Home /News /national /

POLITICS NATIONAL CONGRESS CHIEF SONIA GANDHI SEEKS RESIGNATION FROM FIVE STATES PCC PRESIDENTS AK

Sonia Gandhi: అంతా రాజీనామా చేయండి.. వారికి సోనియాగాంధీ కీలక ఆదేశాలు

సోనియా గాంధీ (ఫైల్ ఫోటో)

సోనియా గాంధీ (ఫైల్ ఫోటో)

Congress: తాజాగా పార్టీ ఓటమిపాలైన ఐదు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులను రాజీనామా చేయాల్సిందిగా పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆదేశాలు జారీ చేశారు.

    ఐదు రాష్ట్రాల్లో ఘోర ఓటమి తరువాత కాంగ్రెస్ పార్టీలో నాయకత్వంపై మళ్లీ చర్చ మొదలైంది. ఇటీవల కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో దీనిపై వాడీవేడీగా చర్చ జరగ్గా.. పార్టీకి తమ వల్లే నష్టమని భావిస్తే.. తామంతా తప్పుకుంటామని సోనియా గాంధీ (Sonia Gandhi) ప్రకటించారు. దీంతో మీరే పార్టీకి నాయకత్వం వహించాలని నేతలు కోరారు. దీంతో కాంగ్రెస పార్టీలో వివాదానికి తాత్కాలికంగా ఫుల్‌స్టాప్ పడింది. అయితే తాజాగా పార్టీ ఓటమిపాలైన ఐదు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులను రాజీనామా చేయాల్సిందిగా పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు మంగళవారం పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా వెల్లడించారు. పీసీసీ పునర్‌వ్యవస్థీకరణ కోసం తమ రాజీనామాలు సమర్పించాలని ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ పీసీసీ అధ్యక్షులను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కోరారని తెలిపారు.

    ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంపై సమీక్షించేందుకు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, యూపీ ఇన్‌ఛార్జ్ ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) వాద్రా ఢిల్లీలో సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే ప్రియాంక గాంధీని ఉత్తరప్రదేశ్ ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. యూపీలో పార్టీ స్థాయిని పెంచే బాధ్యతను తీసుకున్నారు. యూపీలో ప్రియాంక హై-వోల్టేజ్ ప్రచారం చేపట్టారు."లాడీ హూన్ లడ్ సక్తి హూన్" అనే నినాదంతో ముందుకు సాగారు. అయినప్పటికీ పార్టీ రాత మారలేదు. 2017లో కాంగ్రెస్ ఏడు గెలుచుకున్న కాంగ్రెస్.. ఈ సారి కేవలం రెండు సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. రెండు సీట్లతో పార్టీ ఓట్ల శాతం కూడా తగ్గింది. కేవలం 2.5 శాతానికి పరిమితమైంది.

    ఢిల్లీలోని గురుద్వారా రకబ్‌గంజ్ రోడ్‌లోని పార్టీ వార్‌రూమ్‌లో ఉత్తరప్రదేశ్ ఇన్‌ఛార్జ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకతో పార్టీ రాష్ట్ర అగ్రనేతలతో సమావేశం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగిన రెండు రోజుల తర్వాత ఈ భేటీ జరుగుతోంది.

    అంతకుముందు ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి, పార్టీకి తమ నాయకత్వం అవసరం లేదని భావిస్తే.. తాము తప్పుకుంటామని సోనియాగాంధీ పార్టీ నేతలకు స్పష్టం చేశారు. అయితే ఇందుకు పార్టీ నేతల అంగీకరించలేదు. దీంతో పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల అనంతరం పార్టీ అంతర్గత ఎన్నికలకు సిద్ధం కావాలని నిర్ణయించారు.

    Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. ఆఫీసులో మొబైల్ ఫోన్లు వాడొద్దన్న హైకోర్టు

    Hijab Row: సంచలన తీర్పు.. హిజాబ్ నిషేధాన్ని సమర్థించిన హైకోర్టు.. పిటిషన్లు కొట్టివేత

    1989 నుంచి ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రాలేకపోయింది. కొన్నేళ్లుగా ఆ రాష్ట్రంలో నిరంతరంగా పట్టు కోల్పోతోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ తన కుటుంబ కంచుకోట అయిన అమేథీలో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు.

    సోనియా గాంధీ సంప్రదాయ స్థానమైన రాయ్ బరేలీ కాకుండా అమేథీ కాంగ్రెస్ బలమైన స్థానాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ రెండు స్థానాల పరిధిలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రస్తుతం హస్తం పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Congress, Sonia Gandhi

    తదుపరి వార్తలు