Home /News /national /

POLITICS NATIONAL FROM JEET KA CHAUKA TO A DIG AT EXPERTS PM MODIS TOP 10 QUOTES AFTER ELECTRIC ELECTORAL SHOW GH VB

PM Modi: ఎన్నికల విజయోత్సవ సభలో కార్యకర్తలకు మోదీ అభినందనలు.. ప్రధాని మాట్లాడిన కీలక అంశాలు ఇవే..!

ప్రధాని మోదీ

ప్రధాని మోదీ

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి గురువారం ప్రధాని మోదీ ప్రసంగించారు. పార్టీ విజయానికి చేసిన కృషిని అభినందించారు.

దేశంలో తీవ్ర ఉత్కంఠను రేపిన ఉత్తర్‌ ప్రదేశ్‌(Uttar Pradesh), మణిపూర్(Manipur), గోవా(Goa), ఉత్తరాఖండ్‌(Uttarakhand), పంజాబ్‌(Punjab) రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలు (Election Results) వెలువడ్డాయి. నాలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ (BJP) గెలుపు జెండా ఎగురవేసింది. ఉత్తర్‌ ప్రదేశ్‌లో గత ఎన్నికల కంటే సీట్ల సంఖ్య తగ్గినా భాజపా ఓటు బ్యాంకు పెరిగింది. పంజాబ్‌లో ఆప్‌(AAP) విజయం దక్కించుకొంది. అక్కడకూడా భాజపా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేసింది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి గురువారం ప్రధాని మోదీ(PM Modi) ప్రసంగించారు. పార్టీ విజయానికి చేసిన కృషిని అభినందించారు.

UP Elections: యూపీలో పనిచేసిన పీఎం మోదీ మాయ, యోగి ఆధిత్యనాథ్‌ సమర్థత.. రెండో సారి భాజపాకు భారీ విజయం..!


ప్రసంగాన్ని ఎన్నికల ఫలితాలు, క్యార్యకర్తలకు అభినందనలు తెలియజేయడానికి మాత్రమే ప్రధాని మోదీ (PM Modi) పరిమితం చేయలేదు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, కొవిడ్‌ వ్యాప్తి, ఇతర సమస్యలపై మాట్లాడారు. ప్రతిపక్షాలపై విమర్శలను సైతం మోదీ సంధించారు.

మోదీ ప్రసంగంలోని కీలక అంశాలు ఇవే..

  • ‘మార్చి 10 నుంచే హోలీ సంబరాలు మొదలవుతాయని ముందే చెప్పాం. ఇది మా ఎన్‌డీఏ కార్యకర్తల 'జీత్ కా చౌకా’’

  • ‘ఈ ప్రజాస్వామ్య పండుగలో పాల్గొని బీజేపీని గెలిపించినందుకు ఓటర్లందరికీ ధన్యవాదాలు. తొలిసారి ఉత్తరప్రదేశ్‌లో సీఎం వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబోతున్నారు.’

  • ‘గోవాలో అన్ని ఎగ్జిట్ పోల్స్ తప్పని రుజువైంది. ఉత్తరాఖండ్‌లో భారతీయ జనతా పార్టీ కొత్త చరిత్రను లిఖించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో తొలిసారిగా ఒక పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది.’


CM Yogi: యోగి ప్రభంజనం.. గోరఖ్‌పూర్‌లో 1లక్షకుపైగా మెజార్టీతో విజయం.. Lakhimpurలో బీజేపీ క్లీన్ స్వీప్

  •  ‘మేము 2019లో కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు, 2017లో ఉత్తరప్రదేశ్‌లో విజయం కారణంగానే సాధ్యమైందని కొందరు నిపుణులు చెప్పారు. 2024 జాతీయ ఎన్నికల భవితవ్యాన్ని 2022 ఎన్నికల ఫలితాలు నిర్ణయిస్తాయని అదే నిపుణులు చెబుతారని నేను నమ్ముతున్నాను.’

  • ‘ఈ రోజు నేను నా ఆందోళనలలో కొన్నింటిని పంచుకోవాలనుకుంటున్నాను. దేశాభివృద్ధిలో సామాన్యులు సైతం పాలుపంచుకుంటున్నారు. కానీ కొందరు మాత్రం రాజకీయాల స్థాయిని దిగజార్చుతున్నారు. మా టీకా కార్యక్రమాన్ని ప్రపంచమే మెచ్చుకుంది, కానీ కొందరు మా టీకాలను ప్రశ్నించారు.’

  •  ‘పంజాబ్‌లో భాజపా బలోపేతం అవుతోంది. మా పంజాబ్ కార్యకర్తలు క్లిష్ట పరిస్థితుల్లోనూ తమ కష్టంతో పార్టీని, మా జెండాను గర్వపడేలా చేశారు.’


UP Election Results: యోగి విధానాలను మెచ్చిన ప్రజలు.. భవిష్యత్తు దేశ రాజకీయాల్లో కీలకం కానున్న యూపీ ముఖ్యమంత్రి..



  • ‘వేలాది మంది భారతీయ విద్యార్థులు, భారతీయ పౌరులు ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన సందర్భంలో.. దేశం యొక్క నైతికతను విచ్ఛిన్నం చేసే చర్చలు జరగడం దురదృష్టకరం.’

  •  ‘ఈ వ్యక్తులు ఆపరేషన్ గంగాపై కూడా ఆరోపణలు చేసే ప్రయత్నం చేశారు. ఇది భారతదేశ భవిష్యత్తుపై ఆందోళన కలిగించే అంశం.’

  •  ‘ఉక్రెయిన్- రష్యా యుద్ధం పరిణామాలు ప్రతి దేశం భరించాల్సి ఉంటుంది.’

  •  ‘భారతదేశం యుద్ధంలో పోరాడుతున్న దేశాలతో ఆర్థిక, రక్షణ, భద్రత, రాజకీయ సంబంధాలను కలిగి ఉంది. ఆ దేశాల నుంచి సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతి చేసుకొంటాం. అంతర్జాతీయంగా బొగ్గు, గ్యాస్, ఎరువుల ధరలు వేగంగా పెరుగుతున్నాయి.’

Published by:Veera Babu
First published:

Tags: Bjp, Pm modi, Uttar pradesh, Vaccination

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు