ఎనిమిదేళ్ల అధికారం, చాలా సంస్కరణలను తీసుకొచ్చిన అనంతరం కూడా ఎన్నికల్లో ప్రధాని మోదీ(PM Modi) హవా కొనసాగుతోంది. మోదీ ప్రసంగాలు, యోగి ఆధిత్యనాథ్(Yogi Adityanath) పాలనే ఉత్తరప్రదేశ్‌లో(Uttara Pradesh) భాజపాకు రెండో సారి విజయాన్ని(Victory) ఖరారు చేశాయి. స్థానిక పాలనతో అధికారంలోకి రావడం సాధ్యమేకానీ.. మిగతా నాలుగు రాష్ట్రాల్లోనూ భాజపా ఎలా రాణించిందో అంచనా వేయడం కష్టమే. ఇటీవల భాజపా తీసుకొచ్చిన కొన్ని చట్టాలకు, పథకాలను పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ ప్రభావం ఎన్నికల్లోనూ కనిపిస్తుందనే విశ్లేషణలు వినిపించాయి. పలు రాష్ట్రాల్లో కేంద్రం తీసుకొచ్చిన పథకాలను వివరించడమే ఎన్నికల వ్యూహంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో భాజపా(BJP) హవా కొనసాగిందంటే మోదీ సత్తాను తక్కువ చేయడం సరికాదు.
పెద్ద ఎత్తున మరుగుదొడ్ల నిర్మాణం, అందరికీ విద్యుత్తు కనెక్షన్లు, డెమోక్రటైజేషన్ ఆఫ్ డేటా యాక్సెస్ వంటి పథకాలను తీసుకొచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకంగా లబ్ధిపొందుతారు. అయితే కేంద్రం పథకాలను ఎలా అమలు చేస్తారు, ఎలా ప్రజలను ప్రభావితం చేస్తారనే ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే పథకాలను అమలు చేయాల్సిన, ప్రజలకు చేరువ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రులకే ఉంది. ఇక్కడే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం బయటపడుతుంది.
ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆధిత్యనాథ్, లా అండ్ ఆర్డర్‌ను సరి చేయాలనే అంశాన్ని భుజానికెత్తుకున్నారు. ఎంత చక్కగా అమలు చేశారో అందరికీ తెలిసిందే. పాలనలో మోదీ తరహా మార్కును చూపిస్తూ లా అండ్ ఆర్డర్‌ను సరిచేయడంలో తనే బాధ్యత వహిస్తున్నట్లు కనిపించాడు. వాస్తవానికి భాజపా పాలనను ఆదరించిన యూపీ ప్రజలు, ఈ ఎన్నికల్లో ఎక్కువ శాతం ఓట్లను అందించారు. గత ఎన్నికలతో పోలిస్తే సీట్లు దక్కినా.. ఓటు శాతం పెరగడం గమనార్హం. బీఎస్‌పీ, కాంగ్రెస్ నుంచి మద్దతు ఎస్పీ వైపు వెళ్లినట్లు కనిపిస్తోంది. కొన్ని తప్పటడుగులు తప్ప భాజపా యూపీ ఎన్నికల్లో సత్తా చాటింది.
భాజపాకు ఇబ్బందులు సృష్టించిన తప్పులు ఏంటి?
మొదటి లాక్‌డౌన్ సమయంలో ఇతర ప్రాంతాల నుంచి ఊహించని స్థాయిలో వలస వచ్చిన కార్మికులతో సమస్య ఎదురైంది. దిల్లీపై ఎంత మంది ఉత్తర ప్రదేశ్ గ్రామీణ ప్రజలు ఆధారపడి ఉన్నారనేది స్పష్టమైంది. చాలా మంది ఆకలి బాధలు అనుభవించారు. ఇది యూపీ ప్రభుత్వంపై ప్రభావం చూపుతుందని ఎక్కువ మంది విశ్లేషకులు భావించారు. ఆ తర్వాత యూపీ ప్రభుత్వం చేపట్టిన ఎకనామిక్ మేనేజ్‌మెంట్, ఆర్థిక అభివృద్ధి, వలస కార్మికుల సమస్యలను మరిచిపోయేలా చేసి ఎన్నికల్లో ఓటు శాతం పెంచాయి.
అనంతరం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలపై దేశవ్యాప్తంగా రైతుల నుంచి నిరసన వ్యక్తమైంది. యూపీలో దాదాపు ఏడాదిపాటు ఈ నిరసనలు కొనసాగాయి. యూపీలో దీని ప్రభావం చూపకపోయినా.. పంజాబ్‌లో దెబ్బతీసింది. యూపీలో రైతుల నిరసనల ప్రభావం కనిపించకపోవడానికి మోదీ ఎన్నికల ప్రణాళిక, యోగి ఆధిత్యనాథ్ సమర్థత పని చేశాయి.
Assembly Elections Results: యూపీ సహా 4 రాష్ట్రాల్లో మళ్లీ బీజేపీదే అధికారం..పంజాబ్‌లో ఆప్ సంచలనం
హత్రాస్ రేప్ కేసు ప్రత్యేకంగా మోదీ ముద్రను యూపీలో కనిపించేలా చేసింది. ఇది భారీగా మోదీ మద్దతుదారులను పెంచింది. త్రిపుల్ తలాక్ రద్దు కూడా ముస్లిం మహిళలను భాజపా వైపు చూసేలా చేసింది. ఆయా వర్గాలను ముఖ్యంగా దళితులను ఆకర్షించడంలో అమిత్ షా వ్యూహాలు ఫలించాయి. ఇతర ఏవైనా లోపాలు ఉంటే వాటిని మోదీ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు నింపి.. మొత్తానికి భాజపాను యూపీలో తిరిగి అధికారంలో వచ్చేలా చేశాయి.
ఆయా రాష్ట్రాల్లో భాజపాకు లభిస్తున్న విజయాలు స్థానిక నాయకులు సత్తా మేరకే అయినా.. మోదీ నిర్మించిన ప్లాట్‌ఫాంపైనే వారంతా రాణిస్తున్నారనేది పలువురి వాదన. భాజపా పటిష్ఠ ప్రణాళికలు అమలు చేస్తూ విజయాల పరంపరను కొనసాగిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5 State Elections, Bjp, Pm modi, Yogi adityanath