హోమ్ /వార్తలు /national /

జగన్‌కి వైసీపీ ఎంపీ సలహా.. ఏపీకి 3 రాజధానులు ఓకే.. కానీ..

జగన్‌కి వైసీపీ ఎంపీ సలహా.. ఏపీకి 3 రాజధానులు ఓకే.. కానీ..

మూడు రాజధానుల కాన్సెప్ట్ బాగుందని.. ఐతే హైకోర్టు విషయంలో చిన్న మార్పు చేస్తే బాగుంటుందని వైసీపీ ఎంపీ అభిప్రాయపడ్డారు.

మూడు రాజధానుల కాన్సెప్ట్ బాగుందని.. ఐతే హైకోర్టు విషయంలో చిన్న మార్పు చేస్తే బాగుంటుందని వైసీపీ ఎంపీ అభిప్రాయపడ్డారు.

మూడు రాజధానుల కాన్సెప్ట్ బాగుందని.. ఐతే హైకోర్టు విషయంలో చిన్న మార్పు చేస్తే బాగుంటుందని వైసీపీ ఎంపీ అభిప్రాయపడ్డారు.

  ఏపీ రాజధానిపై అసెంబ్లీలో సీఎం జగన్ చేసిన ప్రకటన హాట్‌ టాపిక్‌గా మారింది. సౌతాఫ్రికా తరహాలో ఏపీలో మూడు రాజధానులు ఉండే అవకాశముందని ఆయన అసెంబ్లీలో చెప్పారు. ఏపీ ప్రజలంతా ఇప్పుడు దీని గురించే చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో జగన్ ప్రకటనపై వైసీపీ నేత, నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల కాన్సెప్ట్ బాగుందని.. ఐతే హైకోర్టు విషయంలో చిన్న మార్పు చేస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

  సీఎం జగన్ చెప్పినట్లు శాసన వ్యవహారాలకు అమరావతి, పరిపాలనా వ్యవహారాలకు విశాఖపట్టణం బాగుంటాయని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఐతే హైకోర్టు విజయవాడలో ఉంటేనే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ''భౌగోళికంగా చూస్తే సౌతాఫ్రికాలో సుప్రీంకోర్టు ఆ దేశానికి మధ్యలో ఉంటుంది. ఏపీ హైకోర్టు కూడా రాష్ట్రం మధ్యలో ఉండే విజయవాడలో ఉంటేనే బాగుంటుంది. అప్పుడే ప్రజలందరికీ న్యాయవ్యవస్థ అందుబాటులో ఉంటుంది. కర్నూల్‌లో రెండు బెంచ్‌లు ఏర్పాటు చేస్తే సరిపోతుంది. రాయలసీమ లాయర్లు కూడా అదే కోరారు. ప్రజలు కూడా బహుశా ఇలానే కోరుకోవచ్చు'' అని ఆయన అన్నారు. ఓ టీవీ ఛానెల్‌ లైవ్ డిస్కషన్‌లో ఈ మేరకు తన అభిప్రాయాలను వెల్లడించారు.

  english medium in ap,telugu language,ysrcp mp raghu rama krishnam raju speech,ysrcp mp raghu rama krishnam raju in lok sabha,ysrcp mp raghu rama krishnam raju on english medium,ysrcp mp raghu rama krishnam raju on telugu medium,telugu news,రఘురామ కృష్ణంరాజు, ఇంగ్లీష్ మీడియంపై రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యలు,ఏపీలో ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, తెలుగు భాష
  రఘురామ కృష్ణం రాజు (ఫైల్)

  First published:

  Tags: Amaravati, AP News, MP raghurama krishnam raju, Ys jagan

  ఉత్తమ కథలు