Home /News /national /

POLITICS NATIONAL VENKAIAH NAIDU ASKS MALAYALAM ACTOR KERALA MP SURESH GOPI WHETHER MASK IS A GROWN BEARD SNR

Rajya Sabha: నెక్స్ట్ మూవీ గెటప్‌తో పార్లమెంట్‌కి వచ్చిన హీరో సురేష్‌గోపి..ఎవరూ గుర్తుపట్టలేదుగా

Photo Credit:Instagram

Photo Credit:Instagram

Rajya Sabha:పార్లమెంట్‌లో జరిగిన చిన్న సంభాషణ ఇప్పుడు వైరల్ అవుతోంది. తన నెక్స్ట్ సినిమాలో గెటప్‌తో సభకు హాజరయ్యారు ఎంపీ, మలయాళ నటుడు సురేష్‌గోపి. ఆయన్ని గుర్తు పట్టలేకపోయిన రాజ్యసభ చైర్మెన్ వెంకయ్యనాయుడు అది మాస్కా లేక పెరిగిన గడ్డమా అని ప్రశ్నించడం చర్చనీయాంశమైంది.

ఇంకా చదవండి ...
మలయాళ సినిమా హీరో మళ్లీ వార్తల్లోకెక్కారు. యాక్షన్ సినిమాలతో సౌత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సురేష్‌ గోపి విషయంలో జరిగిన ఓ చిన్న సరదా సంభాష ఇప్పుడు సోషల్ మీడియా(Social media)లో వైరల్ అవుతోంది. మలయాళ హీరో (Malayalam actor)గా ఉన్న సురేష్‌గోపి (Suresh Gopi)కేరళకు చెందిన బీజేపీ ఎంపీ (Kerala MP)గా పెద్దల సభకు ఎన్నిక అయిన విషయం అందరికి తెలిసిందే. ప్రజాప్రతినిధిగా కొనసాగుతూనే సినిమాలు చేస్తున్న ఈ నటుడికి రాజ్యసభలో విచిత్రమైన అనుభవం ఎదురైంది. అదేంటంటే పార్లమెంట్ (Parliament) సమావేశాలకు సురేష్‌గోపి గొత్త గెటప్‌తో సభకు హాజరవడం అందర్ని ఆలోచనలో పడేసింది. ఇందులో భాగంగానే సభలో ఏదో అంశంపై ప్రసంగించడానికి సురేష్‌గోపి మైకు పట్టుకోగానే రాజ్యసభ చైర్మెన్ (Rajya Sabha Chairman) , ఉపరాష్ట్రపతి (Vice President)వెంకయ్యనాయుడు (Venkaiah Naidu)తన సందేహాన్ని హీరో ముందు ఉంచారు. సురేష్‌గోపి పెద్ద గడ్డంతో మెలితిప్పిన మీసాలతో మాట్లాడుతున్న సమయంలో వెంకయ్యనాయుడు అది మాస్కా(mask లేక పెరిగిన గడ్డామా (Grown beard) అని ప్రశ్నించారు. అందిరికి లాగానే తనకు వచ్చిన అనుమానాన్ని సభలోనే నివృత్తి చేసుకోవడం చూసిన తోటి సభ్యులు నవ్వుకున్నారు. రాజ్యసభ చైర్మెన్ అడిగిన ప్రశ్నకు ఏమాత్రం ఫీలవకుండా హీరో సురేష్‌గోపి ..మాస్క్‌ కాదు సార్ గడ్డమే..తన రాబోయే సినిమాలో గెటప్‌ ఇదేనంటూ బదులిచ్చారు. దాంతో చైర్మెన్ వెంకయ్యనాయుడితో పాటు అయోమయంలో ఉన్న తోటి సభ్యులకు క్లారిటీ వచ్చింది.

రాజ్యసభలో వెరైటీ సీన్..
మలయాళ నటుడు సురేష్‌గోపి సినిమాల్లో ఎక్కువగా పోలీస్‌ పాత్రలు, పెద్ద మనిషి తరహా క్యారెక్టర్లు చేస్తుంటారు. షేవ్ లేకుండా స్మార్ట్‌ లుక్‌తో మాత్రమే ఆయన ఎక్కువగా కనిపిస్తారు. అలాంటిది బాగా పెరిగిన తెల్లగడ్డం, నల్ల మీసాలతో ఓ సాధువును తలపించే విధంగా ఉండటంతో అందరూ పోల్చుకోలేకపోయారు. సురేష్‌గోపి లేటెస్ట్‌ గెటప్‌కి సంబంధించిన వీడియో బయటకు రాక ముందే రాజ్యసభలో ఆ టాపిక్‌పై చర్చ జరగడం చర్చనీయాంశమైంది.

పాపం హీరోనే గుర్తు పట్టలేకపోయారా..
మలయాళ నటుడు సురేష్‌గోపి సినిమా పరిశ్రమలోనే కాకుండా రాజకీయాల్లో కూడా సుపరిచితుడు కావడంతో ఇప్పుడు రాజ్యసభలో జరిగిన చర్చ హాట్‌టాపిక్‌గా మారింది. అదే వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఏ విషయంలోనైనా చాలా షార్ప్‌గా వ్యవహరించే రాజ్యసభ చైర్మెన్‌ వెంకయ్యనాయుడు నటుడు, బీజేపీ ఎంపీ సురేష్‌ కొత్త గెటప్‌ విషయంలో కన్ఫ్యూజ్‌ ఎందుకయ్యారని కొందరు అనుకుంటున్నారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Parliament, Suresh Gopi, Venkaiah Naidu

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు