Home /News /national /

POLITICS NATIONAL AS PRASHANT KISHOR LIKELY TO JOIN CONGRESS BEFORE GUJARAT POLLS TRS CM KCR MAY RETHINK ON PK STRATEGIES MKS

CM KCR లెక్క తప్పిందా? -హ్యాండివ్వనున్న ప్రశాంత్ కిషోర్ -కాంగ్రెస్‌ గూటికి ఎన్నికల వ్యూహకర్త!

ప్రశాంత్ కిషోర్, కేసీఆర్

ప్రశాంత్ కిషోర్, కేసీఆర్

కాంగ్రెస్ లో చేరిక లేదా కలిసి పనిచేసే దిశగా ప్రశాంత్ కిషోర్ ఢిల్లీలో కీలక మంతనాలు నడుపుతున్న క్రమంలో కేసీఆర్ కొత్త స్ట్రాటజిస్టును వెత్తుక్కోవాల్సిన పరిస్థితి. ఇప్పటిదాకా పీకేతో పంచుకున్న వ్యూహాలనూ రీమాస్టర్ చేసుకునే దిశగా..

జాతీయ రాజకీయాల విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ లెక్క మరోసారి తప్పిందా? జాతీయ స్థాయిలో విపక్షాల ఐక్యత, అందునా కాంగ్రెసేతర కూటమి ప్రయత్నాలు విఫలం కానున్నాయా? కేసీఆర్ తప్పుడు అంచనాలు ఈసారి తెలంగాణలోనూ టీఆర్ఎస్‌పై ప్రభావం చూపనున్నాయా? అంటే జరుగుతోన్న పరిణామాలను బట్టి అవుననే సమాధానం వినిపిస్తోంది. జాతీయ స్థాయితోపాటే తెలంగాణలోనూ బీజేపీని నిలువరించడానికి కేసీఆర్ నియమించుకున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ హ్యాండివ్వడం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ లో చేరిక లేదా కలిసి పనిచేసే దిశగా పీకే ఢిల్లీలో కీలక మంతనాలు నడుపుతున్న క్రమంలో కేసీఆర్ కొత్త స్ట్రాటజిస్టును వెత్తుక్కోవాల్సిన పరిస్థితి. ఇప్పటిదాకా పీకేతో పంచుకున్న వ్యూహాలనూ సైతం కేసీఆర్ రీమాస్టర్ చేసుకోవాల్సిన సందర్భం..

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఉండబోవని సీఎం కేసీఆర్ చెప్పినప్పటికీ, ఏ క్షణమైనా ఎన్నికలు ఎదుర్కొనేలా టీఆర్ఎస్ యంత్రాంగం సిద్ధమవుతున్నది. ఈసారి టీఆర్ఎస్ కు ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పనిచేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పర్యటించిన పీకే.. కేసీఆర్ తోనూ సుదీర్ఘంగా భేటీ అయ్యారు. డబ్బులు ఇవ్వకుండా ఉచితంగానే పీకే సేవలు వాడుకుంటున్నట్లు సీఎం కేసీఆర్ సైతం వెల్లడించారు. అంతేకాదు, ప్రశాంత్ కిషోర్ గొప్ప విజన్ ఉన్న నేత అని, ఎనిమిదేళ్లుగా మిత్రుడని కేసీఆర్ పొగిడారు. పీకే వ్యూహాల మేరకు టీఆర్ఎస్ ఎన్నికల రణతంత్రాన్ని సిద్దం చేసుకుంటుండగా, ఇప్పుడు పీకే స్వయంగా కాంగ్రెస్ లో చేరనుండటం గులాబీ బాస్ అంచనాలకు అతీతంగా జరిగినట్లయింది..

KCR దూకుడుకు అమిత్ షా కళ్లెం! -ఢిల్లీ నుంచే మిషన్ తెలంగాణ ఆపరేషన్ -రంగంలోకి ఆ 26 మంది?


దేశంలో విజయవంతమైన ఎన్నికల వ్యూహకర్తగా పేరున్న ప్రశాంత్‌ కిశోర్‌ కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది కూడా ఆయన హైకమాండ్ తో సంప్రదింపులు జరిపినా.. పదవీబాధ్యతల విషయంలో క్లారిటీ రాని కారణంగా చేరిక వాయిదా పడింది. కాంగ్రెస్ లో పీకే చేరికపై యూపీ ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ సైతం బాహాటంగా వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. 2014 లో మోదీని తిరుగులేని నేతగా నిలబెట్టిన తర్వాత క్రమంగా దూరమైన పీకే గత కొంతకాలంగా బీజేపీ వ్యతిరేక శక్తులతో కలిసి పనిచేస్తున్నారు. ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల విశ్లేషణలో.. ఇప్పటికీ బీజేపీకి సరైన ప్రత్యామ్నయం కాంగ్రెస్ పార్టీనే అని, హస్తం పార్టీ తన స్ట్రాటజీలు మార్చుకుంటే బీజేపీని ఈజీగా నిలువరించవచ్చని పీకే వాదించారు. అయితే,

CM KCR | Prashant Kishor : ప్రశాంత్ కిషోర్ సంచలన రహస్యాలు చెప్పిన కేసీఆర్.. ప్యాకేజీ రూ. 3వేల కోట్లు!


