Home /News /national /

POLITICS NATIONAL FLAG COLORED WATERFALLS IN MADHYA PRADESH SNR

Independence day 2022: తిరంగా వాటర్ ఫాల్స్ .. దేశ వ్యాప్తంగా వైరల్ అవుతున్న వీడియో ఇదే

(Photo Credit:Youtube)

(Photo Credit:Youtube)

Independence day 2022: భారతీయుల్లో దేశభక్తి ఉట్టిపడుతోంది. గాలి, నీరు, నిప్పు ఎక్కడ చూసిన జాతీయ జెండాలోని మూడు రంగులే కనిపిస్తున్నాయి. చివరకు పారే జలపాతంలో కూడా త్రివర్ణ పతాకం రంగులు జాలువారుతున్న దృశ్యాలు అమితమైన దేశభక్తిని చాటుతున్నాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Madhya Pradesh, India
భారతీయులంతా స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా ప్రతి పౌరుడు దేశభక్తిని, జాతీయ భావాన్ని చాటుకుంటూ త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లో కొందరు దేశభక్తులు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్బంగా ఏకంగా పారే జలపాతాన్ని(Waterfall)కూడా మూడు రంగుల జాతీయ జెండా(National flag)గా మార్చేశారు. ఇప్పుడు ఈ వీడియో(Video)నే వైరల్ (Viral)అవుతోంది. వాటర్‌ ఫాల్స్ చూసేందుకు వచ్చే పర్యాటకులతో పాటు దేశభక్తులు సైతం ఆ అద్భుతమైన దృశ్యాన్ని చూసి మంత్రముగ్ధులవుతున్నారు.

Shocking : తన కుండలోని మంచినీళ్లు తాగాడని..దళిత విద్యర్థిని కొట్టి చంపిన టీచర్


నీరులో కూడా నిండుకున్న దేశభక్తి..
దేశ ప్రజలకు బానిస సంకెళ్ల నుంచి విముక్తి కలిగి 75సంవత్సరాలు పూర్తి కావస్తోంది. ఈసందర్భంగా దేశ వ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవ వేడుకలను ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే దేశంలోని అనేక చిహ్నాలు, కట్టడాలు, చారిత్ర నిర్మాణాలకు త్రివర్ణ పతాకం రంగులతో అలంకరిస్తున్నారు. మరికొన్ని నిర్మాణాలకు మూడు రంగుల మువ్వన్నెల పతాకం రంగులో విద్యుత్‌ లైటింగ్ అమర్చి దేశభక్తిని చాటుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు చూడని అద్భుత దృశ్యం ఇప్పుడు వైరల్‌గా మారింది.

వైరల్ వీడియో..
మధ్యప్రదేశ్‌లోని హైదరగడ్‌కు చెందిన మృగన్నాథ జలపాతం ఎంతో ప్రసిద్ది చెందింది. ఇక్కడికి వేలాది మంది పర్యాటకులు జాలువారి పడే జలపాతం అందాల్ని చూడటానికి వస్తుంటారు. అయితే ఈసారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా వాటర్‌ ఫాల్స్‌లో ఎగవ నుంచి జాలువారే నీటి ధారను త్రివర్ణ రంగులో పడుతూ పర్యాటకుల మనసులు దోచుకుంటున్నాయి.

Groom Market: పెళ్లి కొడుకుల సంత.. రండి.. చూడండి.. నచ్చిన వారిని పెళ్లి చేసుకోండి


తిరంగ వాటర్ ఫాల్స్ ..
విదిషి నుంచి 35కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతం అందాల్ని చూడటానికి ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు వస్తుంటారు. ఈ వర్షాకాలంలో కూడా టూరిస్టులతో వాటర్‌ ఫాల్స్‌ దగ్గర సందడిగా మారింది. స్థానికంగా ఉంటున్న కొందరు యువకులు ..తమలోని దేశభక్తిని చాటుకునేందుకు జలపాతం ధారకు ఆరంజ్, గ్రీన్, వైట్ కలర్‌లు కలిపడంతో త్రివర్ణ పతాకం రంగులో జలధార కిందకుపడుతోంది. దేశభక్తిని అనేక రకాలుగా చాటుకుంటున్న దృశ్యాలలో ఇప్పుడు ఈ వీడియోనే వైరల్ అవుతోంది. ప్రతి ఒక్కరూ ఆ వీడియోనే వివిధ గ్రూప్‌లలో షేర్ చేసుకుంటున్నారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Azadi Ka Amrit Mahotsav, Independence Day 2022, Madhya pradesh, Viral Video

తదుపరి వార్తలు