Home /News /national /

POLITICS NARA LOKESH FIRE ON YCP DOUBLE STAND ON VIZAG STEEL PLANT NGS

Vizag steel Plant:విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పాపం వైసీపీదే.. ఇదిగో ఆదారాలు అంటున్న లోకేష్

నారా లోకేశ్ (ఫైల్ ఫోటో)

నారా లోకేశ్ (ఫైల్ ఫోటో)

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పాపం వైసీపీదే అంటున్నారు నారా లోకేష్.. వైసీపీ నేతలు ఢిల్లీలో ఒక మాట వైజాగ్ లో ఒక మాట చెబుతున్నారని మండిపడ్డారు. తమ కేసుల మాఫీ కోసమే కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వైసీపీ నేతలు వ్యతిరేకించలేకపోతున్నారని లోకేష్ ఆరోపించారు.

ఇంకా చదవండి ...
    విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. మొన్నటి వరకు రిలేదీక్షలకే పరిమితమైన కార్మిక, విద్యార్థి సంఘాలు ఇప్పుడు ఉద్యామానికి మరోరూపం ఇవ్వాలని నిర్ణయించాయి. ఇటీవల ప్రధాని మోదీ వ్యాఖ్యలతో ఇక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పదని తేలిపోయింది. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవీటీకరించక తప్పదని ప్రధాని స్పష్టం చేశారు. మరోవైపు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు, ప్రైవేట్ బిడ్ దాఖలు చేసేందుకు కావలసినటువంటి టెక్నికల్ వివరాలతో పాటుగా ప్లాంట్ సంబంధించిన పూర్తి వివరాలను లాభనష్టాలను, అన్ని వివరాలను పంపించాల్సిందిగా, కేంద్ర ప్రభుత్వం మెయిల్ ద్వారా ఉన్నతాధికారులను కోరినట్టు తెలుస్తోంది.

    తాజా పరిస్థితులు చూస్తుంటే కచ్చితంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా అడుగులుపడుతున్నాయన్నది వాస్తవం. దీంతో కార్మిక సంఘాలు జాతీయ స్తాయిలో తమ నినాదం వినిపించాలి అనుకుంటున్నాయి. ఇతర పార్టీలను కూడా తమ ఉద్యమంలో కలుపుకుని రాజకీయ ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాల మద్దతు లభిస్తోంది. బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఉద్యమంలో భాగమవుతున్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని స్వయంగా సీఎం జగన్, కార్మిక సంఘాలకు హామీ ఇచ్చారు. ఎంపీ విజయసాయి రెడ్డి సేవ్ స్టీల్ ప్లాంట్ నినిదాంతో పాదయాత్ర చేశారు.

    అయితే వైసీపీది డబుల్ స్టాండ్ అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఒకమాట ఢిల్లీలో ఒక మాట ఆ పార్టీ మాట్లాడుతోందని విమర్శించారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చేతకానితనం కారణంగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదన్నారు. 22 మంది ఎంపీలు నెగ్గినా ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేకపోతున్నారని లోకేష్ ప్రశ్నించారు. ఇప్పుడు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను అడ్డుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అన్నారు లోకేష్.

    విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు సంబంధించి పార్లమెంట్‌ కమిటీలో ఎంపీ అవినాష్‌ రెడ్డి సభ్యుడిగా ఉన్నారని.. అయినా ఆ నిర్ణయానికి ఎందుకు అడ్డు చెప్పలేకపోయారని లోకేష్ ప్రశ్నించారు. తమ అధినేత కేసుల మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాలన్నీ అమ్మేస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో కూర్చొని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఒకే చెబుతూ.. ఇక్కడకు వచ్చి పాదయాత్రల పేరుతో డ్రామాలు ఎందుకు చేస్తున్నారని లోకేష్ ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో అసలు దోషి వైసీపీనే అని లోకేష్ ఆరోపించారు. మరోవైపు దేశ వ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సెంచరీ కొట్టాయని. ఏపీలో అయితే డబుల్‌ సెంచరీ దాటినా ఆశ్చర్య పోనక్కర్లేదన్నారు. ఒక్క ఛాన్స్‌ అని చెప్పి రాష్ట్రాన్నే నాశనం చేస్తున్నారని లోకేస్ ఆవేదన వ్యక్తం చేశారు. మరోసారి ఆయనకు అధికారం ఇస్తే కుటుంబాలు ఉండవు. 21 నెలల్లో వైసీపీ ప్రభుత్వం ఏమీ చేయలేదని. శాంతియుతమైన కుప్పంలో కిరాయికి మనుషులను తీసుకొచ్చి అరాచకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను, అభ్యర్థులను బెదిరించకుండా ఓట్లు అడగే ధైర్యం వైసీపీకి ఉందా అంటూ నిలదీశారు.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP News, Nara Lokesh, Vizag Steel Plant

    తదుపరి వార్తలు