సెల్స్‌ను తక్షణమే రద్దు చేసినట్లు ఎన్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రఫుల్ పటేల్ బుధవారం ఓ ట్వీట్ లో తెలిపారు. పార్టీలో ఆకస్మికంగా తీసుకున్న ఈ నిర్ణయం వెనక గల కారణాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. మహారాష్ట్రలో మహా వికాస్‌ అఘాడీ కూటమి ప్రభుత్వం కూలిపోయిన కొన్ని రోజుల్లోనే ఈ నిర్ణయం తీసుకోవటం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే నేషనలిస్ట్‌ మహిళా కాంగ్రెస్‌, నేషనలిస్ట్ యువ కాంగ్రెస్‌, నేషనలిస్ట్‌ విద్యార్థి కాంగ్రెస్‌లను రద్దు నుంచి మినహాయించినట్లు ప్రఫుల్ పటేల్ చెప్పారు.

  4 Zodiac Signs : రాబోయే 119 రోజులు ఈ నాలుగు రాశుల వారికి మహర్దశ..పట్టిందల్లా బంగారమే!

  మరోవైపు,ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కేబినెట్‌లో లుకలుకలు మొదలయ్యాయి. యోగి ఆదిత్యనాథ్‌ కు సొంత మంత్రుల నుంచే వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. సీఎం యోగిపై ఇద్దరు మంత్రులు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిలో ఒకరు ఏకంగా రాజీనామానే సమర్పించగా.. మరొకరు బీజేపీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీ వెళ్లడం సంచలనం సృష్టిస్తోంది. తాను దళితుడిని కావడం వల్లే తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపిస్తూ జలశక్తి శాఖ మంత్రి దినేశ్ ఖటీక్‌ బుధవారం రాజీనామా చేశారు. ఏకంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు రాజీనామా లేఖను పంపి, అవినీతి ఆరోపణలు చేశారు. అమిత్ షాకు పంపిన రాజీనామా లేఖలో.."నా సామాజిక వర్గం కారణంగా నాకు గౌరవం దక్కడం లేదు. ఒక మంత్రిగా నాకు ఎలాంటి అధికారం లేదు. నేను మంత్రిని కాబట్టి నాకో కారు ఇచ్చారు. గత వంద రోజులుగా నాకు ఎలాంటి పని లేదు. అధికారిక సమావేశాలకు పిలవలేదు. నా శాఖ గురించే నాకు ఏమీ చెప్పడం లేదు. ఇది దళిత సమాజానికి అవమానమే. ఇలా నేను మంత్రిగా ఉండటం దళిత సమాజానికి ఏ ప్రయోజనమూ లేదు. ఇది నాకు ఎంతో ఆవేదన కలిగిస్తోంది. బదిలీల్లో అవినీతి చోటుచేసుకుంది. దాని గురించి అడిగితే సమాచారం ఇవ్వడం లేదు. నా శాఖ కార్యదర్శి నా మాట వినడం లేదు. నమామీ గంగ పథకంలో కూడా అవినీతి చోటుచేసుకుంటోంది. ఇవన్నీ నన్ను బాధకు గురిచేశాయి. అందుకే రాజీనామా చేస్తున్నా"అని దినేశ్ ఆరోపించారు.  యూపీ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన జితిన్ ప్రసాద కూడా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. తన శాఖలో సీఎం కార్యాలయం వేలుపెడుతోందని,తన అధికారులను బదిలీ చేస్తోందని ప్రజాపనుల శాఖ(PWD)మంత్రి జితిన్‌ ప్రసాద అలిగి ఢిల్లీ వెళ్లారు. అమిత్‌ షాకు ఫిర్యాదు చేసేందుకు జితిన్‌ ప్రసాద ప్రయత్నిస్తున్నారు. యోగి సీఎంగా ఉన్న తొలి ఐదేళ్లలో ఇలాంటి అసమ్మతి లేదు. ప్రజాపనుల శాఖలో జరిగిన బదిలీల్లో అవినీతి జరిగిందన్న ఆరోపణలతో ఐదుగురు సీనియర్ అధికారులు సస్పెండ్ అయ్యారు. అందులో జితిన్ ప్రసాద ఓఎస్‌డీ కూడా ఉన్నారు. ఈ వ్యవహారంపై సీఎం యోగి ఇటీవల జితిన్ ప్రసాదను పిలిపించి మందలించారని.. దీనితో జితిన్ ఆగ్రహంగా ఉన్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
  Published by:Venkaiah Naidu
  First published:

  Tags: Maharashtra, NCP, Sharad Pawar

  తదుపరి వార్తలు