Home /News /national /

POLITICS NATIONAL YOGI ADITYANATH TOOK OATH AS UTTAR PRADESH CHIEF MINISTER FOR THE SECOND TIME IN PRESENCE OF PM NARENDRA MODI AND HOME MINISTER AMIT SHAH IN LUCKNOW AK

Yogi Adityanath: రెండోసారి యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణం.. హాజరైన ప్రధాని మోదీ

రెండోసారి యూపీ సీఎంగా ప్రమాణం చేసిన యోగి ఆదిత్యనాథ్ (Image: Ani)

రెండోసారి యూపీ సీఎంగా ప్రమాణం చేసిన యోగి ఆదిత్యనాథ్ (Image: Ani)

Uttar Pradesh: లక్నోలో వేలాదిమంది జనం, ప్రధాని నరేంద్రమోదీ సమక్షంలో యోగి ఆదిత్యనాథ్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.

    యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించిన తర్వాత యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కొద్దిసేపటి క్రితం లక్నోలో వేలాది మంది జనం సమక్షంలో ఆయన సీఎంగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ(PM Modi), కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah)సహా ఇతర కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఆయనతో పాటు కేశవ ప్రసాద మౌర్య, బ్రజేష్ పాఠక్ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో పాటు కేబినెట్ మంత్రులుగా సురేశ్ కుమార్ ఖన్నా, సూర్య ప్రతాప్ షాహి, స్వతంత్ర దేవ్ సింగ్, బేబీ రాణి మౌర్య, లక్ష్మీ నారాయణ చౌదరి, జైవీర్ సింగ్, ధర్మపాల్ సింగ్, నంద గోపాల్ నంద, భూపేంద్ర సింగ్ చౌదరి, అనిల్ రాజ్‌బర్, జితేంద్ర ప్రసాద, రాకేశ్ సచాన్, అరవింద్ కుమార్ శర్మ, యోగేంద్ర ఉపాధ్యాయ్, అశిశ్ పాటిల్, సంజయ్ నిషద్ ప్రమాణం చేశారు.

    యోగి కేబినెట్‌లో స్వతంత్ర్య హోదాతో కూడిన మంత్రులుగా నితిన్ అగర్వాల్, కపిల్ దేవ్ అగర్వాల్, రవీంద్ర జైశ్వాల్, సందీప్ సింగ్, గులాబ్ దేవీ, గిరీశ్ చంద్ర యాదవ్, ధర్మవీర్ ప్రజాపతి, అసిమ్ అరుణ్, జేపీఎస్ రాథోడ్, దయాశంకర్ సింగ్, నరేంద్ర కశ్యప్, దినేశ్ ప్రతాప్ సింగ్, అరుణ్ కుమార్ సక్సేనా, దయాశంకర్ మిశ్రా దయాలు ప్రమాణం చేశారు.

    యోగి గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దినేష్ శర్మకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించాలని భావించిన పార్టీ.. ఆయన స్థానంలో అదే సామాజికవర్గానికి చెందిన బ్రజేష్ పాఠక్‌ను డిప్యూటీ సీఎంగా ఎంపిక చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో పాఠక్ రాజధాని లక్నోలోని కాంట్ అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. 2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పి) నుండి భారతీయ జనతా (బిజెపి)లోకి మారిన పాఠక్, న్యాయ మంత్రిగా వ్యవహరించారు. రాష్ట్రంలో బలమైన నాయకుడిగా, బ్రాహ్మణవర్గానికి చెందిన కీలక నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం కోసం పాఠక్‌ను పలువురు అభ్యర్థుల కోసం ప్రచారం నిర్వహంచారు.

    PM KISAN: గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ డబ్బులు వచ్చేది అప్పుడే.. మీకూ రావాలంటే ఇవి తప్పనిసరి

    ఈ కుర్రాడు రియల్ స్టూడెంట్ నం.1.. ఇతడి గురించి తెలుసుకుంటే.. మీరు కూడా ఇదే అంటారు

    ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 255 సీట్లు గెలుచుకోగా, దాని మిత్రపక్షాలైన అప్నా దళ్ (సోనేలాల్) 12 సీట్లు, నిషాద్ పార్టీ 6 సీట్లు గెలుచుకున్నాయి. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రావడంతో చరిత్ర సృష్టించింది. 37 ఏళ్లలో రాష్ట్రంలో మరే ముఖ్యమంత్రి కూడా ఈ ఘనత సాధించలేదు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష సమాజ్‌వాదీ పార్టీ 111 సీట్లు గెలుచుకోగా, దాని మిత్రపక్షం రాష్ట్రీయ లోక్‌దళ్ 8 సీట్లు, మరో మిత్రపక్షం సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ ఆరు సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్‌ రెండు స్థానాల్లో గెలుపొందగా, బీఎస్పీ ఒక సీటు గెలుచుకుంది. రఘురాజ్ ప్రతాప్ సింగ్ యొక్క జనసత్తా దళ్ లోక్తాంత్రిక్ రెండు సీట్లు గెలుచుకుంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Uttar pradesh, Yogi adityanath

    తదుపరి వార్తలు