హోమ్ /వార్తలు /national /

జనసేన ఎఫెక్ట్... చంద్రబాబు ముందే చేతులెత్తేసిన టీడీపీ అభ్యర్థులు ?

జనసేన ఎఫెక్ట్... చంద్రబాబు ముందే చేతులెత్తేసిన టీడీపీ అభ్యర్థులు ?

పవన్ కళ్యాణ్, చంద్రబాబునాయుడు

పవన్ కళ్యాణ్, చంద్రబాబునాయుడు

పోలింగ్ సరళి ఏ విధంగా ఉందనే దానిపై రాజమండ్రి పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థితో సమీక్షా సమావేశం నిర్వహించారు టీడీపీ అధినేత చంద్రబాబు. అయితే ఈ సమావేశంలో ఆయనకు అభ్యర్థుల నుంచి ఊహించని సమాధానాలు వచ్చాయని తెలుస్తోంది.

  ఎన్నికల ఫలితాలు రావడానికి ముందే పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులతో సమీక్షలు నిర్వహించి క్షేత్రస్థాయి పరిస్థితిని అంచనా వేయాలని భావించిన టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆదిలో షాక్ తగిలిందని ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కచ్చితమైన అంచనాలతో రావాలని పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన చంద్రబాబు... ముందుగా రాజమండ్రి పరిధిలోని ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థితో సమీక్షా సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశంలో చంద్రబాబుకు అభ్యర్థుల నుంచి ఊహించని సమాధానాలు వచ్చాయని తెలుస్తోంది.


  ఏయే బూత్‌లలో టీడీపీకి ఎన్ని ఓట్లు వస్తాయనే దానిపై టీడీపీ అభ్యర్థులు చంద్రబాబుకు స్పష్టమైన సమాచారం ఇవ్వలేకపోయారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తమ నియోజకవర్గం పరిధిలో జనసేన ప్రభావం ఊహించిన దానికంటే అధికంగా ఉందని... కాబట్టి జనసేన ఎవరి ఓట్లు చీల్చిందనే దానిపైనే తమ గెలుపు ఓటములు ఆధారపడి ఉంటాయని పలువురు అభ్యర్థులు, ద్వితీయ శ్రేణి నాయకులు చంద్రబాబు ముందు కుండబద్ధలు కొట్టినట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని రాజమండ్రి టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగంటి రూప మీడియా ముందే చెప్పడం గమనార్హం.


  ఇదిలా ఉంటే ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన టీడీపీ అభ్యర్థులందరూ చంద్రబాబుకు దాదాపు ఇదే రకమైన నివేదిక ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో జనసేన ఎఫెక్ట్ టీడీపీపై బలంగా ఉందని... ఆ పార్టీ చీల్చబోయే ఓట్లపైనే తమ గెలుపు ఓటములు ఆధారపడి ఉన్నాయని పార్టీ నేతలు చంద్రబాబుకు నివేదిక ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. ఏదేమైనా... ఉభయ గోదావరి జిల్లాల టీడీపీ అభ్యర్థులు ఫలితాలకు ముందే చంద్రబాబు ముందు చేతులెత్తేసినట్టు రాజకీయవర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి.

  First published:

  Tags: Chandrababu naidu, East Godavari Dist, Janasena, Janasena party, Pawan kalyan, Rajahmundry S01p08, Tdp, West Godavari

  ఉత్తమ కథలు