హోమ్ /వార్తలు /national /

చిదంబరంను విడిపించడానికి వెళ్తున్న రామోజీ,భువనేశ్వరి..! అంతా ఫేక్ అన్న లోకేష్

చిదంబరంను విడిపించడానికి వెళ్తున్న రామోజీ,భువనేశ్వరి..! అంతా ఫేక్ అన్న లోకేష్

నారా లోకేష్ (Image : Twitter)

నారా లోకేష్ (Image : Twitter)

ఆ ఫోటోలో ఉన్నది నళిని చిదంబరం కాదని.. 'వనజ అనబడే నేను' ఆ మహిళ స్వయంగా ట్విట్టర్‌లో స్పందించారు.ఒకరిని మించి ఒకరు సోషల్ మీడియాలో అబద్దాలు సృష్టిస్తున్నారని విమర్శించారు.

చిదంబరం అరెస్ట్ తర్వాత సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోన్న ఓ ఫోటోపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు,టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి,మరో మహిళ ఆ ఫోటోలో ఉన్నారు. అయితే ఆ మహిళను చిదంబరం భార్య నళినీ చిదంబరంగా పేర్కొంటూ.. వీరు ముగ్గురు కలిసి చిదంబరంను విడిపించడానికి ఢిల్లీ బయలుదేరినట్టుగా ఆ ఫోటో వైరల్ అవుతోంది. దీనిపై స్పందించిన లోకేష్..అదంతా ఫేక్ ప్రచారం అని చెప్పారు. జఫ్ఫాలు మరోసారి పట్టుబడ్డారని.. పేటీఎం బ్యాచ్ సభ్యులు ప్రజలను ప్రతీసారి ఫూల్స్ చేయలేరని మండిపడ్డారు.ఇక ఆ ఫోటోలో ఉన్నది నళిని చిదంబరం కాదని.. 'వనజ అనబడే నేను' ఆ మహిళ స్వయంగా ట్విట్టర్‌లో స్పందించారు.ఒకరిని మించి ఒకరు సోషల్ మీడియాలో అబద్దాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. ఆమె ట్విట్టర్ పోస్టును లోకేష్ 'ఫేక్ అలర్డ్' అంటూ షేర్ చేశారు.

First published:

Tags: Chidambaram, Nara Lokesh, Ramoji rao, Tdp

ఉత్తమ కథలు