హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Modi@8: నరేంద్ర మోదీ స్ఫూర్తిని రగిలించే నాయకుడు: న్యూస్18 ఇంటర్వ్యూలో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్

Modi@8: నరేంద్ర మోదీ స్ఫూర్తిని రగిలించే నాయకుడు: న్యూస్18 ఇంటర్వ్యూలో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్

నరేంద్ర మోదీ

నరేంద్ర మోదీ

కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిదేళ్లు అవుతున్న సందర్భంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌ కీలక విషయాలను పంచుకున్నారు. న్యూస్18 నెట్‌వర్క్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. అనేక విషయాలను చెప్పారు.

ఇంకా చదవండి ...

కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిదేళ్లు అవుతున్న సందర్భంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌(Giriraj Singh) కీలక విషయాలను పంచుకున్నారు. న్యూస్18 నెట్‌వర్క్‌కు(News18 Network) ఇచ్చిన ఇంటర్వ్యూలో(Interview) ఆయన మాట్లాడుతూ.. మోదీ(Modi) పనితనాన్ని, ఆయనలోని ప్రత్యేక లక్షణాలను ప్రశంసించారు. వ్యక్తి హోదాతో సంబంధం లేకుండా మోదీ అందరినీ గౌరవిస్తారని, పేదల సంక్షేమానికి ఈ ఎనిమిదేళ్లలో(Eight Years) ఎంతో కృషి చేశారని చెప్పారు. ఇంటర్వ్యూలో మరిన్ని విషయాలు మీకోసం..  ప్రజలకు ఉపయోగపడే ఆలోచనల గురించి తనతో చర్చించే వ్యక్తి స్థాయితో సంబంధం లేకుండా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడతారని కేంద్రమంత్రి చెప్పారు.

“నేను రాష్ట్ర మంత్రిగా లేదా క్యాబినెట్ మంత్రిగా ఆయన వద్దకు వెళ్లానా లేదా కేంద్ర మంత్రిగా వెళ్లానా అనేది మోదీ పట్టించుకోరు. ప్రజల, పేదల జీవితాలను మార్చగలమని భావించే ఏదైనా ఆలోచన గురించి నేను చర్చిస్తే, ఆయన దాని గురించి ఆసక్తిగా వింటారు. వ్యక్తి స్థాయితో సంబంధం లేకుండా దానిపై చర్చిస్తారు. తర్వాత ఆ ఆలోచనలను ఆయన అమలు చేస్తారు. ఇది ప్రధానిగా మోదీలో నాకు చాలా స్ఫూర్తినిచ్చిన, గొప్ప లక్షణం. ఇలాంటి లక్షణాలను అందరు నేతలు అలవర్చుకోవాలి” అని కేంద్ర మంత్రి News18.comతో అన్నారు.

Video : నీ సంకల్పానికి హ్యాట్సాఫ్ తల్లి..ఒంటికాలితో గెంతుతూ స్కూల్ కి..సోనూసూద్ సాయం

* ఓపిక ఆయన ప్రత్యేకత

ప్రధాని మోదీని మించిన శ్రోత ఎవరూ లేరని, ఆయన అందరి మాటలను ఓపికగా, చిత్తశుద్ధితో వింటారని గిరిరాజ్ సింగ్ తెలిపారు. ప్రధాని ఆవిష్కరణలను ప్రోత్సహిస్తారని.. ఆ ఆవిష్కరణతో ప్రజలు లబ్ధి పొందుతారని భావిస్తే, ఆయన దానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తారని కేంద్రమంత్రి చెప్పారు. అయితే ఆ మద్దతులో ఆయన జవాబుదారీతనం కోరుకుంటారని వివరించారు.

‘మన ప్రధానమంత్రికి జవాబుదారీతనం ఎక్కువ. జవాబుదారీతనంతో (accountability) పాటు బాధ్యత (Responsibility) అనేది ప్రధానమంత్రి పాలనా మంత్రం. ఇందులో కూడా ఆయన ఉదాహరణగా నిలుస్తారు. అధికారిక పర్యటనల్లో కొన్ని గంటలపాటు తీరిక లేనప్పటికీ, ఆయన పనిని మాత్రం విస్మరించరు. షెడ్యూల్‌ను ఎప్పుడూ వాయిదా వేయరు. ప్రధాని తెల్లవారుజామున 4 గంటలకు విమానం దిగి 11 గంటలకు క్యాబినెట్‌ మీటింగ్‌కు సిద్ధమయ్యారని కేంద్ర విదేశాంగ మంత్రి నాకు చెప్పారు. కనీసం పదేళ్లపాటు ప్రధాని మనకు మార్గనిర్దేశం చేస్తే, భారతదేశం సూపర్ పవర్ అవుతుంది’ అని గిరిరాజ్ సింగ్ చెప్పారు.

* స్ఫూర్తి నింపే నాయకుడు

ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ భారత్ దార్శనికత తనలో స్ఫూర్తిని నింపిందని, మోదీ మంత్రివర్గంలో సభ్యుడిగా ఉన్నందుకు గర్వపడుతున్నానని ఆయన పేర్కొన్నారు. “ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ భారత్ మంత్రాన్ని ఇచ్చారు. దీనిని ప్రతి మంత్రిత్వ శాఖ అనుసరిస్తోంది. రక్షణ, వ్యవసాయం, సంబంధిత ఎగుమతుల రంగాల్లో స్వావలంబన గురించి మరెవరూ ఆలోచించలేదు. ప్రధానమంత్రికి మరో పెద్ద బలం ఏంటంటే.. ఆయన మీకు ఒక బాధ్యత అప్పగిస్తే, మిమ్మల్ని పూర్తిగా విశ్వసిస్తారు.’’ అని కేంద్ర మంత్రి తెలిపారు.

