హోమ్ /వార్తలు /national /

YCP vs TDP: దమ్ముంటే సింహాచలం రా..! తేల్చుకుందాం..! సీఎం జగన్ కు లోకేష్ సవాల్

YCP vs TDP: దమ్ముంటే సింహాచలం రా..! తేల్చుకుందాం..! సీఎం జగన్ కు లోకేష్ సవాల్

తొలి సారి సీఎం జగన్ కు ధన్యవాదాలు చెప్పిన లోకేష్

తొలి సారి సీఎం జగన్ కు ధన్యవాదాలు చెప్పిన లోకేష్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో హిందూ ఆలయాల (Hindu Temples) సాక్షిగా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ (YSR Congress Party), ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల (Telugu Desham Party) మధ్య మాటల యుద్ధం తీవ్రంగా సాగుతోంది.

ఇంకా చదవండి ...

  ఆంధ్రప్రదేశ్ లో హిందూ ఆలయాల సాక్షిగా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్రంగా సాగుతోంది. ఆలయాలపై దాడుల విషయంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన ఆరోపణలపై నారా లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఫేక్ పార్టీ, ఫేక్ సీఎం.. తన డెకాయిట్ బ్యాచ్ తో ఫేక్ ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. తనపై చేసిన ఆరోపణలన్నీ ఫేక్ అని పింక్ డైమండ్ తోనే తేలిపోయిందన్నారు. ఎన్నాళ్లీ దొంగ ఆరోపణలు చేస్తారని సీఎంను ప్రశ్నించారు. దమ్ముంటే సింహాచలం అప్పన్న ఆలయానికి రావాలని.. నాపై చేసిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలని ప్రమాణం చేయాడానికి నేను సిద్దం.. నువ్వు సిద్ధమా? అంటూ నారా లోకేష్ ఛాలెంజ్ విసిరారు.

  ప్రభుత్వం పట్టించుకోదా..?

  రాష్ట్రంలో ఆలయాలపై దాడులు దురదృష్టకరమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అలయాలపై దాడులు జరుగుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. జగన్ ప్రభుత్వంలో దేవుళ్లకే రక్షణ లేకుండాపోయింది. ప్రభుత్వ అలసత్వం వల్లే దాడులు చోటు చేసుకుంటున్నాయి. కనకదుర్గమ్మ గుడిలో మాయమైన సింహాల ప్రతిమలు ఇప్పటికీ గుర్తించలేదని... అంతర్వేది రథంతగలబెట్టిన నిందితులను ఇప్పటికీ అరెస్ట్ చేయలేదని ఆయన విమర్శించారు. వైసీపీ అదికారంలోకి వచ్చిన హిందూ ధర్మాలకు, సాంప్రదాయాలకు కళ్లెం పడిందని చంద్రబాబు ఆరోపించారు.

  మాన్యాలపై ఉన్న ప్రేమ దేవుడిపై లేదా..?

  మరోవైపు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వానికి దేవుడి మాన్యాలపై ఉన్న ప్రేమ.. దేవుడి ఆలయాలపై లేదని విమర్శించారు. ఏపీలో ఎన్నడూ ఇలాంటి సంస్కృతి లేదని.. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితోనే దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని అచ్చెన్న ఆరోపించారు. అంతర్వేది రథం దగ్ధంపై వేసిన సీబీఐ విచారణలో పురోగతి లేదు. దేవాదాయ శాఖా మంత్రి ఉన్నాడో లేడో కూడా అర్థం కావడం లేదు. వరుస దాడులపై తక్షణమే ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించి నిందుతులను కఠినంగా శిక్షించాలి. లేకుంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిస్తామని హెచ్చరించారు.

  ఉత్తరాంధ్రలో దేవుడి భూమలు దోచుకునేందుకు ముఠాలను దించారని.. రాష్ట్రంలో హిందువులు లేకుండా చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. దమ్ముంటే లోకేష్ విసిరిన సవాల్ స్వీకరించాలన్నారు.

  విజయసాయి రెడ్డి ఏమన్నారంటే..!

  ఆలయాలపై దాడుల వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ హస్తముందని ఆరోపించారు. త్వరలోనే వాస్తవాలన్నీ బయటకు వస్తాయని పేర్కొన్నారు. విశాఖపట్నంలో పర్యటిస్తున్న ఆయన.. రామతీర్థం ఆలయంలో శ్రీరాముడు విగ్రహం ధ్వంసంపై ప్రశ్నించగా.., చంద్రబాబు, లోకేష్ కనుసన్నల్లోనే ఇదంతా జరిగిందని ఆరోపించారు. ఆర్ధరాత్రి సమయంలో కొంతమంది టీడీపీ కార్యకర్తలు ఆలయ తాళాలు పగులగొట్టి విగ్రహాన్ని ధ్వంసం చేశారన్నారు. ప్రస్తుతం విచారణ జరుగుతోందని అతి త్వరలోనే నిజాలు బయటపెడతామన్నారు. రాష్ట్రంలో కల్లోలాలు సృష్టించేందుకు టీడీపీ కుట్రలు చేస్తోందని ఆయన అన్నారు. దీని వెనుక ఎవరున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని విజయసాయి రెడ్డి స్పష్టం చేసారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు.

  మరోవైపు వైసీపీ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఆలయాలకు రక్షణ కరువైందని బీజేపీ తొలి నుంచీ ఆరోపిస్తోంది. తాజాగా దాడులు జరుగుతుంటే సీఎం జగన్ ఏం చేస్తున్నారని ఏపీ బీజేపీ కో ఇన్ ఛార్జ్ సునీల్ ధేవదర్ ప్రశ్నించారు. ఇంతవరకు ఒక్కర్ని కూడా అరెస్ట్ చేయకపపోవడంపై ఆయన మండిపడ్డారు. అధికార ప్రతిపక్షాల మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లతో ఏపీ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Ap cm ys jagan mohan reddy, Bjp, Chandrababu naidu, Nara Lokesh, Tdp, Ysrcp

  ఉత్తమ కథలు