హోమ్ /వార్తలు /national /

ఇవాళ గుడ్లు.. రేపు బాంబులు.. విశాఖ ఘటనపై లోకేష్ ఆగ్రహం

ఇవాళ గుడ్లు.. రేపు బాంబులు.. విశాఖ ఘటనపై లోకేష్ ఆగ్రహం

నారా లోకేష్

నారా లోకేష్

జగన్ విశాఖలో అడుగుపెడితే అరాచకం ఏ రేంజ్‌లో ఉంటుందో వైసీపీ ఇవాళ ట్రైలర్ చూపించిందని మండిపడ్డారు. ఇవాళ గుడ్లు, టమోటాలు విసిరినవాళ్లు.. రేపు బాంబులు, కత్తులు కూడా విసురుతారంటూ విరుచుకుపడ్డారు.

  చంద్రబాబు పర్యటన నేపథ్యంలో విశాఖలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విశాఖ ఎయిర్‌పోర్టు వద్ద టీడీపీ, వైసీపీ వర్గాలు పోటాపోటీగా ఆందోళనకు దిగారు. చంద్రబాబును విశాఖలో అడుగు పెట్టనిచ్చేది లేదంటూ వైసీపీ వర్గాలు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. విశాఖలో రాజధానిని వ్యతిరేకిస్తన్న ఆయన.. ఉత్తరాంధ్ర ద్రోహి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. రోడ్డుపై పడుకొని చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. కొందరు ఆందోళనకారులు చంద్రబాబు వాహనంపై కోడిగుడ్లు, టమాటాలు విసిరినట్లు సమాచారం. ఈ క్రమంలో విశాఖలో తాజా పరిస్థితులపై నారా లోకేష్ ట్విటర్ వేదికగా స్పందించారు. జగన్ విశాఖలో అడుగుపెడితే అరాచకం ఏ రేంజ్‌లో ఉంటుందో వైసీపీ ఇవాళ ట్రైలర్ చూపించిందని మండిపడ్డారు. ఇవాళ గుడ్లు, టమోటాలు విసిరినవాళ్లు.. రేపు బాంబులు, కత్తులు కూడా విసురుతారంటూ విరుచుకుపడ్డారు.

  మూడు ముక్కలాట మొదలు పెట్టి సగం చచ్చారు. ప్రతిపక్ష నేత యాత్రని అడ్డుకునేందుకు గొయ్యి తవ్వి పూర్తిగా చచ్చారు. వైసీపీ డిఎన్ఏ లో ఉన్న దుర్మార్గం, దౌర్జన్యం, దాడులు విశాఖలో బయటపడ్డాయి. వైఎస్ జగన్ విశాఖలో అడుగుపెడితే ఉత్తరాంధ్రలో అరాచకం ఏ రేంజ్ లో ఉంటుందో వైకాపా ఈ రోజు ట్రైలర్ చూపించింది. ప్రతిపక్ష నేత పై ఈ రోజు గుడ్లు,టొమేటోలు రేపు ప్రజల పై బాంబులు, కత్తులతో దిగుతారు.
  నారా లోకేష్


  విశాఖ ఎయిర్‌పోర్టులో దిగిన తర్వాత అక్కడి నుంచి భారీ ర్యాలీగా పెందుర్తి వెళ్లాలని చంద్రబాబు భావించారు.. కానీ ర్యాలీకి విశాఖ పోలీసులు అనుమతించలేదు. పెందుర్తి భూసమీకరణ బాధితులను పరామర్శించే కార్యక్రమానికి షరతులతో కూడిన అనుమతులను మాత్రమే మంజూరు చేసింది. చంద్రబాబు వెంట ఎమ్మెల్యేలు, ఇతర నేతలు 50 మందికి మించి ఉండరాదని స్పష్టం చేశారు. ఐతే టీడీపీ నేతలు మాత్ర ర్యాలీ నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Chandrababu naidu, Nara Lokesh, Visakhapatnam

  ఉత్తమ కథలు