ప్రధానమంత్రిని పార్టీ నాయకులు, కేబినెట్ మంత్రులు హార్డ్ టాస్క్‌మాస్టర్ అని పిలుస్తారని గిరిరాజ్ సింగ్ చెప్పారు. ఆయన సహచరులను ఆదర్శంగా నడిపించే నాయకుడని తెలిపారు. ‘ప్ర‌ధాన మంత్రి ఇంత క‌ష్ట‌ప‌డుతుంటే, కేబినెట్ మెంబర్స్ కూడా తమ వంతుగా ఎక్కువ కష్టపడాలని ప్ర‌య‌త్నిస్తుంటారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా పేరు ఉన్నప్పటికీ.. ఆయన సంస్థలను ఎప్పుడూ గౌరవిస్తారు. ప్రభుత్వం, పార్టీ మధ్య మంచి సమన్వయం ఉండేలా చూస్తున్నందుకు పార్టీ అధినేత జెపీ నడ్డాను మోదీ గౌరవిస్తారు. నడ్డా క్రమశిక్షణను ప్రధాని ప్రశంసిస్తారు’ అని గిరిరాజ్ సింగ్ వెల్లడించారు.

* సంరక్షకుడి పాత్ర కూడా..

ఎవరైనా అనారోగ్యానికి గురైతే ప్రధాని సంరక్షకుడిగా వ్యవహరిస్తారని కూడా ఆయన చెప్పారు. “నేను మోదీకి వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కొన్ని సంవత్సరాల క్రితం నేను ఆసుపత్రిలో చేరాను. ఆయనకు ఈ విషయం తెలిసింది. అప్పట్లో మోదీ మొదటి కేబినెట్‌లో మంత్రిగా ఉన్న అనిల్ దవే చనిపోయారు. ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న సమయంలో ఆయన నాకు కాల్ చేశారు. రాజకీయ నాయకులకు తమ ఆరోగ్యం గురించి మర్చిపోవడమనే చెత్త అలవాటు ఉంటుందని, ఆరోగ్యాన్ని విస్మరించకూడదని ఆయన నాకు చెప్పారు” అని మంత్రి గుర్తుచేసుకున్నారు.

ఈ సందర్భంగా గిరిరాజ్ సింగ్ ప్రతిపక్షాల వైఖరిని తప్పుబట్టారు. "మోదీని విమర్శించే సమయంలో ప్రతిపక్షాలు ఇంటా బయటా మన దేశాన్ని కూడా విమర్శిస్తుంటారు. మోదీ నాయకత్వాన్ని విదేశీ దేశాధినేతలు ప్రశంసిస్తుంటారు. ప్రవాస భారతీయులు ఆయనపై చూపించే ప్రేమ సాటిలేనిది. ఇవన్నీ ప్రతిపక్షాలకు కనిపించవు. బయట దేశాలకు వెళ్లి మన దేశాన్ని అవమానించవచ్చు, కానీ జో బైడెన్ కూడా కోవిడ్ మేనేజ్‌మెంట్ విషయంలో భారతదేశాన్ని ప్రశంసిస్తున్నారు." అని సింగ్ వెల్లడించారు.

Narendra Modi@8: మోదీ హయాంలోనే ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి.. 2014 ముందు ఇలా ఉండేది కాదన్న బీరేన్ సింగ్..


తన మంత్రిత్వ శాఖ పట్ల ప్రధాని దృష్టి పెట్టడాన్ని కూడా ఆయన ప్రశంసించారు. ‘‘నేడు గ్రామాల్లో వెల్‌నెస్‌ సెంటర్లు ఉన్నాయి. 24,000 వెల్‌నెస్ సెంటర్లను ప్రారంభించాం. జెండర్ ఎంప్లాయ్‌మెంట్ గురించి చూస్తే.. స్వయం సహాయక బృందాలు ఊపందుకున్నాయి. ప్రధాని మోదీ వచ్చినప్పుడు ఈ బృందాలలో 2.35 కోట్ల మంది సభ్యులు ఉన్నారు. నేడు ఈ సంఖ్య 8.27 కోట్ల మందికి చేరుకుంది. నేడు 5 లక్షల కోట్లకు పైగా బ్యాంకు లింకేజీలు ఉన్నాయి. జన్ ధన్ పథకాల కింద మహిళలకు 40 కోట్లకు పైగా బ్యాంకు అకౌంట్లు ఉన్నాయి. ఇందిరా ఆవాస్‌ యోజన పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి దాదాపు 3 కోట్ల ఇళ్లు నిర్మించారు. మేం అధికారంలోకి వచ్చిన ఎనిమిదేళ్లలో 2.5 కోట్ల ఇళ్లను నిర్మించాం. వీటిలో ఒక్కోదానిపై మోదీ ముద్ర ఉంది’ అని కేంద్ర మంత్రి చెప్పారు.

First published:

Tags: News18, Pm modi, Prime minister

ఉత్తమ కథలు