హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

BJP| Rajya Sabha: బీజేపీ ఖాతాలో మరో రికార్డ్.. రాజ్యసభలో సెంచరీ కొట్టనున్న కమలం పార్టీ

BJP| Rajya Sabha: బీజేపీ ఖాతాలో మరో రికార్డ్.. రాజ్యసభలో సెంచరీ కొట్టనున్న కమలం పార్టీ

BJP: 2014లో ఎగువసభలో బీజేపీ సభ్యుల సంఖ్య 55. ఆ తర్వాత పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో విజయాలను నమోదు చేసుకున్న బీజేపీ.. రాజ్యసభలో తమ సభ్యుల సంఖ్యను పెంచుకుంటోంది.

BJP: 2014లో ఎగువసభలో బీజేపీ సభ్యుల సంఖ్య 55. ఆ తర్వాత పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో విజయాలను నమోదు చేసుకున్న బీజేపీ.. రాజ్యసభలో తమ సభ్యుల సంఖ్యను పెంచుకుంటోంది.

BJP: 2014లో ఎగువసభలో బీజేపీ సభ్యుల సంఖ్య 55. ఆ తర్వాత పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో విజయాలను నమోదు చేసుకున్న బీజేపీ.. రాజ్యసభలో తమ సభ్యుల సంఖ్యను పెంచుకుంటోంది.

  రాజ్యసభ ఎన్నికల్లో అస్సాం, త్రిపుర, నాగాలాండ్‌లో ఒక్కో సీటు గెలిచి చరిత్రలో తొలిసారి భారతీయ జనతా పార్టీ ఎగువ సభలో వంద సీట్ల సంఖ్య మార్కుకు చేరుకోబోతోంది. ఇటీవల ఆరు రాష్ట్రాల్లోని 13 రాజ్యసభ స్థానాలపై జరిగిన ఎన్నికల్లో బిజెపి(Bjp) పంజాబ్‌లో ఒక సీటును కోల్పోయింది, అయితే అస్సాం, త్రిపుర, నాగాలాండ్, హిమాచల్ ప్రదేశ్‌లోఒక్కొక్క సీటును గెలుచుకుంది. ఈ రాష్ట్రాల నుండి ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు పదవీ విరమణ చేశారు. పంజాబ్‌లోని మొత్తం ఐదు స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు ఎన్నికయ్యారు. రాజ్యసభ వెబ్‌సైట్‌లో కొత్త సభ్యులకు సంబంధించిన గణాంకాలు ఇంకా పొందుపర్చకపోయినప్పటికీ.. ఇటీవలి ఎన్నికలకు సంబంధించిన గణాంకాలను బట్టి చూస్తే బీజేపీ సభ్యుల సంఖ్య 100కి పెరుగుతుంది. ప్రస్తుతం రాజ్యసభలో(Rajya Sabha) బీజేపీకి 97 మంది సభ్యులు ఉన్నారు.

  అయితే 245 మంది సభ్యులున్న రాజ్యసభలో బీజేపీ మెజారిటీకి దూరంగానే ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi)నేతృత్వంలో 2014 లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత బీజేపీ గ్రాఫ్ అంతకంతకూ పెరుగుతోందని ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి.2014లో ఎగువసభలో బీజేపీ సభ్యుల సంఖ్య 55. ఆ తర్వాత పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో విజయాలను నమోదు చేసుకున్న బీజేపీ.. రాజ్యసభలో తమ సభ్యుల సంఖ్యను పెంచుకుంటోంది. ఇప్పుడు ఆ సంఖ్య ఏకంగా వందకు చేరుకుంది.

  గతంలో 1990లో కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించిన 108 మంది సభ్యులు ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ సభ్యుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. అనేక రాష్ట్రాల్లో ఒక్కొక్కటిగా ప్రభుత్వాలను కోల్పోవాల్సి వచ్చింది. ఇది రాజ్యసభలో ఆ పార్టీ సభ్యుల సంఖ్యను ప్రభావితం చేసింది.

  రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, రాజస్థాన్, జార్ఖండ్‌లలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలు ఉన్నందున బీజేపీ ఎదుగుదల ఆగిపోవచ్చు.

  Nirmala Sitharaman: భారత దేశ ప్రయోజనాలే మా తొలి ప్రయారిటీ.. అమెరికాకు నిర్మలా సీతారామన్ స్ట్రాంగ్ కౌంటర్..

  PM Modi: ప్రధాని మోదీని చంపేందుకు కుట్ర.. ఈ-మెయిల్‌తో కలకలం... రంగంలోకి దిగిన ఎన్ఐఏ

  ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ సభ్యుల సంఖ్య కాస్త తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో 11 సీట్లు ఖాళీ కాగా వీటిలో కనీసం తొమ్మిది సీట్లు గెలుచుకునే పరిస్థితిలో బీజేపీ ఉంది. రాజ్యసభ నుంచి పదవీ విరమణ చేస్తున్న 11 మంది సభ్యుల్లో ఐదుగురు బీజేపీకి చెందిన వారు.

  First published:

  Tags: Bjp, Rajya Sabha

  ఉత్తమ కథలు