Home /News /national /

POLITICS NATIONAL GHULAM NABI AZAD MEETS CONGRESS PRESIDENT SONIA GANDHI SAYS SHE SHOULD CONTINUE AS PARTY LEADER AK

Congress: ఎట్టకేలకు సోనియాగాంధీని కలిసిన ఆజాద్.. నాయకత్వ మార్పుపై ఏమన్నారంటే..

సోనియా గాంధీ, ఆజాద్ (ఫైల్ ఫోటో)

సోనియా గాంధీ, ఆజాద్ (ఫైల్ ఫోటో)

Congress: సోనియాగాంధీని కలవడానికి ముందు జి-23 శిబిరంలోని పలువురు కాంగ్రెస్ నేతలతో రెండు మూడుసార్లు సమావేశమైన గులాం నబీ ఆజాద్.. సోనియాగాంధీ ముందుకు ఉంచాల్సిన ప్రతిపాదనలు, సూచనల గురించి వారితో చర్చించారు.

    కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీతో తన సమావేశం సానుకూలంగా జరిగిందని ఆ పార్టీ సీనియర్ నేత, అసంతృప్తి నేతల శిబిరం జి-23కి చెందిన ముఖ్యనేత గులాం నబీ ఆజాద్ అన్నారు. కాంగ్రెస్ (Congress) పార్టీ సభ్యులందరూ సోనియాగాంధీనే(Sonia Gandhi) అధ్యక్షురాలిగా కొనసాగాలని నిర్ణయించారని వ్యాఖ్యానించారు. సోనియాగాంధీతో కొన్ని సూచనలను పంచుకున్నామని అన్నారు. ఐదు రాష్ట్రాల్లో ఓటమికి గల కారణాలపై వర్కింగ్‌ కమిటీ సూచనలను అడిగామని.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఐక్యంగా పోరాడాలని చర్చించామని ఆజాద్ అన్నారు. పార్టీ నాయకత్వంపై ఎలాంటి ప్రశ్న లేదని అన్నారు. సోనియాగాంధీని కలవడానికి ముందు జి-23 శిబిరంలోని పలువురు కాంగ్రెస్ నేతలతో రెండు మూడుసార్లు సమావేశమైన గులాం నబీ ఆజాద్(Ghulam Nabi Azad).. సోనియాగాంధీ ముందుకు ఉంచాల్సిన ప్రతిపాదనలు, సూచనల గురించి వారితో చర్చించారు.

    కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణయాధికార విభాగమైన వర్కింగ్ కమిటీ ఆదివారం సమావేశమైంది. ఆ సమావేశంలో కొందరు నేతల చేసిన వ్యాఖ్యలకు ఆజాద్ కలత చెందారని వార్తలు వచ్చాయి. అనంతరం జి-23 నేతలు వరుస సమావేశాలు నిర్వహించారు. పలు అంశాలపై చర్చించారు. తమకు సోనియాగాంధీ నాయకత్వం పట్ల నమ్మకం ఉందని.. అయితే రాహుల్ గాంధీ నాయకత్వం విషయంలోనూ తమకు విశ్వాసం లేదని మెజార్టీ నేతలు అభిప్రాయపడ్డారని.. ఇదే విషయాన్ని సోనియాగాంధీకి చెప్పాలని నిర్ణయించుకున్నారని వార్తలు వచ్చాయి.

    అయితే పార్టీకి నష్టం కలిగేలా వ్యవహరిస్తున్న జి-23 నేతలను సోనియాగాంధీ కలుస్తారా ? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. నిజానికి నిన్నే సోనియాగాంధీని ఆజాద్ కలుస్తారని వార్తలు వచ్చాయి. కానీ అది జరగలేదు. దీంతో కాంగ్రెస్ అధినాయకత్వం అసంతృప్తి నేతలను కలుస్తుందా ? లేక వారిని పక్కనపెడుతుందా ? అన్నది ఉత్కంఠ రేపింది. అయితే ఈ రోజు సాయంత్రం సోనియాగాంధీని కలిసేందుకు ఆజాద్ ఆమె అధికారిక నివాసమైన 10 జన్‌పథ్‌కు వెళ్లారు. దీంతో సోనియాగాంధీకి జి-23 నేతల తరపున ఆజాద్ ఎలాంటి సూచనలు చేశారనే దానిపై ఆసక్తి నెలకొంది.

    కాంగ్రెస్‌లో ప్రక్షాళనకు ఏది మార్గం..అభిప్రాయాలు కలిసేదెలా..?

    Congress: కాంగ్రెస్‌లో కల్లోలం.. అసమ్మతి నేతల డిమాండ్ ఇదేనా ?.. సోనియాగాంధీ అంగీకరిస్తారా ?

    సమావేశం అనంతరం మీడియాతో క్లుప్తంగా మాట్లాడిన ఆజాద్.. పార్టీ అధ్యక్షురాలిగా సోనియాగాంధీనే కొనసాగాలనే అంశంపై పార్టీ నేతల మధ్య ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవని అన్నారు. అయితే సోనియాగాంధీకి జి-23 నేతలు ఏ రకమైన సూచనలు చేశారు ? ఈ విషయంలో కాంగ్రెస్ నాయకత్వం ఎలాంటి వైఖరి తీసుకుంటుందన్నది తెలియాల్సి ఉంది. మొత్తానికి సోనియాగాంధీతో జి-23 శిబిరానికి చెందిన కీలక నేత ఆజాద్ సమావేశం కావడంతో.. పార్టీ నాయకత్వానికి, జి-23 నేతలకు మధ్య ఉన్న గ్యాప్ తగ్గిపోతుందా ? లేక అది అలాగే కొనసాగుతుందా ? అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Congress, Sonia Gandhi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు