Home /News /national /

POLITICS NATIONAL CM BHAGWANT MANN MOVES RESOLUTION IN ASSEMBLY SEEKING TRANSFER OF CHANDIGARH TO PUNJAB SB

Punjab: చండీగఢ్ మాకు ఇచ్చేయండి.. కేంద్రంతో వార్‌కు సిద్ధమైన సీఎం భగవంత్ మాన్

పంజాబ్ సీఎం భగవంత్ మాన్

పంజాబ్ సీఎం భగవంత్ మాన్

1966లో హిందీ భాష మాట్లాడే వారితో ప్రత్యేకంగా హర్యానా రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ ... పూర్వ పంజాబ్‌ను విభజించారు. అదే సమయంలో కొత్త రాష్ట్రంగా హర్యానా ఏర్పడింది.

    పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేంద్రంతో ఆమి తుమీ తేల్చుకోవడానికి సిద్దమయ్యారు. చండీఘడ్‌ను పూర్తిగా పంజాబ్‌కు బదిలీ చేయాలంటూ... అసెంబ్లీలో ఇవాళ సీఎం తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ తీర్మానంపై చర్చించి నిర్ణయం తీసుకునేందుకు ఇవాళ ప్రత్యేకంగా ఒక రోజు అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన ఎపుడు జరిగినా... రాష్ట్ర రాజధాని మాతృ రాష్ట్రానికి ఉంటుందని తీర్మానంలో పేర్కొన్నారు. ప్రజల సెంటిమెంట్‌ను దృష్టిలో పెట్టుకుని వెంటనే చండీఘడ్‌ను పంజాబ్‌కు బదిలీ చేయాలని తీర్మానంలో పేర్కొన్నారు. ఈ అంశంపై కేంద్రంతో చర్చలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వానికి అసెంబ్లీ సిఫారసు చేసేలా తీర్మానంలో పేర్కొన్నారు.

    1966లో హిందీ భాష మాట్లాడే వారితో ప్రత్యేకంగా హర్యానా రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ ... పూర్వ పంజాబ్‌ను విభజించారు. ఇలా విభజన జరిగినపుడు రాజధాని మాతృ రాష్ట్రానికే చెందాలని ఆప్‌ అంటోంది. చండీగఢ్ ఉత్తర భారతదేశంలోని ఒక నగరం, కేంద్రపాలిత ప్రాంతం. ఇది పంజాబ్, హర్యానా రెండు రాష్ట్రాలకు రాజధాని, కాని ఆ రెంటిలో ఏ రాష్ట్రానికి చెందని కేంద్రపాలిత ప్రాంతంగా ఉండడం చండీగఢ్ ప్రత్యేకత. చండీగఢ్ (ఉత్తరభారదేశంలోని ప్రముఖనగరాలలో ఒకటి. 1966 నవంబరు 1న హర్యానా రాష్ట్రం ఏర్పడటంతో చండీగఢ్ నగరం మధ్యలో ఉన్నందున దీనిని కేంద్రపాలిత ప్రాంతం చేశారు. పంజాబ్, హర్యానా రెండు రాష్ట్రాలకు రాజధానిని చేసారు. ఈ నగర చివరి పాలకుడు బ్రిజిందర్ సింగ్.

    కేంద్రపాలిత ప్రాంత హోదాలో చండీగఢ్ ప్రస్తుతం పంజాబ్‌-హర్యానాల సంయుక్త రాజధానిగా ఉంది. పరిపాలనాపరంగా 60:40గా పంజాబ్‌, హర్యానాలు చండీగఢ్‌నును పంచుకుంటున్నాయి. ఈ తరుణంలో చండీగఢ్‌పై సర్వహక్కులు పంజాబ్‌వేనని, అందుకే పూర్తిగా పంజాబ్‌కు బదిలీ చేయాలంటూ సీఎం భగవంత్ మాన్ తీర్మానం చేశారు. దీనికి ఆర్థిక మంత్రి హర్‌పాల్‌ సింగ్‌ చీమా మద్దతు ప్రకటించగా.. తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్బంగా అసెంబ్లీ మాట్లాడిన ముఖ్యమంత్రి కేంద్రం తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఛండీగఢ్‌ నుంచి కాకుండా బయటి వాళ్లను(కేంద్ర సర్వీస్‌ ఉద్యోగులతో) నియమించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంతకాలం కొనసాగిన సమతుల్యతను దెబ్బ తీయాలని కేంద్రం చూస్తోందని ఆరోపించారాయన. భాక్రా బియస్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డులో కేంద్ర ఉద్యోగుల్ని నియమించడంపై కూడా సీఎం అభ్యంతరం వ్యక్తం చేశారు.

    అయితే పంజాబ్‌లో ఇటీవల ఆప్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ కూడా ఢిల్లీ తరహా పాలన చేసేందుకు రెడీ అవుతోంది. అనేక అంశాల్లో కేంద్రంతో గొడవ పడ్డ ఆప్‌... ఇపుడు పంజాబ్‌లోనూ అదే సీన్‌ రిపీట్‌ చేస్తోంది. చండీఘడ్‌ను పూర్తిగా పంజాబ్‌కు బదిలీ చేయాలంటూ పంజాబ్‌ ముఖ్యమంత్రి భగ్వంత్‌ మాన్‌ ఇవాళ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టారు. పంజాబ్‌ సర్వీస్‌ రూల్స్‌కు బదులు ఛండీగఢ్‌ ఉద్యోగులకు సెంట్రల్‌ సర్వీస్‌ రూల్స్‌ వర్తిస్తాయని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఈ మధ్య ప్రకటించారు. దీంతో ఇప్పుడు కౌంటర్‌గా చండీగఢ్‌.. పంజాబ్‌కే పూర్తి రాజధానిగా ఉండాలంటూ తీర్మానం సీఎం భగవంత్‌ మాన్‌ ప్రవేశపెట్టడం విశేషం
    Published by:Sultana Shaik
    First published:

    Tags: AAP, Chandigarh, Punjab, Punjab news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు