POLITICS NATIONAL IT IS THE MODI MAGIC AT WORK IN UP AGAIN WITH YOGIS BOOSTER SHOT DETAILS HERE GH VB
UP Election Results: యోగి విధానాలను మెచ్చిన ప్రజలు.. భవిష్యత్తు దేశ రాజకీయాల్లో కీలకం కానున్న యూపీ ముఖ్యమంత్రి..
PM Modi, Yogi
ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ మరోసారి అద్భుతమైన విక్టరీ సాధించింది. దాదాపు 250 సీట్లకు పైగా గెలుపొంది వరుసగా రెండో సారి అధికారాన్ని చేజిక్కించుకుంది. నరేంద్ర మోడీ, యోగి ఆదిత్యనాథ్ ద్వయం అద్భుతం సృష్టించింది.
ఉత్తరప్రదేశ్‌లో(Uttara Pradesh) భారతీయ జనతా పార్టీ(BJP) మరోసారి అద్భుతమైన విక్టరీ సాధించింది. దాదాపు 250 సీట్లకు పైగా గెలుపొంది వరుసగా రెండో సారి అధికారాన్ని చేజిక్కించుకుంది. నరేంద్ర మోడీ, యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) ద్వయం అద్భుతం సృష్టించింది. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ తన పట్టు నిలుపుకోవడంతో కమలనాధులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ విజయంలో ప్రధాని నరేంద్ర మోదీ, యోగీ(Yogi) ఫ్యాక్టర్ బాగా పనిచేసిందనే చెప్పాలి. మోడీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 24 ర్యాలీలు, తన లోక్‌సభ (Lok Sabha) నియోజకవర్గం వారణాసిలో(Varanasi) భారీ రోడ్‌షోల్లో పాల్గొన్నారు. యోగి ఆదిత్యనాథ్ వరుసగా రెండవసారి ముఖ్యమంత్రిగా తిరిగి ఎన్నిక కావడానికి అవసరమైన ప్రోత్సాహాన్ని అందించారు. ఉత్తరప్రదేశ్‌లో కొంత ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా సరే మోడీ ఫ్యాక్టర్ బాగా పనిచేసింది.
ఎందుకంటే, ప్రజలు తమ స్థానిక బిజెపి అభ్యర్థి ఎవరనేది పెద్దగా పట్టించుకోలేదు. కేవలం మోదీ బొమ్మ చూసి ఓట్లు వేయనున్నట్లు ఎన్నికల సమయంలో న్యూస్ 18 చేసిన ప్రజాభిప్రాయ సేకరణలో ఓటర్లు చెప్పుకొచ్చారు. అయితే, ఉత్తరప్రదేశ్‌లో సాంప్రదాయానికి భిన్నంగా ఒక పార్టీ వరుసగా రెండో సారి ఘన విజయం సాధించింది. దీంతో, వరుసగా రెండో యోగి ఆధిత్యనాథ్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కనున్నారు. గతంలో కల్యాణ్ సింగ్, రాజ్‌నాథ్ సింగ్, ములాయం సింగ్ యాదవ్, మాయావతి ఇలా ఏ ముఖ్యమంత్రి ఎంత బలంగా ఉన్నా సరే గత 37 సంవత్సరాలుగా యూపీలో వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేకపోయారు. కానీ, ఈ ఎన్నికల్లో వరుసగా రెండో సారి విజయం సాధించి చరిత్ర తిరగరాసింది భారతీయ జనతా పార్టీ. మోదీ ఇచ్చిన పూర్తి మద్దతుతో యోగి ఆధిత్యనాథ్ ఈ అద్భుతాన్ని ఆవిష్కరించగలిగాడు.”అని ఆయన అన్నారు.
మోదీ, అమిత్‌షా సరసన చేరిన యోగి..
2014, 2017, 2019లో లాగానే మళ్లీ యూపీలో మోదీ మ్యాజిక్ పనిచేసిందని, అందుకే, 2022లో కూడా అద్భుత విజయం సాకారమైందని పార్టీలోని మరో సీనియర్ నేత అన్నారు. రాష్ట్రంలో మోదీ ప్రభుత్వ పథకాలన్నింటినీ యోగి పూర్తిగా ఎలా అమలు చేశారన్నది కూడా విజయంలో కీలకంగా మారిందని, యోగి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ఈ పథకాలు దోహదం చేశాయని పేర్కొన్నారు. యూపీకి అవినీతి రహిత, బలమైన, నిర్ణయాత్మక పాలన అందించాలన్న మోదీ కోరికను యోగి నెరవేర్చారని, నేరగాళ్లు, మాఫియాలపై నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తూ రాష్ట్రానికి భద్రత కల్పించారని, గూండాయిజాన్ని అనిచివేశారని బీజేపీ నేతలు చెబుతున్నారు.
ఒకప్పుడు నరేంద్ర మోడీ హయాంలో గుజరాత్ మాదిరిగానే యోగి హయాంలో ఉత్తరప్రదేశ్ కూడా మోడల్ రాష్ట్రంగా ఆవిర్భవించినట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో 200కి పైగా ర్యాలీలు, రోడ్‌షోలు చేసిన యోగి, ఇప్పుడు మోడీ, అమిత్ షాలతో పాటు బిజెపి అగ్రత్రయంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. భవిష్యత్తులో దేశ రాజకీయాల్లో యోగి కీలకంగా మారనున్నాడు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.