హోమ్ /వార్తలు /national /

టీడీపీ మాస్టర్ ప్లాన్... లోకేశ్‌తో పాటు రంగంలోకి బ్రాహ్మణి

టీడీపీ మాస్టర్ ప్లాన్... లోకేశ్‌తో పాటు రంగంలోకి బ్రాహ్మణి

టీడీపీ యువనేతలతో లోకేశ్, బ్రాహ్మణి

టీడీపీ యువనేతలతో లోకేశ్, బ్రాహ్మణి

టీడీపీ యువనేతలతో లోకేశ్ నిర్వహించిన సమావేశంలో నారా బ్రహ్మణి కూడా పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది.

  ఏపీలో అధికారం కోల్పోయిన తరువాత రాజకీయంగా కష్టాలను ఎదుర్కొంటున్న టీడీపీ... తిరిగి పుంజుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ఓవైపు వైసీపీ నేతలు టీడీపీని మరింతగా కట్టడి చేసేందుకు వ్యూహాలు రచిస్తుంటే... వైసీపీ వైఫల్యాలే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్లాలని టీడీపీ నిర్ణయించింది. ఇందుకోసం ఆ పార్టీ అధినేత చంద్రబాబు తనదైన వ్యూహాలు రచిస్తుంటే... ఆ పార్టీ యువనేత, చంద్రబాబు తనయుడు లోకేశ్ కూడా పార్టీ యువనేతలతో కలిసి సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.

  ముఖ్యంగా సీఎం జగన్ సర్కార్‌ను ఇరకాటంలో పెట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై యువ నాయకులతో చర్చించారట లోకేశ్. అధికార పార్టీకి బ్యాగ్రౌండ్‌లో కీలకంగా వ్యవహరిస్తోన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రజావ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కట్టడి చేసేలా ప్రయత్నాలు ఉదృతం చేయమని లోకేశ్ యువనేతలకు దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. సోషల్ మీడియాలో ప్రజల వాణిని వినిపించడం, జిల్లా కార్యాక్రమాల్లో చురగ్గా పాల్గొమని లోకేశ్..యంగ్ లీడర్స్‌కు పిలుపునిచ్చారని టాక్.

  అయితే ఇదే సమావేశంలో లోకేశ్ భార్య బ్రాహ్మణి కూడా పాల్గొనడంపై కొత్త టాక్ వినిపిస్తోంది. టీడీపీ మహిళా నేతలకు బ్రాహ్మణి తనదైన సూచనలు చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. కొందరు మహిళా నేతలు... బ్రహ్మణిని కూడా రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించారని తెలుస్తోంది. మొత్తానికి టీడీపీ యువనేతల సమావేశంలో లోకేశ్ పాటు బ్రాహ్మణి సైతం నేతలకు పలు సూచనలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, Nara Brahmani, Nara Lokesh, Tdp

  ఉత్తమ కథలు