హోమ్ /వార్తలు /national /

ఇది జగన్‌ అధికార మదానికి నిదర్శనం... మండిపడ్డ నారా లోకేశ్

ఇది జగన్‌ అధికార మదానికి నిదర్శనం... మండిపడ్డ నారా లోకేశ్

ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ టీడీపీ నినాదమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేశ్ అన్నారు. న్యాయస్థానాల్లో ప్రజల ఆకాంక్షలకు న్యాయం జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజా రాజధాని అమరావతిని పరిరక్షించుకుని తీరుతామని తెలిపారు.

కరోనాపై పోరాడుతున్న డాక్టర్లు, వైద్య సిబ్బందికి మాస్కులు, వ్యక్తిగత రక్షణ కిట్లు ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వం అని ఏపీ సర్కార్‌పై లోకేశ్ మండిపడ్డారు.

    నర్సీపట్నంలో ప్రభుత్వంపై విమర్శలు చేసిన డాక్టర్ సుధాకర్‌ను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేయడంపై టీడీపీ యువనేత, మాజీమంత్రి నారా లోకేశ్ మండిపడ్డారు. మీ ఇగో హర్ట్ అయ్యిందని దళిత వైద్యుడిపై మీ ప్రతాపం చూపిస్తారా అని సీఎం జగన్‌పై పరోక్షంగా ధ్వజమెత్తారు. కరోనాపై పోరాడుతున్న డాక్టర్లు, వైద్య సిబ్బందికి మాస్కులు, వ్యక్తిగత రక్షణ కిట్లు ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వం అని లోకేశ్ మండిపడ్డారు. నర్సీపట్నం ఆస్పత్రి డాక్టర్ సుధాకర్ సస్పెన్షన్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. మాస్కులు అడిగితే సస్పెండ్ చేయడం జగన్ అధికార మదానికి నిదర్శనమని విమర్శించారు.

    డాక్టర్ల దగ్గర ఉండాల్సిన మాస్కులు, వ్యక్తిగత రక్షణ కిట్లు కొట్టేసి మీడియాకు ఫోజులు ఇస్తున్న వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలను ఎం చేయాలని లోకేశ్ ప్రశ్నించారు. అసలు కరోనా పెద్ద విషయం కాదన్న జగన్‌కు ఏ శిక్ష వేయాలని లోకేశ్ ప్రశ్నించారు.

    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Coronavirus, Nara Lokesh, Tdp, Ysrcp

    ఉత్తమ కథలు