హోమ్ /వార్తలు /national /

Nara Lokesh: సుబ్బయ్య పిల్లల చదువు బాధ్యత నేను తీసుకుంటున్నాను.. నారా లోకేశ్

Nara Lokesh: సుబ్బయ్య పిల్లల చదువు బాధ్యత నేను తీసుకుంటున్నాను.. నారా లోకేశ్

సుబ్బయ్య అంతిమయాత్రలో నారా లోకేష్(Image-Twitter/Nara Lokesh)

సుబ్బయ్య అంతిమయాత్రలో నారా లోకేష్(Image-Twitter/Nara Lokesh)

కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణ హత్యకు గురైన టీడీపీ నాయకుడు నందం సుబ్బయ్య కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు.

  కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణ హత్యకు గురైన టీడీపీ నాయకుడు నందం సుబ్బయ్య కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు. గురువారం నిర్వహించిన సుబ్బయ్య అంత్యక్రియలకు పలువురు టీడీపీ నేతలతో కలిసి నారా లోకేష్ హాజరయ్యారు. సుబ్బయ్య అంతిమయాత్రలో పాల్గొని కన్నీటి నివాళులర్పించారు. సుబ్బయ్య అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. అంత్యక్రియలు ముగిన అనంతరం లోకేశ్ ట్విటర్‌లో స్పందిస్తూ సుబ్బయ్య కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. బాధిత కుటుంబాన్ని, సాక్షులను ప్రలోభ పెట్టినా, వారికి ఏం జరిగిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదే బాధ్యత అని ఆరోపించారు. పోలీసులు ఇచ్చిన హామీ మేరకు సుబ్బయ్య కుటుంబానికి న్యాయం జరగకపోతే మళ్లీ ప్రోద్దుటూరుకు వస్తానని.. మళ్లీ దీక్షకు దిగుతానని చెప్పారు.

  ఇక, సుబ్బయ్య కుటుంబానికి తెలుగు దేశం పార్టీ 20 లక్షల రూపాయలు, కడప జిల్లా టీడీపీ నేతలు 14 లక్షలు మొత్తం కలిపి 34 లక్షల రూపాయల సాయం అందజేస్తున్నామని నారా లోకేశ్ తెలిపారు. సుబ్బయ్య పిల్లల చదువు బాధ్యత తానే తీసుకుంటున్నట్టు లోకేశ్ వెల్లడించారు. సుబ్బయ్య సెల్‌ఫోన్ ట్రేస్ చేస్తే ఎమ్మెల్యే అవినీతి, హత్య ఆధారాలు బయటపడతాయని అన్నారు.

  ఈనెల 29న కడప జిల్లా జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ నేత నందం సుబ్బయ్యను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసిన విషయం తెలిసిందే. పేదలకు ఇళ్ల స్థలాల కింద ఎంపిక చేసిన ప్లాట్లలోనే సుబ్బయ్యను కత్తులతో నరికి చంపారు. ప్రస్తుతం నందం సుబ్బయ్య టీడీపీ జిల్లా అధికార ప్రతినిధిగా ఉన్నారు. రాజకీయ కక్షలతోనే ప్రత్యర్థులు సుబ్బయ్యను హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ హత్య వెనక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఆయన బామమరిది బంగారురెడ్డి, మున్సిపల్ కమిషనర్ అనురాధల హస్తముందని మృతుడి భార్య అపరాజిత ఆరోపిస్తున్నారు.


  సుబ్బయ్య అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బుధవారమే లోకేశ్ ప్రొద్దుటూరు చేరుకున్నారు. ఎమ్మెల్యే ప్రసాద్‌రెడ్డి, ఆయ బావమరిది బంగారురెడ్డి, మున్సిపల్ కమిషనర్ అనురాధల పేర్లను సుబ్బయ్య హత్య నిందితుల జాబితాలో చేర్చాలంటూ ఆందోళన చేపట్టరు. ఈ క్రమంలో లోకేశ్‌తో చర్చలు జరిపిన పోలీసులు సుబ్బయ్య భార్య అపరాజిత స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. కోర్డు ద్వారా ఆ ముగ్గురి పేర్లను నిందితుల జాబితాలో చేర్చేందుకు అంగీకరించారు. ఇక, బుధవారం రాత్రి లోకేశ్ ప్రొద్దుటూరులోనే బస చేశారు.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Kadapa, Nara Lokesh, Tdp

  ఉత్తమ కథలు