హోమ్ /వార్తలు /national /

జనసేనకు నాదెండ్ల మనోహర్ గుడ్‌బై చెబుతారా...?

జనసేనకు నాదెండ్ల మనోహర్ గుడ్‌బై చెబుతారా...?

పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్

పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్

నాదెండ్ల మనోహర్ గత ఏడాది అక్టోబరులో జనసేనలో చేరారు. ఏప్రిల్‌లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు జిల్లా తెనాలి అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు.

  ఏన్నో అంచనాల మధ్య ఏపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన జనసేన చిత్తుగా ఓడిపోయింది. తాను పోటీచేసిన రెండు స్థానాల్లోనూ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పరాజయం పాలయ్యారు. ఈ ఘోర ఓటమితో జనసేన శ్రేణులు పూర్తిగా డీలాపడ్డాయి. ఈ నేపథ్యంలో పార్టీ నేతలు జనసేనను వీడుతున్నరు. ఇప్పటికే రావెల కిశోర్ బాబు జనసేనకు రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన బీజేపీ గూటికి చేరబోతున్నారు. ఈ క్రమంలో మరో కీలక నేత నాదెండ్ల మనోహర్‌పైనా ప్రచారం జరుగుతోంది.


  శనివారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించిన గుంటూరు జిల్లా సమీక్షకు నాదెండ్ల మనోహర్ హాజరుకాలేదు. దాంతో కిశోర్ బాబు బాటలోనే నాదెండ్ల కూడా పార్టీని వీడతారని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఆయన జనసేనకు గుడ్‌బై చెబుతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాదెండ్ల వ్యవహారంపై జనసేన పార్టీ స్పందించింది. నాదెండ్ల మనోహర్ అమెరికా పర్యటనలో ఉన్నారని..అందుకే సమావేశానికి హాజరుకాలేకపోయారని తెలిపింది. దీనిపై కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తన్నారని...నాదెండ్ల పార్టీని వీడే ప్రసక్తే లేదని స్పష్టంచేసింది.


  నాదెండ్ల మనోహర్ గత ఏడాది అక్టోబరులో జనసేనలో చేరారు. ఏప్రిల్‌లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు జిల్లా తెనాలి అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఇక అదే జిల్లాకు చెందిన రావెల కిశోర్ బాబు ప్రత్తిపాడు జనసేన అభ్యర్థిగా పోటీచేసి పరాజయం పాలయ్యారు. వ్యక్తగత కారణాలతో ఆయన శనివారం జనసేన పార్టీకి రాజీనామా చేశారు.

  First published:

  Tags: AP News, Janasena, Janasena party, Nadendla Manohar, Pawan kalyan

  ఉత్తమ కథలు