హోమ్ /వార్తలు /national /

వైసీపీ కార్యకర్తలకు నారా లోకేశ్ వార్నింగ్...

వైసీపీ కార్యకర్తలకు నారా లోకేశ్ వార్నింగ్...

ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ టీడీపీ నినాదమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేశ్ అన్నారు. న్యాయస్థానాల్లో ప్రజల ఆకాంక్షలకు న్యాయం జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజా రాజధాని అమరావతిని పరిరక్షించుకుని తీరుతామని తెలిపారు.

అమరావతిని లేకుండా చేసేందుకు మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నారని... రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడులు రావడం లేదని నారా లోకేశ్ ధ్వజమెత్తారు.

    టీడీపీ యువనేత, మాజీమంత్రి నారా లోకేశ్ వైసీపీ శ్రేణులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న లోకేశ్... తన పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వైసీపీ కార్యకర్తలపై మండిపడ్డారు. ఇది పులివెందుల కాదని.. రౌడీయిజం చేస్తే తరిమి కొడతామని తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. టీడీపీ సంక్షేమ పథకాలన్నీ సీఎం జగన్ రద్దు చేస్తున్నారని... తుగ్లక్ ముఖ్యమంత్రి ఇసుక ధరలు ఐదు రెట్లు పెంచాడని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు పనులు ఆపేశారని... ఎన్నికల హామీలు అమలు చేయకుండా ప్రజలను జగన్ మోసం చేస్తున్నారని విమర్శించారు.

    అమరావతిని లేకుండా చేసేందుకు మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నారని... రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడులు రావడం లేదని నారా లోకేశ్ ధ్వజమెత్తారు. దేశంలో 38 క్రిమినల్ కేసులున్న ఒకే ఒక్క సీఎం జగన్ అని... శుక్రవారం కోర్టు హాజరు తప్పించుకోవడానికి ఆయన ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. 350 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా జగన్ పట్టించుకోలేదని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ సత్తా చూపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అంతకుముందు టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు చెప్పులు, కుర్చీలు విసరడంతో... ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.

    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Nara Lokesh, Ysrcp

    ఉత్తమ కథలు