కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul gandhi) సోమవారం ఈడీ కార్యలయంలో విచారణకు హజరయ్యారు. ఈ నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ (Congress) కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. అదే విధంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఈడీ నోటీసులు ఇవ్వడాన్ని ఖండిస్తూ.. దేశంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈడీ కార్యలయం ముందు పలువురు కాంగ్రెస్ (Congress) కేంద్రమంత్రులు, సీనియర్ నాయకులు తమ నిరసన తెలిపేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసులు దురుసుగా ప్రవర్తించారు.
ఈ రోజు ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ పార్టీ (congress) నిరసన సందర్భంగా పోలీసులు నెట్టివేయడంతో సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పీ. చిదంబరం ( Chidambaram) ఎడమ పక్కటెముకలో ఫ్రాక్చర్ అయ్యిందని మరో నేత రణదీప్ సూర్జేవాలా (randeep surjewala) ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి (rahul gandhi) ఈడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా సోమవారం ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో రాహుల్ విచారణకు హాజరయ్యారు.
मोदी सरकार बर्बरता की हर हद पार कर गई।
पूर्व गृह मंत्री, श्री पी.चिदंबरम के साथ पुलिस की धक्कामुक्की हुई, चश्मा ज़मीन पर फेंका, उनकी बायीं पसलियों में हेयरलाइन फ्रैक्चर है।
सांसद प्रमोद तिवाड़ी को सड़क पर फेंका गया। सिर में चोट और पसली में फ्रैक्चर है।
क्या यह प्रजातंत्र है? pic.twitter.com/rRLOhIOTJ3
— Randeep Singh Surjewala (@rssurjewala) June 13, 2022
ఈ సందర్భంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (enforcement directorate) కార్యాలయం వద్ద వందలాది మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. వీరిలో కాంగ్రెస్ మాజీ కేంద్ర మంత్రి చిదంబరం కూడా వున్నారు. ఈ సందర్భంగా కొందరు పోలీసులు చిదంబరాన్ని బలంగా పక్కకు నెట్టడంతో ఆయన పక్కటెముకలు విరిగిపోయినట్లు కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం మరోసారి హద్దులు దాటి ప్రవర్తించారని అన్నారు. మాజీ హోంమంత్రి పీ.చిదంబరంపై పోలీసులు చేయి చేసుకున్నారు.. ఆయన కళ్ల అద్దాలు నేలపై విసిరికొట్టారు. కాసేపు అక్కడ తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఆయన.. ఎడమ పక్కటెముకలు విరిగిపోయాయి. ఎంపీ ప్రమోద్ తివారీని సైతం రోడ్డుపై పడేశారు.
ఆయనకు కూడా తలకు గాయం అవ్వడంతో పాటు.. పక్కటెముక ఫ్రాక్చర్ అయ్యింది. ఇది ప్రజాస్వామ్యామా.. నియంతలా వ్యవహరించడమేంటని.. అంటూ రణదీప్ సూర్జేవాలా ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే, రాహుల్ గాంధీ వెంట చిదంబరంతో పాటు కాంగ్రెస్ నేతలు ప్రియాంక గాంధీ, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్ తదితరులు వున్నారు. మరోవైపు తనకు గాయమైనట్లు చిదంబరం స్వయంగా ట్వీట్ చేశారు. తనపైకి ముగ్గురు పోలీసులు దూసుకొచ్చారని.. ఆ దాడిలో స్వల్ప గాయాలతో బయటపడినందుకు డాక్టర్లు తనను అదృష్టవంతులు అన్నారని చిదంబరం ట్వీట్ చేశారు. ప్రస్తుతం తాను బాగానే వున్నానని.. రేపు యథావిధిగా విధులకు హాజరవుతానని చిదంబరం తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress, P chidambaram, Rahul Gandhi