Congress: ఇప్పటికే ఐదు రాష్ట్రాలకు సంబంధించిన పీసీసీ చీఫ్‌లను తప్పుకోవాలని ఆదేశించిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ.. ఆ రాష్ట్రాల్లో ఓటమికి గల కారణాలను సమీక్షించేందుకు పరిశీలకులను కూడా నియమించారు.
కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం తీరుపై అసంతృప్తితో ఉన్న జి-23 నేతలు ఆ పార్టీ నాయకత్వం ముందు ఏ రకమైన డిమాండ్లు ఉంచబోతున్నారు ? ఎలాంటి సూచనలు చేయబోతున్నారు ? అనే అంశం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ నాయకత్వంలో మార్పు రావాలని ఈ నేతలు బలంగా కోరుతున్నారు. బుధవారం కాంగ్రెస్ సీనియర్ నేత ఆజాద్(Ghulam Nabi Azad) నివాసంలో సమావేశమైన అసంతృప్తి నేతలు.. పార్టీ అధినాయకత్వం ముందు ఉంచాల్సిన డిమాండ్లు, సూచనల గురించి చర్చించారు. అయితే వీరి ప్రధాన డిమాండ్ తమకు రాహుల్ గాంధీ (Rahul Gandhi) నాయకత్వంపై నమ్మకం లేకపోవడమే అని.. పార్టీలో నాయకత్వ మార్పు అవసరమని వాళ్లు చెప్పనున్నట్టు సమాచారం. సమర్థుడైన వ్యక్తి మాత్రమే పార్టీని నడపగలడని జి-23 వర్గానికి చెందిన నేతల్లో ఒకరైన సందీప్ దీక్షిత్. అన్నారు. అలాంటి నాయకత్వం వల్లే పార్టీ బలోపేతం అవుతుందని చెప్పారు.తాము కాంగ్రెస్‌లోనే ఉన్నామని.. పార్టీకి విధేయులమని అన్నారు.
సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ నివాసంలో జరిగిన సమావేశానికి హాజరైన శంకర్ సింగ్ వాఘేలా కూడా నాయకత్వ మార్పు కోసం డిమాండ్ చేశారు. ఈ రోజు గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని (Sonia Gandhi) కలిసి తమ డిమాండ్లను వివరిస్తారని నేతలు చెప్పారు. అయితే ఐదు ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పార్టీ బాధ్యతల నుంచి తప్పుకుంటామని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రకటించారు. అయితే పార్టీని నడిపించే బాధ్యతను కొనసాగించాలని పార్టీ సభ్యులు సోనియా గాంధీని కోరారు. పార్టీలో కూడా అవసరమైన మార్పులు చేయాలని కోరారు.
అయితే తాజాగా జి-23 రాహుల్ గాంధీ నాయకత్వంపై నమ్మకం లేదని చెప్పడం.. కొత్త నాయకుడు కావాలని కోరుతున్నారు. వీరి డిమాండ్లకు సోనియాగాంధీ ఏ మేరకు సానుకూలంగా స్పందిస్తారన్నది కూడా ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఇప్పటికే ఐదు రాష్ట్రాలకు సంబంధించిన పీసీసీ చీఫ్‌లను తప్పుకోవాలని ఆదేశించిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ.. ఆ రాష్ట్రాల్లో ఓటమికి గల కారణాలను సమీక్షించేందుకు పరిశీలకులను కూడా నియమించారు.
జి-23లో భాగమైన నేతలెవరికీ ఇందులో సోనియాగాంధీ అవకాశం కల్పించలేదు. అయితే పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో నేతలు ఎవరిని ఎన్నుకుంటే వారే పార్టీకి నాయకత్వం వహిస్తారని చెబుతూ సోనియాగాంధీ జి-23 నేతల డిమాండ్‌కు ముగింపు పలికే అవకాశం లేకపోలేదని పలువురు విశ్లేషిస్తున్నారు. మొత్తానికి కాంగ్రెస్ నాయకత్వ సమర్థతను ప్రశ్నిస్తున్న జి-23 నేతల డిమాండ్లను పార్టీ నాయకత్వం పరిగణనలోకి తీసుకుంటుందా ? లేక వారినే సైలెంట్‌గా పక్కనపెడుతుందా ? అన్నది చూడాలి.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.