ఏపీలో గురువారం అమ్మ ఒడి పథకం ప్రారంభమైన విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లాలో సీఎం జగన్ ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు. పిల్లలను బడికి పంపుతున్న ప్రతీ తల్లికి అకౌంట్లో రూ.15 వేల రూపాయలు ఏపీ ప్రభుత్వం జమచేసింది. అర్హులైన వారందరికీ డబ్బులు పంపించారు. ఐతే నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి అకౌంట్‌కి కూడా రూ.15వేలు జమయ్యాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. నారా దేవాన్ష్ చదువుల కోసం డబ్బులు అందాయని ఓ ఫొటో షికారు చేస్తోంది. దీనిపై ట్విటర్ వేదికగా నారా లోకేష్ స్పందించారు. అది ఫేక్ ఫొటో అని.. ఇందులో నిజం లేదని ఖండించారు.
5 రూపాయల ముష్టికోసం వైకాపా పేటీఎమ్ బ్యాచ్ పడుతున్న కష్టం చూస్తుంటే జాలి వేస్తుంది. అమ్మ ఒడి అని బొమ్మ చూపించారు. బడుగు బలహీన వర్గాలకు చెందాల్సిన 6 వేల కోట్లు పక్కదారి పట్టించారు. ప్రతి బిడ్డకి అమ్మ ఒడి అన్నారు ఇప్పుడు ఇంట్లో ఒక్కరికే అంటున్నారు. అర్హుల సంఖ్య సగానికి కోసారు.(1/2) pic.twitter.com/fBphqVIY8J
— Lokesh Nara (@naralokesh) January 9, 2020
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AP News, Nara Brahmani, Nara Lokesh