హోమ్ /వార్తలు /national /

జగన్‌ను చూస్తే జాలేస్తోందన్న నారా లోకేష్

జగన్‌ను చూస్తే జాలేస్తోందన్న నారా లోకేష్

వ్యవస్థల్ని నాశనం చెయ్యడంలో సీఎం జగన్ ట్రేడ్ మార్క్ ఉందని లోకేశ్ విమర్శించారు. ఆ ట్రాప్‌లో గవర్నర్ చిక్కుకోవడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని వ్యాఖ్యానించారు. మూడు ముక్కలాటకి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం రాష్ట్ర చరిత్రలో బ్లాక్ డే అని నారా లోకేశ్ అన్నారు.

వ్యవస్థల్ని నాశనం చెయ్యడంలో సీఎం జగన్ ట్రేడ్ మార్క్ ఉందని లోకేశ్ విమర్శించారు. ఆ ట్రాప్‌లో గవర్నర్ చిక్కుకోవడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని వ్యాఖ్యానించారు. మూడు ముక్కలాటకి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం రాష్ట్ర చరిత్రలో బ్లాక్ డే అని నారా లోకేశ్ అన్నారు.

జగన్‌ను చూస్తే జాలేస్తోందన్నారు నారా లోకేష్. శుక్రవారం వచ్చేసరికి కోర్టుకు వెళ్లకుండా ఉండేందుకు ఏం చేయాలా అని జగన్ స్కూల్‌ పిల్లాడిలా సాకులు వెతుక్కోవాల్సి వస్తోందని ఎద్దేవా చేశారు.

  ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిపై మరోసారి ట్విట్టర్‌ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు... చంద్రబాబు తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్. సోషల్ మీడియాలో ఎప్పుడూ వైసీపీ ప్రభుత్వంతో పాటు... సీఎం జగన్‌పై సెటైర్లు , విమర్శలు  చేసే లోకేష్ మరోసారి ట్విట్టర్ వేదికగా జగన్ పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.  జగన్‌ను చూస్తే జాలేస్తోందన్నారు నారా లోకేష్. శుక్రవారం వచ్చేసరికి కోర్టుకు వెళ్లకుండా ఉండేందుకు ఏం చేయాలా అని జగన్ స్కూల్‌ పిల్లాడిలా సాకులు వెతుక్కోవాల్సి వస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. వారంలో మిగిలిన రోజులు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పబ్జీ ఆడుకుంటూ కాలక్షేపం చేస్తున్నజగన్‌ ... శుక్రవారం వచ్చేసరికి తాను సీఎంనని గుర్తుకు వచ్చి ఏదో పర్యటనో, రివ్యూనో పెట్టి కోర్టుకు రాలేనంటూ కబురు పంపుతుంటారని వ్యగ్యంగా ట్వీట్ చేశారు.

  మరోవైపు సీబీఐ, ఈడీ కోర్టులో జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణను సీబీఐ,ఈడీ కోర్టు మార్చి 6కి వాయిదావేసింది. ఈకేసులో నిందితులుగా ఉన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, శ్యామ్‌ ప్రసాద్‌రెడ్డి తదితరులు ఇవాళ కోర్టుకు హాజరయ్యారు.

  Published by:Sulthana Begum Shaik
  First published:

  Tags: Ap cm ys jagan mohan reddy, AP Politics, Nara Lokesh

  ఉత్తమ కథలు