POLITICS NATIONAL BJP FOUNDING DAY PRIME MINISTER MODI ADDRESSES PARTY WORKERS SAYS EVERY BJP WORKER IS A REPRESENTATIVE OF COUNTRYS DREAMS HERE ARE THE KEY POINTS GH VB
BJP Founding Day: భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం.. కీలక అంశాలు ఇవే..!
భారతీయ జనతా పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం(BJP 42nd Founding Day) సందర్భంగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) మాట్లాడారు. ఎనిమిదేళ్లుగా ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ను సాధించేందుకు బీజేపీ శ్రమిస్తున్న తీరును, తీసుకొంటున్న చర్యలను వివరించారు.
భారతీయ జనతా పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం(BJP 42nd Founding Day) సందర్భంగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) మాట్లాడారు. ఎనిమిదేళ్లుగా ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ను సాధించేందుకు బీజేపీ శ్రమిస్తున్న తీరును, తీసుకొంటున్న చర్యలను వివరించారు.
భారతీయ జనతా పార్టీ(BJP) 42వ ఆవిర్భావ దినోత్సవం(BJP 42nd Founding Day) సందర్భంగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) మాట్లాడారు. ఎనిమిదేళ్లుగా ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ను సాధించేందుకు బీజేపీ(BJP) శ్రమిస్తున్న తీరును, తీసుకొంటున్న చర్యలను వివరించారు. బీజేపీ దేశభక్తికి అంకితమై పని చేస్తుంటే ప్రత్యర్థి పార్టీలు వారసత్వ రాజకీయాల్లో నిమగ్నమై ఉన్నాయని ప్రధాని మోదీ(Prime Minister Modi) అన్నారు. వారసులను అందలమెక్కించే పనిలో ఉన్న ఇతర పార్టీలు.. దేశ యువతకు అభివృద్ధి చెందే అవకాశమే ఇవ్వలేదని ఆరోపించారు. దేశంలో ప్రధానంగా ఉన్న ఈ సమస్యపై గొంతు వినిపించిన, వ్యతిరేకించిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని మోదీ పునరుద్ఘాటించారు. అందుకు బీజేపీ కార్యకర్తలు అందరూ గర్వపడాలని చెప్పారు.
బీజేపీ ఆవిర్భావ వేడుకల్లో ప్రధాని మోదీ ప్రసంగంలోని ప్రధాన అంశాలు ఇవే..
* రాజకీయాల్లో కుటుంబాల ఆధిపత్యంపై మోదీ మాట్లాడారు. ప్రస్తుతం దేశంలో రెండు రకాల రాజకీయాలు నడుస్తున్నాయని, ఒకటి కుటుంబంపై ప్రేమతో చేస్తున్న రాజకీయాలు కాగా.. రెండోది దేశంపై ప్రేమతో చేస్తున్న రాజకీయాలని మోదీ చెప్పారు. తమ కుటుంబాల ప్రయోజనాల కోసం మాత్రమే పని చేసే పార్టీలు ఆయా రాష్ట్రాల్లో ఉన్నాయని, వంశపారపర్యంగా పార్టీలను అంటిపెట్టుకొని పదవులు అనుభవిస్తున్నారని ఆరోపించారు. దశాబ్దాలుగా దేశానికి హాని జరుగుతోందని, కుటుంబ పార్టీలు దేశంలోని యువతను ముందుకు వెళ్లనివ్వడం లేదని, ఎల్లప్పుడూ యువతకు ద్రోహం చేస్తున్నాయని చెప్పారు. ఈ సమస్యపై దేశాన్ని హెచ్చరిస్తూ, అవగాహన కల్పిస్తున్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని, అందుకు బీజేపీ కార్యకర్తలు గర్వపడాలని ప్రధాని మోదీ తెలిపారు.
* ఓటు బ్యాంకు రాజకీయాలపై మోదీ మాట్లాడుతూ.. ‘కొన్ని పార్టీలు దశాబ్దాలుగా ఓటు బ్యాంకు రాజకీయాలు మాత్రమే చేశాయి. కొందరి కోసం మాత్రమే వాగ్దానాలు చేస్తున్నాయి. కొన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకొనే ఉద్దేశంతో పథకాలు ప్రవేశపెడుతున్నాయి. పక్షపాతం, అవినీతి ఓటు బ్యాంకు రాజకీయాల దుష్ప్రభావాలను బీజేపీ సవాలు చేయడమే కాకుండా.. ప్రజలు అర్థమయ్యేలా చెప్పడంలో బీజేపీ విజయం సాధించింది.’ అని చెప్పారు.
* ప్రపంచంలో భారతదేశం పాత్రపై ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘నేడు భారతదేశం భయం, ఒత్తిడి లేకుండా తన ఉద్దేశాలను ప్రపంచం ముందు ధైర్యంగా నిలుపుతోంది. ప్రపంచం మొత్తం రెండు ప్రత్యర్థి వర్గాలుగా విడిపోయినప్పుడు, భారతదేశం మానవత్వం గురించి గట్టిగా మాట్లాడగల దేశంగా నిలిచింది.’ అని తెలిపారు.
* వ్యవస్థాపక దినోత్సవం ప్రాధాన్యాన్ని మోదీ వివరిస్తూ.. ఈ సంవత్సరం వ్యవస్థాపక దినోత్సవం మూడు కారణాల వల్ల ముఖ్యమైనదని అభిప్రాయపడ్డారు. అందులో మొదటిది దేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకొంటోందని, రెండోది మారుతున్న ప్రపంచ పరిస్థితులు కాగా.. మూడోది ఇటీవలే నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ భారీ విజయం సాధించిందని అన్నారు.
* ఇటీవల భారతీయ జనతా పార్టీ సాధించిన విజయాలపై ప్రధాని మాట్లాడుతూ.. ‘వారం క్రితం విడుదలైన ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ రెండు రాష్ట్రాల్లో తిరిగి అధికారంలోకి వచ్చింది. మూడు దశాబ్దాల తర్వాత రాజ్యసభలో 100 మార్కును తాకిన పార్టీగా భారతీయ జనతా పార్టీ నిలిచింది’ అని తెలిపారు. ఇంతకు ముందు ఏ పార్టీ ప్రభుత్వమైనా దేశానికి ఏమీ చేయదని పౌరులు భావించేవారని, నేడు దేశంలోని ప్రతి పౌరుడు దేశం మారుతోందని, వేగంగా ముందుకు సాగుతోందని గర్వంగా చెప్పుకొంటున్నారని వెల్లడించారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.