హోమ్ /వార్తలు /national /

Nara Lokesh: తన్నులు తిని మసాజ్ చేయించుకున్నామని చెప్తున్నారు.. ఏపీ పోలీసు శాఖపై లోకేష్ ఫైర్

Nara Lokesh: తన్నులు తిని మసాజ్ చేయించుకున్నామని చెప్తున్నారు.. ఏపీ పోలీసు శాఖపై లోకేష్ ఫైర్

ప్రస్తుతం భీమిలిపై అవంతి పూర్తి పట్టు సాధించారు. ఇలాంటి సమయంలో ఆయనను ఢీ కొట్టడం అంతా ఈజీ కాదని స్థానిక రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే లోకేష్ తెప్పించుకున్న రిపోర్టుల్లో మాత్రం భీమిలిలో అయితే గెలిచేందుకు అవకాశం ఉందని.. సాధారణ ఎన్నికల్లో ఓటమి తరువాత సబ్బం హరి.. టీడీపీ కేడర్ పటిష్ట పరిచారని.. ప్రస్తుతం టీడీపీ అన్నీ అక్కడ అనుకూలంగా ఉన్నాయని చెబుతున్నారు.

ప్రస్తుతం భీమిలిపై అవంతి పూర్తి పట్టు సాధించారు. ఇలాంటి సమయంలో ఆయనను ఢీ కొట్టడం అంతా ఈజీ కాదని స్థానిక రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే లోకేష్ తెప్పించుకున్న రిపోర్టుల్లో మాత్రం భీమిలిలో అయితే గెలిచేందుకు అవకాశం ఉందని.. సాధారణ ఎన్నికల్లో ఓటమి తరువాత సబ్బం హరి.. టీడీపీ కేడర్ పటిష్ట పరిచారని.. ప్రస్తుతం టీడీపీ అన్నీ అక్కడ అనుకూలంగా ఉన్నాయని చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

  ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తన్నుల తిని వైకాపా వాళ్లతో మసాజ్ చేయించుకున్నామని చెప్పడానికి సిగ్గుగా లేదా అని ప్రశ్నించారు. వివరాలు.. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ కార్యాలయం ఎదుట విధులు నిర్వరిస్తున్న పోలీసుపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్విటర్‌లో కొన్ని ఫొటోలు పోస్ట్ చేశారు. ఒక పోలీసుపై జరిగిన దారుణమైన దాడి చూస్తుంటే.. వైకాపా గుండాలు ఎంత ధైర్యంగా దాడులకు తెగబడుతున్నారో తెలుస్తోందని విమర్శించారు. ఇకపై ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులకు కూడా రక్షణ లేదని వ్యాఖ్యానించారు. అయితే దీనిపై స్పందించిన ఏపీ పోలీసు శాఖ.. చంద్రబాబు చేసిన పోస్ట్ సరైనది కాదని పేర్కొంది. చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేశాడని.. వైకాపా కార్యకర్తలు కిందపడిపోయిన పోలీసును లేని సాయం అందించారని, గాయాలకు మసాజ్ చేశారని తెలిపింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇటువంటి తప్పుడు ప్రచారాలకు దూరంగా ఉండాలని కోరింది.

  అయితే ఏపీ పోలీసులు ఇచ్చిన సమాధానంపై నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన నారా లోకేష్.. పోలీస్ శాఖ గౌరవాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ‌రెడ్డి కాళ్ల దగ్గర పెట్టకండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీని ప్రసన్నం చేసుకోవడానికి కొందరు పోలీసులు పూర్తిగా దిగజారి పోతున్నారని ఆరోపించారు. వైకాపా గుండాల నుంచి సాటి పోలీసుల్ని కాపాడుకోలేని వాళ్లు.. వాస్తవాలు తెలిసినా కళ్లకి గంతలు కట్టుకుని ఫ్యాక్ట్ చెక్ అంటూ ఫాల్స్ స్టేట్‌మెంట్స్ ఇస్తున్నారని విమర్శించారు.

  Chandrababu Naidu: ఆ పోస్ట్ సరైనది కాదు.. చంద్రబాబు ట్వీట్‌కు ఏపీ పోలీసుల కౌంటర్


  "పోలీసు గాయపడ్డారు అని మీరే అంటున్నారు.మరి ఎవరి దాడిలో పోలీస్ గాయపడ్డారు? ఆయనకి ఆయనే గాయపర్చుకున్నాడా? ఆ వీడియోలు ఎందుకు బయటపెట్టలేదు?బాడీ వార్న్ కెమెరాల వీడియోలు ఎందుకు మాయం అయ్యాయి? గాయపడిన పోలీసు కి అయింట్మెంట్ రాయాల్సింది పోయి జగన్ రెడ్డి కి అయింట్మెంట్ పుయ్యడం బాధాకరం. వైకాపా గూండాల దాడిలోనే పోలీస్ గాయపడ్డారు. వైకాపా నాయకులు పోలీసులపై చేసిన దౌర్జన్యానికి సంబంధించిన వీడియోలు బయటపెట్టే ధైర్యం మీకు ఎలాగో లేదు అందుకే నేను విడుదల చేస్తున్నాను"అని నారా లోకేష్ పేర్కొన్నారు.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Andhra Pradesh, AP Police, Nara Lokesh

  ఉత్తమ కథలు