బీజేపీని అడ్డుకోకుంటే దేశంలో రాబోయే దశాబ్దంలో అసాధారణ పరిణామాలు తలెత్తే అవకాశాలున్నట్లు ప్రశాంత్ కిషోర్ అంచనాగా పలు ఇంటర్వ్యూల్లో వెల్లడైంది. స్వయంగా తానే కాంగ్రెస్ లో చేరడం ద్వారా పార్టీని బలోపేతం చేయాలన్నది పీకే వ్యూహంగా కనిపిస్తోంది. అహ్మద్ పటేల్ మరణం తర్వాత కాంగ్రెస్ లో సోనియా గాంధీ తరఫున వ్యవహారాలను చక్కబెట్టగల నేతలు కరువయ్యారు. ఉన్న సీనియర్లు జీ-23 గ్రూపుగా ఏర్పడి గాంధీ కుటుంబంపై దాదాపు తిరుగుబాటు ప్రకటించారు. కాంగ్రెస్ అసంతృప్త వర్గానికి నాయకుడిగా భావిస్తోన్న గులాం నబీ ఆజాద్ కు బీజేపీ రాష్ట్రపతి పదవిని ఆఫర్ చేస్తున్నట్లూ వార్తలు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ చేరిక కాంగ్రెస్ కు బలంచేకూర్చుతుందని కొందరు నేతలు అంటుండగా, కిశోర్‌ రాకపై ఇంకొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

CM KCRకు పీకే-Revanth Reddyకి ఎస్కే: ముందస్తు ఎన్నికల ప్లాన్ మామూలుగా లేదు..గురువుకు షాక్?


ప్రశాంత్ కిషోర్ నేరుగా కాంగ్రెస్ లో చేరినా చేరకపోయినా 2022 చివర్లో జరిగే గుజరాత్‌ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్‌ వ్యూహకర్తగా పనిచేయడం దాదాపు ఖరాయ్యే అవకాశాలున్నాయి. గుజరాత్ తోపాటు హిమాచల్ ప్రదేశ్, ఇతర రాష్ట్రాల్లోనూ పీకే కాంగ్రెస్ కోసం పనిచేసేలా ప్రణాళికలు రూపొందించుకున్నట్లు సమాచారం. అదే జరిగితే తెలంగాణలో కేసీఆర్ తో ఉన్న బందాన్ని పీకే తెంచుకుంటారనీ వినికిడి. కాంగ్రెసేతర కూటమి ఏర్పాటు దిశగా పీకే బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో కలిసి పనిచేసినప్పటికీ ఆశించిన ఫలితాలు రాలేదు. పైగా దీదీ మార్కు దూకుడు బీజేపీ కంటే కాంగ్రెస్ కే ఎక్కువ నష్టం చేస్తున్న దరిమిలా పీకే టీఎంసీకి దూరంగా ఉండాలనుకున్నట్లు తెలుస్తోంది.

Chaitra Navratri: రాబోయే 9 రోజులు ఈ పనులు చేస్తే అరిష్టం.. అమ్మ అనుగ్రహం పొందాలంటే..


ఒక గాంధేయవాదిగా కాంగ్రెస్ కు నష్టం చూకూర్చే పనులకు ఇకపై దూరంగా ఉండాలని ప్రశాంత్ కిషోర్ నిర్ణయించుకున్నారని, తన కండిషన్లకు అధిష్టానం ఒప్పుకుంటే పార్టీలో చేరిపోతారని లేదంటే వ్యూహకర్తగానే సేవలు కొనసాగిస్తారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పీకే రాజకీయ జీవితంలో మార్పులు.. ఆయన పనిచేసే పార్టీలపైనా చూపుతాయనే అంచనాలున్నాయి. ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ కోసం పనిచేయనున్న పీకే.. తెలంగాణలో కేసీఆర్ కోసం వ్యూహాలు పన్నే అవకాశాలు ఉండవని, ఆ మేరకు కేసీఆర్ కు పీకే హ్యాండివ్వడం తప్పనిసరే అనే చర్చ జరుగుతోంది. అయితే, ఐపాక్ సంస్థతలో నేరుగా సంబంధాలు లేవని పీకే చెబుతుండటాన్ని నేతలు నమ్మితే కథ వేరేలా ఉండొచ్చు. ఏదేమైనా రాబోయే వారం రోజుల్లో ప్రశాంత్ కిషోర్ భవిష్యత్ కార్యాచరణను బట్టి కేసీఆర్ నిర్ణయాలను మార్చుకుంటారనే వాదన వినిపిస్తోంది.
Published by:Madhu Kota
First published:

Tags: CM KCR, Congress, Prashant kishor, Telangana, Trs

తదుపరి వార్తలు