హోమ్ /వార్తలు /national /

Rahul Gandhi: దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం ఆ రాష్ట్రంలోనే: రాహుల్ గాంధీ

Rahul Gandhi: దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం ఆ రాష్ట్రంలోనే: రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ

బీజేపీ ఫైనాన్షియల్ ట్రాన్సఫర్ మెకానిజంపై కసరత్తు చేస్తోందని విమర్శించారు. పేదల నుంచి డబ్బు తీసుకొని దేశంలోని కొంతమంది ధని వ్యాపారులకు కట్టబెడుతుందని రాహుల్ ఆరోపించారు

కర్నాటక ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ. బెంగుళూరులో మాట్లాడిన ఆయన ఈ సందర్భంగా కర్నాటకలోని బీజేపీ సర్కార్‌పై సంచలన విమర్శలు చేశారు. దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం కర్నాటక ప్రభుత్వమన్నారు. బీజేపీ ఫైనాన్షియల్ ట్రాన్సఫర్ మెకానిజంపై కసరత్తు చేస్తోందని విమర్శించారు. పేదల నుంచి డబ్బు తీసుకొని దేశంలోని కొంతమంది ధనిక వ్యాపారులకు కట్టబెడుతుందని రాహుల్ ఆరోపించారు. ప్రధానమంత్రి అవినీతి గురించి మాట్లాడేవారు, కానీ కర్ణాటకలో దాని గురించి మాట్లాడితే మాత్రం ప్రజలు నవ్వుకుంటారని ఎద్దేవా చేశారు రాహుల్. కర్ణాటకలో బిజెపి ప్రభుత్వం 40 శాతం (కమీషన్)లతో అత్యంత అవినీతి రాష్ట్రంగా ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కర్ణాటకలో అసలు పని ఎవరు చేస్తున్నారో కనుక్కోవడం చాలా సులభం. కాంగ్రెస్‌కు ఆ వ్యక్తి చేస్తున్న పనిని బట్టి మనం టిక్కెట్లను నిర్ణయించాలన్నారు. ఫలితాల కోసం ఎన్నికల్లో పోరాడకూడదు, నిర్ణయాత్మక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పోరాడాలని కాంగ్రెస్ కార్యకర్తలకు నేతలకు పిలుపునిచ్చారు రాహుల్ గాంధీ. మన దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని ఆరోపించారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరిగాయన్నారు. ఇవి దేశంలో అతిపెద్ద సమస్యలని అన్నారు రాహుల్ గాంధీ. బీజేపీ కోరుకున్నప్పటికీ, ఉపాధి కల్పించే రంగాలను నాశనం చేసినందున భారతదేశంలో ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వలేకపోయారని విమర్శించారు.

బెంగళూరులో జరిగిన పార్టీ సమావేశంలో రాహుల్ ప్రసంగిస్తూ, కర్ణాటకకు “కాంగ్రెస్ స్ఫూర్తి” ఉందని, “సహజ కాంగ్రెస్ రాష్ట్రం” అని అన్నారు. మనం కనీసం 150 సీట్లతో (224 మంది సభ్యుల కర్ణాటక అసెంబ్లీలో) గెలవాలన్నారు. ఎన్నికల్లో మనం ఐక్యంగా పోరాడాలి, సరైన సమస్యలపై, యోగ్యత ప్రమాణాలుగా ఉండాలన్నారు. పార్టీ నాయకులు సిద్ధరామయ్య, డికె శివకుమార్, మల్లికార్జున్ ఖర్గే ఇతర పార్టీ నాయకులు బాధ్యత తీసుకొని కలిసి పోరాడి 150 సీట్లు గెలుచుకోవాలన్నారు. ఈ ఎన్నికల్లో టిక్కెట్‌ ఇచ్చినా యువత, మహిళలపై దృష్టి సారించాలన్నారు. కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీతో గెలిచి పేదలు, చిన్న వ్యాపారులు, అన్ని వర్గాల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఇస్తుందని తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు రాహుల్ గాంధీ. చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలను ధ్వంసం చేసి ఉద్యోగాలు కల్పించే పరిస్థితిలో లేని బిజేపీ ఉందని విమర్శలు గుప్పించారు ఎంపీ.

First published:

Tags: Congress, Karnataka bjp, Karnataka Politics, Rahul Gandhi

ఉత్తమ కథలు